మహిళల కోసం పింక్ టాయిలెట్స్.. ఎక్కడంటే..?

ఏదైనా పనిమీద బయటకు వెళితే.. పర్సనల్ ప్లాబ్రమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు మహిళలు. టాయిలెట్స్ ఎమర్జెన్సీ, పీరియడ్స్ వంటివి రావడం వంటి సమస్యలు వస్తుంటాయి. అలాంటి వారి కోసం పింక్ టాయిలెట్స్ తీసుకువచ్చారు ఎక్కడంటే..?

ఏదైనా పనిమీద బయటకు వెళితే.. పర్సనల్ ప్లాబ్రమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు మహిళలు. టాయిలెట్స్ ఎమర్జెన్సీ, పీరియడ్స్ వంటివి రావడం వంటి సమస్యలు వస్తుంటాయి. అలాంటి వారి కోసం పింక్ టాయిలెట్స్ తీసుకువచ్చారు ఎక్కడంటే..?

మహిళలు బయటకు వెళ్లినప్పుడు.. టాయిలెట్స్ ఎమర్జెన్సీ అయితే.. ఎక్కడకు వెళ్లాలో అర్థం కాక సతమతమౌతుంటారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాయిలెట్స్ ఎక్కడ ఉంటాయో తెలియక.. చివరకు ఇంటికి వెళ్లేదాక ఓపిక పడుతుంటారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడుతుంటాయి. కొన్ని సార్లు టాయిలెట్స్ రోడ్డు ప్రక్కనే ఉన్నా.. మగవాళ్లకు, ఆడ వాళ్లకు కలిపి ఉండటంతో వెనకడుగు వేస్తుంటారు. మరి కొంత మహిళలు అవి శుభ్రంగా ఉండకపోవడంతో వెళ్లేందుకు సంకోచిస్తుంటారు. ఇక రోడ్డు మీద పీరియడ్స్ వంటి ప్రాబ్లమ్స్ ఎదురైతే.. ఆ బాధ వర్ణనాతీతం. అలాగే పిల్లలకు పాలు ఇవ్వాలన్న ఫీడింగ్ రూం ఎక్కడ ఉంటుందో తెలియదు.

దీంతో సిగ్గు పడుతూనే కొంగు చాటున కొంత మంది మహిళలు పాలు పడుతుంటారు. అదే డ్రెస్ వేసుకున్న మహిళలు అయితే.. ఇది పెద్ద సమస్యే. చిన్న పిల్లలను ఓదార్చడం కూడా కష్టమే అవుతుంది. ఏ పని మీద వెళ్లినా ఇలా అర్థంతరంగా ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి. ఈ మధ్యలో ట్రాఫిక్ జాం, లేదా అనుకోని ఉపద్రవాలు ఎదురైతే.. దరిదాపుల్లో నివాస గృహాలు కూడా లేకపోతే.. ఆ బాధలు చెప్పలేనివి కాదు. ఇలాంటి సమస్యలు దృష్ట్యా..  మహిళలు, అమ్మాయిలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా పింక్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు ఏపీలోని ప్రధాన నగరమైన విజయవాడలో. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ పింక్ టాయిలెట్స్ ఆడవాళ్ల కోసం అందుబాటులోకి వచ్చాయి.

విజయవాడలోని బెంజ్ సర్కిల్‌లో పింక్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు అధికారులు. మహిళల కోసమే ఈ ప్రత్యేక టాయిలెట్స్ అందుబాటులోకి తెచ్చారు. గృహిణులే కాకుండా ఉద్యోగులు, విద్యార్థులు, పిల్లల ఉన్న తల్లులు ఈ టాయిలెట్లు బాగా ఉపయోగపడునున్నాయి. ఇక్కడ కేవలం టాయిలెట్సే కాదూ..మరికొన్ని వసతులను తీసుకువచ్చారు. ఇందులో ఫీడింగ్ రూం ఏర్పాటు చేశారు. ఈ టాయిలెట్స్ లో పిల్లలున్న తల్లులు.. తమ బిడ్డలకు పాలు కూడా ఇవ్వొచ్చు. అంతేకాకుండా శానిటరీ నాప్ కిన్స్ కూడా తక్కువకే పొందొచ్చు. 5 రూపాయల పెడితే.. మూడు శానిటరీ ప్యాడ్స్ వస్తాయి. మహిళా ప్రయాణీకులు ఫ్రెష్ అయ్యేందుకు తగు ఏర్పాట్లు చేశారు.

Show comments