Arjun Suravaram
Arjun Suravaram
ఏపీ స్కిల్ డెవల్మంప్ స్కామ్ లో నారా చంద్రబాబు నాయుడు అరెస్టైన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ టీడీపీ తమ్ముళ్లు తెగ గగ్గోలు పెడుతున్నారు. వీరిక తోడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబు అరెస్టుపై స్పందించాడు. ఇక మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా మరిది అరెస్టై పై తెగ బాధపడిపోతున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. ఆమె బీజేపీ అధ్యక్షురాలిగా కాకుండా టీడీపీ అధ్యక్షురాలిగా పని చేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. తాజాగా వైఎస్సార్ సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. అమ్మ పురందేశ్వరి గారూ..మీ చుట్టం చట్టాన్ని ఉల్లంఘించాడు అంటూ సెటైర్లు వేశారు.
చంద్రబాబు అరెస్ట్ అయిన నాటి నుంచి బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వ్యవహారం వింతగా ఉంది. బీజేపీ కార్యకలాపాలపై కాకుండా మరిది కేసులకు సంబంధించిన విషయాల్లో, ఆయనను ఎలా బయటకు తీసుకురావాలి వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆమె వ్యవహార తీరుపై ట్విట్టర్ వేదికగా వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో చురకలు అంటించారు. “అమ్మా పురందేశ్వరి గారూ.. మీ చుట్టం చట్టాన్ని ఉల్లంఘించాడు. నేరం జరిగింది. మీ మరిది చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు. 13 సార్లు సంతకం కూడా చేశాడు. అయినా ఆయనకు చట్టం వర్తింపజేయటానికి వీల్లేదని మీరు ఢిల్లీలో క్యాంపెయిన్ చేస్తున్నారు” అంటూ విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు.
ఒక ఫేక్ అగ్రిమెంట్ తో స్కిల్ స్కాం చేశారని కేంద్ర ప్రభుత్వం ఈడీ అరెస్టులు కూడా చేసిందని, ఆ ఒప్పందం ఫేక్ అని సీమన్స్ కంపెనీ కూడా ధ్రువీకరించిందని ఆయన తెలిపారు. అంతేకాక ఆ అగ్రిమెంట్ తో తమకు సంబంధం లేదని కూడా సీమెన్స్ కంపెనీ చెప్పిందని, ఆ డబ్బు తమకు అందలేదని 164 స్టేట్ మెంట్ లో చెప్పిందని సాయి రెడ్డి పేర్కొన్నారు. సాక్షాత్తు మీ మరిది చంద్రబాబు ఆ డబ్బును షెల్ కంపెనీల ద్వారా ఎలా పొందాడో స్వయంగా ఆయన పీఏ వెల్లడించిన విషయం ఐటీ శాఖ నిర్ధారించిందని ఆయన తెలిపారు. ఒక చిన్న కేసులో ఏకంగా 119 కోట్ల ముడుపుల్ని నిర్ధారిస్తూ కేంద్ర ప్రభుత్వ ఐటీ శాఖ, మీ మరిది చంద్రబాబుకు సుదీర్ఘమైన ఉత్తర ప్రత్యుత్తరాలు తరువాత షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చిందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. మరి.. పురందేశ్వరిపై విజయసాయిరెడ్డి చేసిన ఈ ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
1/3. అమ్మా పురందేశ్వరిగారూ…
మీ చుట్టం చట్టాన్ని ఉల్లంఘించాడు. నేరం జరిగింది. మీ మరిది చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు. 13సార్లు సంతకం కూడా పెట్టాడు. అయినా ఆయనకు చట్టం వర్తింపజేయటానికి వీల్లేదని మీరు ఢిల్లీలో క్యాంపెయిన్ చేస్తున్నారు.2/3. ఒక ఫేక్ ఎగ్రిమెంట్తో స్కిల్… pic.twitter.com/nuT2FCcX9X
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 12, 2023