Newly Married Couple Arrested In Tiruchanoor: తిరుమల దర్శనానికి వచ్చిన కొత్త జంట.. అరెస్ట్‌ చేసిన పోలీసులు.. ఏమైందంటే..!

తిరుమల దర్శనానికి వచ్చిన కొత్త జంట.. అరెస్ట్‌ చేసిన పోలీసులు.. ఏమైందంటే..!

కొత్తగా పెళ్లి చేసుకుని దైవ దర్శనానికి వచ్చిన జంటను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అసలేం జరిగిందంటే..

కొత్తగా పెళ్లి చేసుకుని దైవ దర్శనానికి వచ్చిన జంటను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అసలేం జరిగిందంటే..

సాధారణంగా మన దగ్గర కొత్తగా పెళ్లైన దంపతులు.. చాలా మంది వివాహం అయిన వెంటనే దైవ దర్శనానికి వెళ్తుంటారు. అలానే ఆ జంట కూడా పెళ్లి కాగానే తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లారు. దైవ దర్శనం కోసం వెళ్లిన వారి ముందు ఉన్నట్లుండి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. కొత్త జంటను అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరుగుతుందో వారికి అర్థం కాలేదు. దైవ దర్శానికి వస్తే.. ఇలా పోలీసులు అరెస్ట్‌ చేయండ ఏంటని షాకయ్యారు. చుట్టూ ఉన్న వాళ్లు కూడా కంగారు పడ్డారు. అసలింతకు ఏం జరిగింది.. ఎందుకు పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారంటే..

తిరుమల దర్శనానికి వచ్చిన విజయవాడకు చెందిన కొత్త జంటను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. ఆ వివరాలు.. విజయవాడకు చెందిన సాంబశివరావు అలియాస్ శివ, అలేఖ్య గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇరు కుటుంబాల పెద్దలకు వారి పెళ్లి ఇష‍్టం లేదు. దాంతో  రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. దాంతో అలేఖ్య కుటుంబ సభ్యులు.. విజయవాడలోని భవానీపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కంప్లైంట్‌ తీసుకున్న పోలీసులు.. విచారించగా.. కొత్త జంట తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తున్న విషయం తెలుసుకున్నారు.  దీని గురించి భవానీపురం పోలీసులు తిరుచానూరు అధికారులకు తెలిపారు.

కొత్త జంట వాహనంలో తిరుచానూరు సమీపంలోకి వస్తుండగా పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఈ విషయం గురించి భవానీపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అలేఖ్య మాత్రం తాము ఇద్దరం గత 11 ఏళ్లుగా ప్రేమించుకున్నామని.. ఇప్పుడు ఇష్టపడి పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. పైగా తాము ఇద్దరు మేజర్లమని.. వెల్లడించారు. అంతేకాక పోలీసులు తమకు రక్షణ కల్పించాలంటూ ఓ వీడియోను విడుదల చేశారు. ప్రేమ జంటను భవానీపురం పోలీసులకు అప్పగిస్తామని తిరుచానూరు సీఐ సునీల్‌కుమార్‌ తెలిపారు.

అలేఖ్య, శివలు తాము 11 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని.. అయితే పెద్దలు తమ పెళ్లికి అంగీకరించకపోవడంతో.. గురువారం ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నామని తెలిపారు. శుక్రవారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తుండగా.. తిరుచానూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పుకొచ్చారు. తమ ఇష్ట్రపకారమే పెళ్లి చేసుకున్నామని.. అయితే అలేఖ్య తల్లిదండ్రులకు తమ వివాహం నచ్చకపోవడంతో తమపై పగ పెంచుకున్నట్లు పెళ్లి కుమారుడు శివ ఆరోపిస్తున్నాడు. అలేఖ్య కుటుంబసభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని.. తమను పోలీసులే రక్షించాలని కోరుతున్నాడు.

Show comments