P Krishna
Visakhapatnam News: ఆమె మంచి చదువు చదివింది.. మంచి ఉద్యోగం చేస్తుంది. కొంత కాలంగా తీవ్రమైన మానసిక ఇబ్బందికి గురై ఆవేదన చెంది దారుణమైన నిర్ణయం తీసుకుంది.
Visakhapatnam News: ఆమె మంచి చదువు చదివింది.. మంచి ఉద్యోగం చేస్తుంది. కొంత కాలంగా తీవ్రమైన మానసిక ఇబ్బందికి గురై ఆవేదన చెంది దారుణమైన నిర్ణయం తీసుకుంది.
P Krishna
ఈ మద్య చాలా మంది ప్రతి చిన్న విషయానికి తీవ్ర మనస్థాపానికి గురై సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంచి ఉద్యోగం, సంపాదన ఉన్నప్పటికీ తాము కోరుకున్న జీవితాన్ని పొందలేకపోతున్నామన్న డిప్రేషన్ తో కొంతమంది ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలు ఇలా ఎన్నో కారణాల వల్ల మనస్థాపానికి గురైన వారు బలవన్మరణాలకు పాల్పపడుతున్నారు. ఓ మహిళ తన కష్టంపై జీవించాలని చదువులో రాణించి లెక్చర్ గా విజయనగరం జిల్లా తాటిపూడిలో జాబ్ చేస్తుంది. కొంత కాలంగా మానసికమైన ఇబ్బందితో జీవితంపై విరక్తి చెంది దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఈ ఘటప అనకాపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
అనకాపల్లి పట్టణానికి శివారంలో ఉన్న శారదానగర్ లో ఓ మహిళా లెక్చరర్ కొంతుకోసుకొని బలవన్మరణానికి పాల్పపడటం తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన సీఐ శంకర్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. గుత్తికొండ నూకర రాజు కొంతకాలంగా ముత్రాసీ కాలనీలో భార్య, పిల్లలతో నివాసం ఉంటున్నాడు. ఆయన కూతురు ఉమాదేవి (32)కి గుండాల జంక్షన్ ప్రాంతానికి చెందిన రాజేష్ తో 2011 వివాహం జరిగింది.కొంతకాలం వీరి కాపురం ఎంతో సజావుగా సాగింది. తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఉమాదేవి ఒంటరిగానే ఉంటుంది. ఆమెకు కొంత కాలంగా వివాహ సంబంధాలు చూస్తున్నా ఏ ఒక్కటీ సెట్ కావడం లేదు.
విజయనగరం జిల్లా ఎస్ కోట మండలంలోని తాటిపూడి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ లో కాంట్రాక్ట్ లెక్చరర్ గా పనిచేస్తున్న ఆమె వేసవి సెలవలు కావడంతో ముత్రాసి కాలనీలోని తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. తండ్రి నూకరాజు కిరాణా షాపు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి సమయంలో తల్లి, సోదరుడు వేర్వేరు పనులపై బయటకు వెళ్లారు. రాత్రి పది గంటల తర్వాత తండ్రి నూకరాజు ఇంటికి చేరుకున్నాడు. ఎంతసేపటికీ తలుపులు తీయకపోవడంతో స్థానికుల సహాయంతో కిటీకీ రెక్కలు తెరిచి చూశారు. లోపల దృశ్యం చూసి ఒక్కసారే షాక్ తిన్నాడు. తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లారు. ఎదురుగా ఉమాదేవి గొంతు కోసుకొని రక్తపు మడుగులో కనిపించింది. విడాకులు తీసుకున్న తర్వాత ఉమాదేవికి కుటుంబ సభ్యులు ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా కుదరకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పపడిందా? లేక మరే ఇతర కారణాల వల్ల అయినా ఈ ఘాతుకానికి పాల్పపడి ఉండొచ్చు అని సీఐ తెలిపారు. సంఘటన స్థలం నుంచి కత్తీ, ఆమె సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని.. ఆమె తండ్రి నూరరాజు ఇచ్చిన ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చెస్తున్నామని తెలిపారు.