Rain Alert: AP వాసులకు అలర్ట్‌.. ఈ 3 రోజులు ఉరుములతో కూడిన వానలు..

ఏపీ వాసులకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. రానున్న మూడు రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని హెచ్చిరించారు. ఆ వివరాలు..

ఏపీ వాసులకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. రానున్న మూడు రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని హెచ్చిరించారు. ఆ వివరాలు..

మొన్నటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోయాయి. గతంలో ఎన్నడు లేనంతగా ఈ ఏడాది ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. మార్చి నెల ఆరంభం నుంచే ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక మే నెలలో అయితే దేశంలో రికార్డ్‌ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గంటల వ్యవధిలో పదుల సంఖ్యలో జనాలు మృతి చెందారు. వడగాలుల వల్ల ఈ మరణాలు సంభవించడం సంచలనంగా మారింది. బాబోయ్‌ ఎండలు అంటూ జనాలు బెంబెలెత్తుతున్న వేళ.. వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది జోరు వానలు కురుస్తాయని.. రుతుపవనాలు త్వరగానే దేశంలోకి ప్రవేశిస్తాయని.. వాతావరణ శాఖ తెలిపింది. అందుకు తగ్గట్టుగానే.. జూన్‌ నెల ప్రాంరభం నుంచే జోరు వానలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. రానున్న మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

బంగాళఖాతంలో రెండు వరుస తుపాన్ల కారణంగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు జోరు వానలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు సూచించారు. రానున్న మూడు రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని.. జనాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు.. చెట్లు, కరెంట్‌ స్తంభాలు, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు. ఈ మూడు రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా ఉరుమలతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, కర్ణాటకలోని మిగిలిన భాగాలు, దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరాంధ్ర మరికొన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ వెల్లడించారు. ఇక రాయలసీమ, పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం విస్తరించి ఉందన్నారు. కనుక రానున్న మూడు రోజుల పాటే ఏపీ వాసులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక గత రెండు రోజులుగా భాగ్యనగరంలో నిత్యం ఏదో ఒక సమయంలో జోరు వాన కురుస్తోంది. భారీ వర్షాల వల్ల నగరంలో ట్రాఫిక్‌ సమస్య పెరిగి.. జనాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక అన్నదాతలు వ్యవసాయ పనుల్లో మునిగిపోయారు.

Show comments