Select BSNL Number As You Like: BSNL సిమ్ తీసుకుంటున్నారా? ఆన్‌లైన్‌లో మీ నంబర్‌ని మీరే ఎంచుకోండి!

BSNL సిమ్ తీసుకుంటున్నారా? ఆన్‌లైన్‌లో మీ నంబర్‌ని మీరే ఎంచుకోండి!

BSNL Choose Your Mobile Number For Free Of Cost On Online: ప్రతి ఒక్కరికి లక్కీ నంబర్ ఉంటుంది. వాహనాల నంబర్స్ లో, ఫోన్ నంబర్స్ లో లక్కీ నంబర్ ఉండాలని కోరుకుంటారు. అయితే ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ కూడా నచ్చిన నంబర్ ని ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తుంది. దీంతో మీరు మీకు నచ్చిన నంబర్ ని, ఫ్యాన్సీ నంబర్ ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో కథనంలో చూడండి.

BSNL Choose Your Mobile Number For Free Of Cost On Online: ప్రతి ఒక్కరికి లక్కీ నంబర్ ఉంటుంది. వాహనాల నంబర్స్ లో, ఫోన్ నంబర్స్ లో లక్కీ నంబర్ ఉండాలని కోరుకుంటారు. అయితే ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ కూడా నచ్చిన నంబర్ ని ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తుంది. దీంతో మీరు మీకు నచ్చిన నంబర్ ని, ఫ్యాన్సీ నంబర్ ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో కథనంలో చూడండి.

ఎయిర్ టెల్, జియో వంటి నెట్వర్క్ లు టారిఫ్ ధరలను పెంచేయడం బీఎస్ఎన్ఎల్ కి వరంగా మారింది. బీఎస్ఎన్ఎల్ వద్దు అనుకుని వెళ్లిపోయిన వారంతా తిరిగి అదే నెట్వర్క్ కి వస్తున్నారు. దీంతో ఇతర నెట్వర్క్ లకి భారీ దెబ్బ పడింది. లక్షల్లో వినియోగదారులు జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ ల నుంచి బీఎస్ఎన్ఎల్ కి వెళ్లిపోయారు. కొత్త కస్టమర్లు కూడా బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లు తీసుకుంటున్నారు. మరోవైపు బీఎస్ఎన్ఎల్ కూడా దూకుడు నిర్ణయాలతో దూసుకుపోతుంది. జూలై ఒక్క నెలలోనే 2.17 లక్షల మంది కొత్త కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ లోకి వచ్చారు. మీకు కూడా బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కి మారాలని అనుకుంటున్నారా? బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీకు నచ్చిన నంబర్ ని ఎంచుకునే అవకాశం బీఎస్ఎన్ఎల్ కల్పిస్తుంది. ఆన్ లైన్ లోనే ఈ మీకు నచ్చిన నంబర్ ని మీరు ఎంచుకోవచ్చు.

దీని కోసం మీరు ముందుగా గూగుల్ లోకి వెళ్లి ‘BSNL Choose Your Number’ అని గానీ లేదా ‘BSNL Choose Your Mobile Number’ అని గానీ టైప్ చేయాలి. సెర్చ్ మీద క్లిక్ చేస్తే మీకు ‘BSNL CYMN South Zone’ అనే వెబ్ పేజ్ కనిపిస్తుంది. ఈ వెబ్ పేజ్ పై క్లిక్ చేస్తే క వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది. అందులో సౌత్ జోన్, ఈస్ట్ జోన్, నార్త్ జోన్, వెస్ట్ జోన్ కింద ఆంధ్రప్రదేశ్/తెలంగాణ, కేరళ, చెన్నై, తమిళనాడు, కర్ణాటక అనే ఆప్షన్స్ కనబడతాయి. ఆంధ్రప్రదేశ్/తెలంగాణ మీద క్లిక్ చేస్తే ‘ఛాయిస్ నంబర్స్’, ఫ్యాన్సీ నంబర్స్’ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఛాయిస్ నంబర్స్ కింద సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే నాలుగు ఆప్షన్స్ ఉంటాయి. సెర్చ్ విత్ సిరీస్, సెర్చ్ విత్ స్టార్ట్ నంబర్, సెర్చ్ విత్ ఎండ్ నంబర్, సెర్చ్ విత్ సమ్ ఆఫ్ నంబర్స్ ఇలా నాలుగు ఆప్షన్స్ కనబడతాయి. సెర్చ్ విత్ సిరీస్ మీద క్లిక్ చేస్తే బీఎస్ఎన్ఎల్ ఇచ్చిన సిరీస్ లలో మీకు నచ్చిన సిరీస్ నంబర్ ని ఎంచుకోవచ్చు.

సెర్చ్ విత్ స్టార్ట్ నంబర్ మీద క్లిక్ చేసి.. మీ నంబర్ ఏ అంకెతో మొదలవ్వాలో అనేది టైప్ చేస్తే ఆ అంకెతో మొదలయ్యే నంబర్స్ చూపిస్తుంది. ఇందులో మీకు నచ్చిన నంబర్ ని ఎంచుకోవచ్చు. సెర్చ్ విత్ ఎండ్ నంబర్ మీద క్లిక్ చేసి.. మీ నంబర్ లో ఆఖరున ఏ అంకె ఉండాలో అనేది టైప్ చేస్తే ఆ అంకెతో ఎండ్ అయ్యే నంబర్స్ చూపిస్తుంది. ఇందులో మీకు నచ్చిన నంబర్ ని ఎంచుకోవచ్చు. ఆఖరున సెర్చ్ విత్ సమ్ ఆఫ్ నంబర్స్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు మొత్తం 10 అంకెలను కూడితే ఎంత నంబర్ రావాలని అనుకుంటున్నారో ఆ నంబర్ ని ఎంచుకోవచ్చు. ప్రతి ఒక్కరికీ అదృష్ట సంఖ్య ఉంటుంది.

ఉదాహరణకు మీ లక్కీ నంబర్ 8 అనుకుంటే కనుక మీరు సెర్చ్ విత్ సమ్ ఆఫ్ ది నంబర్స్ పక్కన ఖాళీ బాక్సులో 8 టైప్ చేసి సెర్చ్ చేయాలి. అప్పుడు మీకు ఒక ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. అందులో ఇంగ్లీష్, డిజిట్స్ తో కూడిన పదం ఉంటుంది. దాన్ని నమోదు చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. తప్పుగా నమోదు చేస్తే రీఫ్రెష్ చేసి కొత్త పదాన్ని నమోదు చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీకు మొత్తం అంకెలు కూడితే 8 వచ్చే నంబర్స్ కనబడతాయి. వాటిలో మీకు నచ్చిన నంబర్ ని ఎంచుకోవచ్చు. ఈ నాలుగు ప్రక్రియలలో నంబర్ ని ఎంచుకున్నాక రిజర్వ్ నంబర్ మీద క్లిక్ చేస్తే మీ నంబర్ లాక్ అవుతుంది. ఆ తరువాత సమీపంలోని బీఎస్ఎన్ఎల్ ఆఫీసుకు వెళ్లి సిమ్ కార్డు తెచ్చుకుంటే సరిపోతుంది. మీరు కొంత డబ్బు చెల్లించి ఫ్యాన్సీ నంబర్లు కూడా ఎంపిక చేసుకోవచ్చు.  

Show comments