అంబేద్కర్ ఆశయ సాధనలో సీఎం జగన్! వారికి ఈ నిజాలు కనిపించవా?

YS Jagan: భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భావజాలాన్ని పుణికి పుచ్చుకుని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 56 నెలలుగా ఆవిష్కరించిన సామాజిక మహా విప్లవం రాష్ట్రమంతటా సాధికారత ప్రతిధ్వనిస్తోంది.

YS Jagan: భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భావజాలాన్ని పుణికి పుచ్చుకుని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 56 నెలలుగా ఆవిష్కరించిన సామాజిక మహా విప్లవం రాష్ట్రమంతటా సాధికారత ప్రతిధ్వనిస్తోంది.

రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, దేశం  గర్వించ తగిన నాయకుడు డాక్డర్ బీఆర్ అంబేద్కర్ 206 అడుగుల విగ్రహావిష్కరణ జరగనుంది. విజయవాడలో జరగనున్న ఈ వేడుకకు వేలాదిగా జనం తరలివ వెళ్తున్నారు. మహా నాయకుడు విగ్రహావిష్కరణ ఒక మహోత్సవంలా జరగనుంది.  18.18 ఎకరాల విశాల ప్రాంగణంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. దీని కోసం రూ.404.35 కోట్లతో మేడిన్ ఇన్ ఇండియా సామాగ్రితో పనులు పూర్తి చేశారు. రాష్ట్రానికే ఈ అంబేడ్కర్ స్మృతివనం తలమానికంగా మారింది.  ఇలాంటి మంచి తరుణంలో  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ప్రతిపక్ష పార్టీ టీడీపీ, ఎల్లో మీడియా విషపు రాతలు రాస్తోంది. అంతేకాక ఆ మహానియుడు అంబేడ్కర్ ను అవమానించేలా కొన్ని మీడియా రాతలు ఉన్నాయి.

నేడు  బెజవాడ నగరం నడిబోడ్డున స్వరాజ్య మైదానంలో భారతరత్న బాబాసాహెబ్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ  జరగనుంది. ఇలా రాజ్యాంగ నిర్మాతకు ఏపీ ప్రభుత్వం గొప్ప గౌరవం ఇస్తుంటే.. ఎల్లో మీడియాలో అసత్యపు రాతలు రాస్తున్నాయి. తాము సమర్థించే నాయుకుడు దళితుల విషయంలో ప్రవర్తించిన తీరును కప్పిపుచ్చి.. అన్ని విధాలుగా ఆ వర్గం వారిని ఆదుకున్న సీఎం జగన్ పై అసత్యంపు రాతలు రాశారు. ఆ మీడియా ఛానల్ పై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో దళితుల విషయంలో చంద్రబాబు చేసిన మోసాలను, అదే దళితులకు సీఎం జగన్ చేసిన మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందా..

గతంలో టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడు దళితులను చిన్న చూపు చూస్తూ అనేక వ్యాఖ్యలు చేశారు. దళితుల్లో పుట్టాలనని ఎవరు కోరుకుంటారు? అంటూ వారిని అమానించేలా మాట్లాడారు. ఆ బోస్టన్ రిపోర్ట్ చదవడానికి వాడు విజయ్ కుమార్ (దళిత IAS ) ఎవడు  అంటూ మండి పడ్డారు. అంతేకాక నాయీ బ్రాహ్మణుల తమ సమస్యల గురించి వివరించేందుకు వస్తే.. తోక కత్తిరిస్తా , మత్స కారుల(బీసీ) తోలు తీస్తా అంటూ వ్యాఖ్యలు చేశారు.  బీసీలు జడ్జీలుగా పనికి రారు అన్న బాబు మహనీయుడా అంటూ దళితులు ప్రశ్నిస్తున్నారు.

ఇదే సమయంలో  మహాశయుడు  డాక్టర్ బాబు సాహెబ్ అంబెడ్కర్  చూపిన  బాటలో సీఎం జగన్ నడుస్తున్నారు అలానే బడుగుబలహీనవర్గాలకు పెద్ద పీట వేశారు సీఎం జగన్. డీబీటీ రూపంలో రూ.2.46 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమ చేశారు. అందులో 75 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే చేరాయి.

 అలానే ఇతర పథకాల ద్వారా రూ.1.67 లక్షల కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా పేదలకు రూ.4.13 కోట్ల మేర లబ్ధి కలిగింది. ఇక మంత్రి పదవులు విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి పెద్ద పీట వేశారు.  17 మంది మంత్రులు పదవులు, ఉప ముఖ్యమంత్రులు 4లుగా నియమించారు. తొలిసారిగా ఎస్సీ మహిళను హోంశాఖ మంత్రిగా నియమించించి ఘనత సీఎం జగన్ ది. చంద్రబాబు పాలనే  బీసీకి చెందిన వారు కేవలం 8 మంది మాత్రమే, జగన్ సర్కార్ లో 11 మంది మంతులుగా కొనసాగారు.

ఇక ఎస్సీ మంత్రుల విషయానికి వస్తే.. బాబు పాలనలో ఇద్దరు ఉండగా సీఎం జగన్ పాలనలో ఐదు మంది ఎస్సీలు మంత్రులుగా ఉన్నారు. చంద్రబాబు హాయంలో తన వర్గం వారైన కోడెల శివప్రసాద్ ను స్పీకర్ గా చేశారు. అదే జగన్ పాలనలో బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాను స్పీకర్ గా చేశారు. ఇక రాజ్య సభ సభ్యుల విషయంలో చంద్రబాబు బీసీలకు ఏమి ఇవ్వలేదు. అదే సీఎం జగన్ నలుగురు బీసీలను రాజ్యసభకు పంపించారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు  బాబు పాలనలో 18 మందికే ఎమ్మెల్సీ ఇవ్వగా, జగన్ ఏకంగా 29 మందికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. ఇంకా జగన్ పాలనలో అనేక విషయాల్లో ఎస్సీ,ఎస్టీ, బీసీలకు సమూచిత స్థానం లభించింది. 13 జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవులలో 9, 14  కార్పొరేషన్ మేయర్‌ పదవుల్లో 12 , గెలిచిన  84 మున్సిపల్ చైర్మన్  పోస్టుల్లో 58 వారికే కేటాయించారు. అలానే 137 వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల ఛైర్మన్‌ పదవులలో  79 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయించారు.

196 వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్లలో 117, అలానే  7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో 3,503, బీసీ వర్గాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు,ఎస్టీలకు 1 కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు. ఇలా సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సముచిత స్థానం కల్పించి అంబేడ్కర్ ఆశయాలను నిరవేర్చిన వ్యక్తిగా సీఎం జగన్ నిలిచారు. అంత చేసినా సీఎం జగన్ పై ఎల్లో మీడియా పచ్చ రాతలు రాయడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది.

Show comments