Uppula Naresh
Uppula Naresh
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్రికెట్ రంగంలో తనకుంటూ ఓ గుర్తింపును సంపాదించుకుని మంచి ఆటగాడిగా పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇక అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన రాయుడు.. త్వరలో రాజకీయాల్లోకి రానున్నట్లు కూడా జోరుగా ప్రచారం నడుస్తోంది. అయితే, ఈ క్రమంలోనే.. అవకాశం వస్తే తాను రాజకీయాల్లో రానున్నట్లుగా కూడా ప్రకటించడం విశేషం. తాజాగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కూడా దీనికి బలాన్ని చేకురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అంబటి ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు.
అంబటి రాయుడు గత కొన్ని రోజుల నుంచి ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన మంచి మనసును చాటుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని గుంటూరు జిల్లా ముట్లూరులోని సెయింట్ జేవియర్స్ ఉన్నత పాఠశాలకు అంబటి రాయుడు రూ.5 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. దీంతో పాటు ఆ పాఠశాల అభివృద్ధికి తన వంతు సాయం ఉంటుందని కూడా హామీ ఇచ్చారు. అయితే, ఆ స్కూల్ యాజమన్యానికి రూ.5 లక్షల చెక్కు ఇస్తున్న ఫోటోను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అతని అభిమానులు అంబటి రాయుడు మంచి మనసు చాటుకున్నాడని కొనియాడుతున్నారు. స్కూల్ కు రూ.5 లక్షలు విరాళంగా ప్రకటించిన అంబటి రాయుడు మంచి మనసుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
Donated a cheque of 5 lakhs to st xaviers high school in Mutluru for the development of the school. Also promised the refurbishment of the whole school building and the grounds. Playing my part in restoring the old glory of a very prestigious and a famous school. pic.twitter.com/6wpuJyseWb
— ATR (@RayuduAmbati) July 13, 2023
ఇది కూడా చదవండి: అవకాశం వస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా: అంబటి రాయుడు