Pawan, Chandrababu: ఆ మాటలు.. పవన్ బాబుకిచ్చిన సంకేతమా?

బుధవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ, టీడీపీ నేతలను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు బాబుకు కొత్త టెన్షన్ తెచ్చిపెట్టాయనే టాక్ వినిపిస్తోంది.

బుధవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ, టీడీపీ నేతలను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు బాబుకు కొత్త టెన్షన్ తెచ్చిపెట్టాయనే టాక్ వినిపిస్తోంది.

ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ, జనసేన కూటమి ఆపసోపలు పడుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహాలు అర్థం కాక చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి సిద్ధం పేరుతో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం దూసుకెళ్తున్నారు. ఆయన సభలకు వచ్చే జనం చూసి.. ప్రత్యర్థి పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి అంతఅగమ్యగోచరంగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం పశ్చిమ గోదావరి పర్యటనలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు బాబులో కొత్త టెన్షన్ పుట్టిస్తున్నాయంట.

బుధవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం వెళ్లారు. అక్కడ బీజేపీ, టీడీపీ నాయకులను మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వయస్సు మీద పడిన నాయకులు పదవుల కోసం ఇంకా పాకులాడటం మంచి కాదని, రిటైర్మెంట్ తీసుకుని కొత్త తరంకి అవకాశం ఇవ్వాలన్నారు. 80 నుంచి 90 ఏళ్లు వచ్చే వరకు రాజకీయం చేస్తామంటే.. కొత్తతరంకి అవకాశం ఎలా వస్తుందని ప్రశ్నించారు. అలాంటి వాళ్లు రిటైర్మంట్ తీసుకోవాలని స్పష్టం చేశారు.

పవన్ వ్యాఖ్యలు పరోక్షంగా చంద్రబాబు నాయుడికే సంకేతమిచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే దాదాపు 40 ఏళ్ల చంద్రబాబు రాజకీయంలో 14 ఏళ్లు సీఎం పదవిని అనుభవించారు. ఏళ్ల తరబడి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆయన పక్కకు తప్పుకుని తమకు అవకాశం ఇవ్వాలని పవన్ కల్యాణ్ పరోక్షంగా సంకేతం ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానం విషయంలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్ ను ప్రకటించారు. అయితే అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే,  టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ఇప్పటికే ఆరు సార్లు ఎమ్మెల్యే విజయం సాధించి.. స్థానికంగా బలమైన నేతగా ఉన్నారు. 2019 జగన్ సునామీలో కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు.

ఇలా జనసేన,టీడీపీ మధ్య రాజమండ్రి రూరల్ వేదికగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఇలాంటి సమయంలో భీమవరంలో చేసిన వ్యాఖ్యలు బుచ్చయ్య చౌదరిని ఉద్దేశించే అని మరికొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన వయస్సు మీద పడిందని, రిటైర్మెంట్ ఇస్తే కొత్త తరం వారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుందని పరోక్షంగా పవన్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ మాటలు బుచ్చయ్య చౌదరి , మరికొందరు సీనియర్ నేతలను ఉద్దేశించి అన్న మాటలుగా కనిపించినా.. అవి చంద్రబాబుకు కూడా వర్తిస్తాయని ప్రచారం సాగుతోంది.  ఇలానే పవన్ చెప్పినట్లే ఇతర నేతలకు కూడా వివిధ స్థానాల్లో సీనియర్లను పక్కన పెట్టమని ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మొత్తంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకు కొత్త టెన్షన్ ను తెచ్చిపెట్టాయని పొలిటికల్ సర్కిల్ టాక్ వినిపిస్తోంది.

Show comments