Venkateswarlu
Venkateswarlu
10 రోజుల ముందు వరకు స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు గత కొద్దిరోజులనుంచి పెరుగుతూ పోతున్నాయి. బంగారం ధరలు తగ్గితే కొందామనుకునే వారికి షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 60 వేలు దాటింది. దీంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు బంగారం వైపు కన్నెత్తి చూడ్డానికి కూడా భయపడుతున్నారు. పెళ్లిళ్లకు, ఏవైనా శుభకార్యాలకు అత్యంత అవసరం అయితేనే తప్ప బంగారం జోలికి పోవటం లేదు.
తాజాగా, 22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు పెరిగింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం ధర కూడా 100 రూపాయలు పెరిగింది. మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,300గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,320గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,450 గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,470గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ముంబై, బెంగళూరు మార్కెట్లలో..
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,300గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,320గా ఉంది. ఇక, వెండి ధరలు కొంత ఊరట కలిగించే విధంగా మారాయి. నిన్నటితో పోల్చుకుంటే దాదాపు 700 రూపాయలు తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో కిలో వెండి 80 వేల దగ్గర మార్కెట్ అవుతూ ఉంది. ఇక్కడి మార్కెట్‌లో కంటే.. ముంబైలో కిలో వెండి ధర చాలా తక్కువగా ఉంది. కిలో 76 వేల రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. మరి, కొనుగోలుదారులు షాక్ ఇచ్చేలా బంగారం ధరలు పెరుగుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.