శుభవార్త ! తగ్గిన బంగారం ధరలు!

బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు మామూలైపోయాయి. ఓ రోజు తగ్గితే.. రెండు, మూడు రోజులు వరుసగా పెరుగుతోంది. నిన్న బంగారం ధరలు 22 క్యారెట్లు, 24 క్యారెట్లపై 100 రూపాయలు పెరిగాయి. నిన్న మార్కెట్‌లో మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,300గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,320గా ఉండింది. అయితే, పసిడి ప్రియులకు ఊరట ఇచ్చేలా.. ఈ రోజు బంగారం ధరలు బాగానే తగ్గాయి. 22 క్యారెట్‌పై 150 రూపాయలు 24 క్యారెట్లపై ఏకంగా 160 రూపాయలు తగ్గింది.

మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,150గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,110గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పతనమవటం కారణంగా ఇండియాలో కూడా బంగారం ధరలు దిగివచ్చాయి. ప్రపంచ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 1926 రూపాయలుగా ఉంది. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 150 మేర తగ్గింది. ప్రస్తుతం 55,300 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 24 క్యారెట్ల బంగారం ధరపై 160 తగ్గి.. 60,310 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

వెండి ధరల విషయానికి వస్తే.. వరుసగా రెండు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. నిన్న కిలో వెండిపై 700 రూపాయలు తగ్గింది. నేడు కూడా వెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండిపై 1000 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలలో కిలో వెండి 79 వేల దగ్గర ట్రేడ్‌ అవుతోంది. ఢిల్లీలో కూడా కిలో వెండిపై రూ.1000 తగ్గింది. ప్రస్తుతం కిలో రూ. 75 వేల 200 వద్ద అమ్ముడవుతోంది. మరి, ఈ రోజు బంగారం ధరలు తగ్గటంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Show comments