YS Jagan, Chandrababu: CM జగన్ బాటలో చంద్రబాబు నాయుడు! ఏంటంటే..?

CM జగన్ బాటలో చంద్రబాబు నాయుడు! ఏంటంటే..?

YS Jagan, Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు చాలా ప్రత్యేకంగా, అందరిని ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. వేగంగా నిర్ణయాలు తీసుకోవండ ఆయన ప్రత్యేక శైలి. సీఎం జగన్ బాటలో ప్రతిపక్షాలు కూడా నడుస్తున్నాయి అంటే ఆయన శైలి ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

YS Jagan, Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు చాలా ప్రత్యేకంగా, అందరిని ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. వేగంగా నిర్ణయాలు తీసుకోవండ ఆయన ప్రత్యేక శైలి. సీఎం జగన్ బాటలో ప్రతిపక్షాలు కూడా నడుస్తున్నాయి అంటే ఆయన శైలి ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో తనదైన ప్రత్యేకను చూపిస్తున్నారు. నవరత్నాల పేరుతో అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారు. ప్రజ సంక్షేమమే తన లక్ష్యం అన్నట్లుగా సీఎం జగన్ సాగిపోతున్నారు. ఇలా కేవలం పరిపాలనలోనే కాకుండా పార్టీ వ్యవహారాల్లోనూ జగన్ మోహన్ రెడ్డి తన ప్రత్యేకతన చాటుకుంటున్నారు. విధేయతతో పాటు పార్టీ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తుంటారు. రాజకీయా వ్యూహాల్లో తనదైన ప్రత్యేకతను చాటుకుంటారు. అందుకే ప్రతిపక్షాలు సైతం ఆయన బాటలోనే వెళ్తున్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేన,టీడీపీ ప్రకటించిన కీలక అంశాల్లో జగన్ మార్క్ కనిపిస్తోంది. తాజాగా మరో విషయంలో చంద్రబాబు..సీఎం జగన్ బాటలో వెళ్తున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం..

విషయం ఏదైనా  వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో సీఎం జగన్ తరువాతే ఎవరైనా అని చెప్పొచ్చు.  మొహమాటం లేకపోవడం సీఎం జగన్ బలం, బలహీనత అని కూడా చెప్పొచ్చు. సాధారణంగా రాజకీయాల్లో పట్టు విడుపులు ఉండాలని చాలా మంది అంటుంటారు. కానీ జగన్ లో మాత్రం అలాంటి లక్షణాలు లేవు. రాజకీయాల్లో మొహమాటాలు  ఉండకూడదనే, ప్రజల నుంచి వచ్చే ఆదరణ ఒక్కటే ప్రామాణికంగా తీసుకోవాలనేది జగన్ ఫిలాసఫీ.

ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రాజకీయం అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్న జగన్..తాజాగా 11 మంది అభ్యర్థుల మార్పులను ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. అభ్యర్థుల  ప్రకటన రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  ఇదే సమయంలో టీడీపీ , జనసేన పొత్తు, అభ్యర్థుల విషయం తెరపైకి వచ్చింది.  టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం. ఈ నెల ఆఖరుకు అభ్యర్థుల ఎంపిక ఖారారు అవుతుందని తెలుస్తోంది. మరికొద్ది నెలల్లో ఎన్నికలు ఉండనున్న ఈ నేపథ్యంలోనే నారా చంద్రబాబు నాయుడు తన సహజ స్వభావానికి విరుద్ధంగా అభ్యర్థుల ఎంపిక ఖరారు చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం అదే పనిపై ఉన్నారని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. సాధారణంగా చంద్రబాబు నాన్చివేత ధోరణితో వ్యవహిస్తుంటారని, నామినేషన్ చివరి రోజు అభ్యర్థిని ప్రకటించిన దాఖాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు మాత్రం తన సహజ స్వభావానికి విరుద్ధంగా .. జగన్ మాదిరిగానే ముందస్తు ప్రకటనకే బాబు సైతం మొగ్గు చూపుతున్నారని సమాచారం.

పొత్తులో భాగంగా ముందు జనసేన సీట్ల సంగతి తేల్చిన తర్వాతే, తన పార్టీ అభ్యర్థుల గురించి ఆలోచించాలని చంద్రబాబు భావిస్తున్నారని తెలుస్తోంది. ఎందుకంటే టీడీపీ అభ్యర్థుల విషయమై ఇప్పటికే చంద్రబాబుకు స్పష్టతతో ఉన్నారంట. పొత్తులో భాగంగా జనసేన, టీడీపీల మధ్య సజావుగా రాజకీయ ప్రక్రియ సాగేలా చూసుకోవడంపై చంద్రబాబు దృష్టి సారించనున్నారు. ఏది ఏమైనా మొత్తానికి చంద్రబాబు కూడా తన సహజ స్వభావాన్ని వదిలేసి జగన్ దారిలో నడుస్తోన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. మరి.. సోషల్ మీడియాలో వినిపిస్తోన్న ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments