నిరుద్యోగ యువతకు కొత్త స్కీం.. ఇంటర్ పాసైతే రూ.6 వేలు!

ప్రభుత్వాలు యువత, నిరుద్యోగుల కోసం పలు స్కీమ్స్ ను అమలు చేస్తున్నాయి. అంతేకాక వాళ్లు అభివృద్ధి చెందేందుకు ఆర్థిక చేయుత నిచ్చే కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా ఓ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే స్కీమ్ ను ప్రారంభించారు.

ప్రభుత్వాలు యువత, నిరుద్యోగుల కోసం పలు స్కీమ్స్ ను అమలు చేస్తున్నాయి. అంతేకాక వాళ్లు అభివృద్ధి చెందేందుకు ఆర్థిక చేయుత నిచ్చే కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా ఓ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే స్కీమ్ ను ప్రారంభించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువత, నిరుద్యోగుల కోసం పలు స్కీమ్స్ ను అమలు చేస్తున్నాయి. అంతేకాక వాళ్లు అభివృద్ధి చెందేందుకు ఆర్థిక చేయుత నిచ్చే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే పలు రంగాల్లో ఉచితంగా వివిధ రకాల శిక్షణలు ఇస్తూ.. ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇదే సమయంలో పలు జాబ్స్ కి సంబంధించి నోటిఫికేషన్ లు ఇస్తూ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ లు చెబుతుంటాయి. తాజాగా ఓ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం కొత్త స్కీమ్ ను ప్రారంభించింది. ఇంటర్ పాసైతే రూ.6 వేలు.. ఆపై చదువులు చదివిన వారికి మరింత ఎక్కువ నగదు అందిస్తుంది. మరి.. ఆ ప్రభుత్వం ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

మహారాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం వివిధ కార్యక్రమాలు చేస్తుంది. అలానే తాజాగా వారి కోసం కొత్త పథకాన్ని ఏక్ నాథ్ షిండే సర్కార్ తీసుకొచ్చింది.  నిరుద్యోగ యువతకు ఆర్ధిక సాయం, నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త స్కీమ్ ను ప్రారంభించింది. బుధవారం పండరీపురంలో ఆషాడ ఏకాదశి సందర్భంగా ‘లాడ్లా భాయ్ యోజన” పేరిట మహారాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ స్కీమ్ ప్రారంభమైంది.

ఈ కొత్త స్కీం ద్వారా నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం అందించనున్నట్లు సీఎం పేర్కొన్నారు. వారివారి విద్యార్హతల బట్టి ప్రతి నెల  వారి బ్యాంకు అకౌంట్లో  స్టైంపెడ్ జమ చేయనున్నారు. ఈ పథకానికి 18 నుంచి 35 ఏళ్ల వారు ఈ స్కీమ్ కు అర్హులు. ఇంటర్ పాసైన వారి నుంచి పోస్ట్ గ్రాడ్యూయేషన్ చదివిన వారు ఈ స్కీమ్ కి అర్హులుగా పరిగణింపబడతారు. ఈ పథకం కింద ఇంటర్న్​షిప్ ​కింద వివిధ అంశాల్లో నైపుణ్యం పెంచుకునేందుకు ప్రాక్టికల్ శిక్షణ ఇస్తారు. ఆరు నెలల ట్రైనింగ్  పిరియడ్ లో అర్హులైన వారికి నేరుగా వారి బ్యాంకు అకౌంట్లో డబ్బులు జమ చేస్తారు.

ఇక ఆర్థిక సాయం వివరాలు చూసినట్లు అయితే.. ఇంటర్ పాసైన వారికి నెలకు రూ.6వేలు ఇవ్వనున్నారు. అలానే ఐటీఐ లేదా డిప్లొమా పూర్తి చేసిన వారికి నెలకు రూ.8 వేలు జమ చేస్తారు. అదే విధంగా డిగ్రీ లేదా ఏదైనా పీజీ పూర్తి చేసిన వారికి నెలకు రూ.10 వేలు చొప్పున స్టైపెండ్ చెల్లించనున్నారు.  మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే యువతులకు లాడ్లీ బెహన్ పేరుతో ఇలాంటి స్కీమ్ నే అమలు చేస్తున్నారు. మహారాష్ట్రలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పథకం తెచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరి..మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments