Siddam Sabha: సిద్ధం సభ-4లో ప్రతిపక్ష కూటమిపై నిప్పులు చెరిగిన జగన్‌! మేనిఫెస్టోపై ప్రకటన

Siddam Sabha: సిద్ధం సభ-4లో ప్రతిపక్ష కూటమిపై నిప్పులు చెరిగిన జగన్‌! మేనిఫెస్టోపై ప్రకటన

Medarametla, Siddam Sabha: మేదరమెట్ల సిద్ధం సభలో వైసీప అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రసంగిస్తూ.. ప్రతిపక్ష కూటమిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మూడు పార్టీల కూటమిపై స్పందిస్తూ.. 2014 నాటి మేనిఫెస్టోను చదివి వినిపించారు. మరిన్ని హైలెట్‌ పాయింట్స్‌ ఇప్పుడు చూద్దాం..

Medarametla, Siddam Sabha: మేదరమెట్ల సిద్ధం సభలో వైసీప అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రసంగిస్తూ.. ప్రతిపక్ష కూటమిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మూడు పార్టీల కూటమిపై స్పందిస్తూ.. 2014 నాటి మేనిఫెస్టోను చదివి వినిపించారు. మరిన్ని హైలెట్‌ పాయింట్స్‌ ఇప్పుడు చూద్దాం..

2024 ఎన్నికలే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సిద్ధం సభలతో జనంలోకి వెళ్తున్నారు. ఇప్పటికే మూడు సిద్ధం సభలను సూపర్‌ సక్సెస్‌గా నిర్వహించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం అద్దంకి మేదరమెట్లలో నాలుగో సిద్ధం సభ నిర్వహించింది. ఈ సభకు జనం పొటెత్తారు. కనుచూపు మేరంతా వైఎస్సార్‌ సీపీ జెండాలు పట్టుకున్న జనమే కనిపిస్తూ.. జన సునామీని తలపించింది మేదరమెట్ల సిద్ధం సభా ప్రాంగణం. గతంలో జరిగిన మూడు సిద్ధం సభలను మించి ఈ నాలుగో సిద్ధం సభ నిర్వహించారు. ఈ సభలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రసంగిస్తూ.. ప్రతి పక్ష కూటమిపై నిప్పులు చెరిగారు. గతంలో అంటే.. 2014లో ఇవే పార్టీలు జత కట్టి రాష్ట్రాన్ని నాశనం చేశాయని మండిపడ్డారు. వైసీపీ జనం బలంతో తలపడుతుంటే.. చంద్రబాబు మాత్రం పొత్తులతో వస్తున్నారని ఎద్దేవా చేశారు.

నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని పార్టీలతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని, ఆయా పార్టీలకు సేనాధిపతులు ఉన్నారే కానీ, సైన్యం లేదని అన్నారు. చంద్రబాబు వెనున జనం లేరు కాబట్టే పొత్తులు పెట్టుకుంటారని విమర్శించారు. బాబుకు ఉన్నట్లు తనకు పొలిటికల్‌ స్టార్స్‌ లేరని, రకరకాల పార్టీలతో పొత్తు లేదని, ఒంటిరిగానే పోటీకి వెళ్తున్నానని, పేద ప్రజలే తమకు స్టార్‌ క్యాంపెయినర్లు అంటూ జగన్‌ పేర్కొన్నారు. ఈ ఎన్నికలు విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతున్నాయని అన్నారు. చంద్రబాబు సైకిల్‌కు ట్యూబ్‌ లేదని, చక్రాలు లేవని, తుప్పు పట్టిన ఆ సైకిల్‌ను తోయడానికి ఆయనకు వేరే పార్టీల వాళ్లు కావాల్సి వచ్చిందంటూ.. పరోక్షంగా పవన్‌ కళ్యాణ్‌, నరేంద్ర మోదీలపై విమర్శలు గుప్పించారు.

చంద్రబాబు ప్యాకేజీ ఇచ్చి ఓ దత్తపుత్రుడిని తెచ్చుకున్నారని, అతను బాబు కూర్చోమంటే కూర్చుంటాడని, కనీసం సైకిల్‌ సీటు కూడా అడగడని, తనను నమ్ముకున్న వాళ్ల కోసం కూడా సీట్లు అడగడని జనసేన అధినేతపై పరోక్ష విమర్శలు చేశారు. అలాగే ఏపీలో సైకిల్‌ నడవడం లేదని దత్తపుత్రుడితో కలిసి వెళ్లి ఢిల్లీలో చంద్రబాబు మోకరిల్లుతున్నారని జగన్‌ ఘటూ విమర్శలు చేశారు. 2014లో మూడు పార్టీలు కలిసి ఇచ్చిన హామీలను నేరవేర్చలేదని, అప్పటి టీడీపీ, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను సభా వేదిక పైనుంచి జగన్‌ చదవి ప్రజలకు వినిపించారు. ఇక రాబోయే ఎన్నికల కోసం ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే.. సరికొత్త మేనిఫెస్టోను కూడా త్వరలోనే ప్రకటిస్తామని వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వెల్లడించారు. దీంతో.. వైఎస్సీర్‌ సీపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. మేనిఫెస్టో జనాకర్షకంగా ఉంటే.. 2019లోలానే ఈ సారి కూడా వైసీపీ క్లీన్‌ స్వీప్‌ చేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి మేదరమెట్ల సిద్ధం సభపై, వైఎస్‌ జగన్‌ స్పీచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments