పెండింగ్ చలాన్లను చెల్లించాలనుకుంటున్నారా?.. అయితే Paytm ద్వారా ఇలా చెల్లించండి!

వాహనదారులు పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం చలాన్లపై భారీ రాయితీలను ప్రకటించింది. మీ సేవా ద్వారానే కాకుండా పేటీఎం యాప్ ద్వారా కూడా సులభంగా చలాన్లు చెల్లించొచ్చు.

వాహనదారులు పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం చలాన్లపై భారీ రాయితీలను ప్రకటించింది. మీ సేవా ద్వారానే కాకుండా పేటీఎం యాప్ ద్వారా కూడా సులభంగా చలాన్లు చెల్లించొచ్చు.

వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. తమ వాహనాలపై ఉన్న పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను క్లియర్ చేసుకునేందుకు చలాన్లపై భారీ రాయితీని ప్రకటించిన విషయం తెలిసిందే. పెండింగ్ చలాన్లను వాహనదారులు చెల్లించే విధంగా ప్రోత్సహించడానికి రాయితీలను ప్రభుత్వం ప్రకటిస్తోంది. పెండింగ్ చలాన్లను క్లియర్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 26 2023 నుంచి రాయితీలను అమలు చేస్తోంది. దీనిలో భాగంగా చలాన్లపై రాయితీకి సంబంధించిన జీవోను కూడా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తమ వాహనాలపై పేరుకుపోయిన పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు వాహనదారులు సిద్ధమయ్యారు.

అయితే ప్రభుత్వం ప్రకటించిన రాయితీల పరంగా.. టూవీలర్లు, త్రీ వీలర్లకు 80 శాతం, టీఎస్ఆర్టీసీ బస్సులకు 90 శాతం, కార్లు, హెవీ మోటార్ వెహికిల్స్‌కు 60 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వాహనదారులు తమ పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను క్లియర్ చేసుకోవచ్చు. అయితే పేటీఎం ద్వారా చలాన్లను సులభంగా చెల్లించొచ్చు. మీ సేవా ఇతర సర్వీసుల ద్వారానే కాకుండా ఎంచక్కా ఉన్న చోటు నుంచే పేటీఎం ద్వారా పెండింగ్ చలానాలను కట్టుకోవచ్చు.

పేటీఎం ద్వారా ఎలా చెల్లించాలి అంటే..

  • వాహనదారులు తమ పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను చెల్లించేందుకు పేటీఎం యాప్ ద్వారా సులభంగా చెల్లించొచ్చు.
  • ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో పేటీఎం యాప్ ఓపెన్ చేయండి.
  • ఆ తర్వాత రీచార్జ్ అండ్ పే బిల్ పేమెంట్స్ కనిపిస్తుంది. అందులో వ్యూవ్ మోర్ పైన క్లిక్ చేయండి.
  • ఇప్పుడు కిందికి స్కోల్ చేస్తే ట్రాన్సిట్ కనిపిస్తుంది. అందులో చాలన్ ఆప్షన్ కనిపిస్తుంది.
  • చాలన్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే పే ట్రాఫిక్ చలాన్ ఓపెన్ అవుతుంది.
  • సెర్చ్ బార్ లో ట్రాఫిక్ అథారిటీని( తెలంగాణ ట్రాఫిక్ పోలీస్) ఎంచుకోవాలి.
  • ఆ తర్వాత వెహికిల్ నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి.
  • మీ వాహనంపైన ఉన్న పెండింగ్ చలాన్లు కనిపిస్తాయి.
  • డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, పేటీఎం వ్యాలెట్, పేటీఎం పోస్ట్‌పెయిడ్, యూపీఐ, నెట్‌బ్యాంకింగ్ ద్వారా పెండింగ్ చలాన్లు చెల్లించవచ్చు.
  • పేటీఎం వెబ్‌సైట్‌లో కూడా దాదాపు ఇదే విధంగా పెండింగ్ చలాన్లు చెల్లించవచ్చు.
Show comments