బాబు విచిత్రమైన ప్లాన్లు.. తలలు పట్టుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!

Chandrababu, TDP: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఓటమి భయంతో తాను చేస్తున్నాడో కూడా అర్థం కావడం లేదు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలుపును ఆపేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో టీడీపీ నేతలకు తలనొప్పి తెస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది.

Chandrababu, TDP: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఓటమి భయంతో తాను చేస్తున్నాడో కూడా అర్థం కావడం లేదు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలుపును ఆపేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో టీడీపీ నేతలకు తలనొప్పి తెస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది.

ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా ఉన్నాయి. సమ్మర్ ఇంకా రాలేదు.. కానీ.. ఆ వేడికి ఏ మాత్రం తగ్గకుండా ఏపీ ఎన్నికల హీట్ మాత్రం కొనసాగుతోంది. ఇదే  సమయంలో వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావాలని వైఎస్సార్ సీపీ వ్యూహాలు రచిస్తుంది. ఇదే సమయంలో సీఎం జగన్ గెలుపును ఆపాలనే ప్రతిపక్ష టీడీపీ, జనసేన విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఇలా వచ్చే ఎన్నికల్లో జగన్ విజయాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు చిత్రవిచిత్రమైన ప్లాన్లు వేస్తున్నారు. అవి స్థానికంగా రివర్స్ అవుతుండటంతో తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు.

టీడీపీ, జనసేన కూటమిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న సంగతి తెలిసింది. ఇప్పటికే 118తో తొలిజాబితాను విడుదల చేశారు. ఈ ఉమ్మడి అభ్యర్థుల ప్రకటనతో చాలా చోట్ల అసమ్మతి సెగలు రేగాయి. జనసేన  కేవలం 24 స్థానాల్లోనే పోటీ చేయనుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు, కాపు సంఘ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇవేమి పట్టించుకోని చంద్రబాబు నాయుడు కొత్త ప్లాన్ అమలు చేస్తున్నాడు. రాజకీయ విలువలను గంగలో కలిపి ఇష్టాను రీతిగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అలానే ఎలాగైనా సీఎం జగన్ విజయాన్న అడ్డుకోవాలనే ఆలోచనలో చాలా చిత్రమైన వ్యూహాలు రచిస్తున్నారని టాక్.

ఈ క్రమంలో బయటకు వచ్చినదే ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు. ఈ కామెంట్స్ చేసే ముందు చంద్రబాబుతో పీకే బేటీ అయ్యారని టాక్. బాబు ఇచ్చిన డైరెక్షన్ మేరకే ప్రశాంత్ కిషోర్  జగన్ పై వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు.  అయితే లాజిక్ మిస్సై ప్రశాంత్ కిషోర్ మాట్లాడటంతో  అడ్డంగా బుక్కయ్యారనే వార్తలు వినిపిస్తోన్నాయి. అలానే వైసీపీ నుంచి వచ్చిన వాళ్లకి  టికెట్లు ఇస్తే..బాగుంటుందని, ఎంతో కాలం నుంచి పార్టీ కోసం కష్టపడిన వారని బాబు పక్కన పెడుతునట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీలోని చాలా మంది నేతలు బాబుపై వ్యతిరేకంగా, ఆగ్రహం ఉన్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడిన మమ్మల్ని కాదని, పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వడం ఏంటనే ఫైర్ అవుతున్నారంట.

అలానే పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించకుండా డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారనే పలు నియోజకవర్గాల్లో ఎన్నారైలను బరిలో దింపాడు. ఇది కూడా తెలుగు తమ్ముళ్లకు ఆగ్రహం తెప్పిస్తుందని సమాచారం. డబ్బులతోనే  విజయం సాధిస్తామనకుంటే.. ఇక అందరూ ఎన్నారైలనే పోటీ చేయిండండి.. అంటూ పలువురు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలానే ఇద్దరికి మంచి ఎక్కువ మందికి చివరి వరకు టికెట్ ఆశ చూపి.. చివర్లో అందరికి హ్యాండ్ ఇస్తూ కొత్తవారిని తీసుకొస్తున్నాడు. ఇలా చంద్రబాబు వేస్తున్న విచిత్రమైన ప్లాన్లకు గెలుపు సంగతి పక్కన పెడితే.. మరోసారి చిత్తుగా ఓడిపోవడం ఖాయమని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది.

Show comments