P Venkatesh
ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాక్ ఖాతాదారులకు ఊరట కలిగేలా చర్యలు తీసుకుంది. ఇకపై ఆ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేకున్నా ఫైన్ వేయకూడదని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది.
ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాక్ ఖాతాదారులకు ఊరట కలిగేలా చర్యలు తీసుకుంది. ఇకపై ఆ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేకున్నా ఫైన్ వేయకూడదని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది.
P Venkatesh
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని బ్యాంకింగ్ రంగాన్ని పర్యవేక్షిస్తుంటుంది. బ్యాంకు కార్యకలాపాలపై నియమాలను రూపొందించి అమలు చేస్తుంటుంది. భారత ఆర్థిక వ్యవస్త బలోపేతం కోసం పనిచేస్తుంటుంది. బ్యాంకులు ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలను తీసుకుంటుంది. ఆర్బీఐ రూల్స్ ను పాటించని బ్యాంకుల లైసెన్స్ లను రద్దు చేయడం లేదా భారీగా జరిమానాలను విధించడం చేస్తుంటుంది. ఈ క్రమంలో ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాక్ ఖాతాదారులకు ఊరట కలిగేలా చర్యలు తీసుకుంది. ఇకపై ఆ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేకున్నా ఫైన్ వేయకూడదని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది.
తాము సంపాదించిన డబ్బును బ్యాంకుల్లో దాచుకునేందుకు ఖాతాలను ఓపెన్ చేస్తుంటారు. స్కాలర్ షిప్స్ కోసం, ప్రభుత్వ పథకాల కోసం కూడా బ్యాంకు ఖాతాలు తప్పని సరి అయ్యింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉండాల్సిన పరిస్తితి తలెత్తింది. మరి అన్ని ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ మెయిటైన్ చేయడం కష్టంగానే ఉంటుంది. మినిమం బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు పెనాల్టీ ఛార్జీలు వేస్తుంటాయి. ఒక్కొసారి అకౌంట్ మైనస్ లోకి వెళ్తుంటుంది. ఈ నేపథ్యంలో రెండేళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరపని ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ నిర్వహించనందుకు బ్యాంకులు జరిమానా విధించవద్దని ఆర్‌బీఐ ఆదేశించింది. స్కాలర్‌షిప్‌లు, ప్రభుత్వ పథకాల కోసం కొంతమంది బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేస్తుంటారు. కానీ వీటిని పెద్దగా వినియోగించారు. ఇలా రెండేళ్లపాటు అకౌంట్లను వాడకపోతే వాటిని ఇన్ ఆపరేటివ్ అకౌంట్లుగా పరిగణిస్తారు.
ఆ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు పెనాల్టీ విధిస్తాయి. అయితే ఇలాంటి ఖాతాలపై ఇకపై ఎలాంటి జరిమానాలు విధించవద్దని, వాటిని ఇన్ ఆపరేటివ్ అకౌంట్లుగా పరిగణించకూడదని ఆర్బీఐ ఆదేశించింది. ఈ రూల్ వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమలుకానుంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. లావాదేవీలు జరపని ఖాతాలపై ఫైన్ వేయకూడదు. వినియోగదారులకు ఎస్సెమ్మెస్, ఈమెయిల్స్ వంటివి పంపించి, వారికి ఈ విషయం తెలియజేయాలి. ఒకవేళ ఖాతాదారుల నుంచి స్పందన లేకపోతే.. అకౌంట్‌లోని నామినీలకు సమాచారం అందించాలి. అంతేకాదు.. చాలా కాలంగా వినియోగించని అకౌంట్లను రీ యాక్టివేట్ చేయడానికి కూడా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదని ఆర్బీఐ ఆదేశించింది.