మరో బ్యాంక్‌పై RBI కొరడా.. లైసెన్స్ రద్దు చేస్తూ సంచలన నిర్ణయం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో బ్యాంకుపై చర్యలు తీసుకుంది. ఏకంగా బ్యాంక్ లైసెన్స్ ను రద్దు చేసి బిగ్ షాక్ ఇచ్చింది. మరి ఆ బ్యాంకులో మీకు ఖాతా ఉంటే చెక్ చేసుకోండి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో బ్యాంకుపై చర్యలు తీసుకుంది. ఏకంగా బ్యాంక్ లైసెన్స్ ను రద్దు చేసి బిగ్ షాక్ ఇచ్చింది. మరి ఆ బ్యాంకులో మీకు ఖాతా ఉంటే చెక్ చేసుకోండి.

భారత్ కేంద్ర బ్యాంక్ అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తుంది. అంతేగాక బ్యాంకింగ్ వ్యవస్థను నియంత్రిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్ కార్యకలాపాలపై అధికారం చెలాయిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే దేశంలోని అన్ని బ్యాంకులకు బాస్ ఆర్బీఐ. ఆర్బీఐ నిబంధనలు అతిక్రమించిన బ్యాంకులపై చర్యలు తీసుకుంటుంది. ఇదివరకే నిబంధనలు ఉల్లంఘించిన పలు బ్యాంకులకు భారీగా జరిమానాలు విధించింది. కొన్ని బ్యాంకుల లైసెన్సులను సైతం రద్దు చేసింది. ఈ క్రమంలో మరో బ్యాంక్ పై ఆర్బీఐ కొరడా ఝుళిపించింది. ఏకంగా బ్యాంక్ లైసెన్స్ ను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంతకీ అది ఏ బ్యాంక్? ఆ బ్యాంక్ లో మీకు ఖాతా ఉందేమో చెక్ చేసుకోండి?

ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్ లోని బ్యాంకులకు ఆర్బీఐ వరుస షాక్ లు ఇస్తుంది. తాజాగా మరో బ్యాంక్ పై చర్యలు తీసుకుంది. కొల్లాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ‘శంకర్రావు పూజారి నూతన్ నగరి సహకారి బ్యాంక్ లిమిటెడ్’ లైసెన్స్ రద్దు చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్బీఐ తీసుకున్న సంచలన నిర్ణయంతో ఆ బ్యాంకింగ్ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ఆదేశాలు డిసెంబర్ 04 నుంచి అమలులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే బ్యాంకింగ్ చట్టంలోని పలు నిబంధనలను పాటించనందునే ఆ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఎన్‌ఎ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్‌ వంటి వాటికి జరిమానాలు విధించిన విషయం తెలిసిందే.

శంకర్రావు పూజారి నూతన్ నగరి సహకారి బ్యాంక్ లిమిటెడ్ బ్యాంకు వద్ద మూలధనం ఎక్కువగా లేదని గుర్తించింది. అంతేగాక ఆదాయ మార్గాలు కూడా లేకపోవడంతో ఆర్‌బీఐ ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 56, సెక్షన్ 11(1), సెక్షన్ 22(3) నిబంధనలను దృష్టిలో ఉంచుకుని బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసినట్లు ఆర్బీఐ తెలిపింది. నిబంధనలను అమలు చేయడంలో శంకర్రావు పూజారి నూతన్ నగరి సహకారి బ్యాంక్ లిమిటెడ్ విఫలం అయిందని గుర్తించింది.

ఇప్పటికే డిపాజిట్లు చేసుకున్న ఖాతాదారులకు వారి సొమ్మును తిరిగి చెల్లించే స్థితిలో ఈ బ్యాంక్ లేకపోవడం కొసమెరుపు. అయితే బ్యాంక్ లైసెన్స్ రద్దైన వేళ ఆందోళనలో ఉన్న ఖాతాదారులకు ఊరటనిచ్చే విషయం తెలిపింది ఆర్బీఐ. ఈ బ్యాంకులో డిపాజిట్ చేసుకున్న డిపాజిటర్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల వరకు బీమా కవరేజీ ఉంటుందని ఆర్బీఐ వెల్లడించింది.

Show comments