రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయ MLC షేక్ సాబ్జీ కన్నుమూత

ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల్లో ప్రముఖులు మృత్యువాత పడిన సంగతి విదితమే. తాజాగా టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించారు. భీమవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కారు..

ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల్లో ప్రముఖులు మృత్యువాత పడిన సంగతి విదితమే. తాజాగా టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించారు. భీమవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కారు..

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు రక్తమోడుతున్నాయి. ఈ ప్రమాదాల్లో సామాన్యులే కాదూ..సెలబ్రిటీ, రాజకీయ నేతలు కన్నుమూశారు. తాజాగా భీమవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ కన్నుమూశారు. అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనలో పాల్గొనేందుకు  సాబ్జీ ఏలూరు  వెళ్లారు. ఆందోళన అనంతరం భీమవరం తిరిగి వస్తుండగా.. ఆయన కారును మరో వాహనం ఢీ కొట్టింది. తీవ్ర గాయాలైన ఆయన ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూశారు. శుక్రవారం ఉదయం ఏలూరు నుండి  భీమవరం వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఉండి మండలం చెరుకువాడ సెంటర్లో ఆయన కారును మరో కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మరో నలుగురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.

అంగన్ వాడీ సమ్మెలో పాల్గొని, ఆశా వర్కర్స్ యూనియన్ చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  ఏలూరు నుండి భీమవరంకు వెళ్తున్న ఎమ్మెల్సీ కారును ఎదురుగా వస్తున్న కారు అదుపు తప్పి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సాబ్జీ మృతి చెందారు. కారు డ్రైవర్, గన్ మెన్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. సాబ్జీ మృతదేహాన్ని భీమవరం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ ప్రశాంతి, జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ ఆసుపత్రికి చేరుకుని వివరాలను తెలుసుకుంటున్నారు. 2021లో ఆంధ్రప్రదేశ్ ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా.. యుడిఎఫ్ బలపరిచిన అభ్యర్థిగా బరిలోకి దిగిన షేక్ సాబ్జీ విజయం సాధించారు.

Show comments