చంద్రబాబు మరో 6 నెలలు జైల్లోనే ఉండిపోవచ్చు: అడ్వకేట్ శ్రవణ్

స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలొ అరెస్టైన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ కేసులో ఆయనకు 14 రోజుల రిమాండును విధించింది ఏసీబీ కోర్టు. దీంతో చంద్రబాబును రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. స్నేహా బ్లాక్‌లో ఆయనకు తగిన సౌకర్యాలు అందించడంతో పాటు ఇంటి నుండి భోజనం తెప్పించుకునేందుకు అనుమతినిచ్చారు. ఆయనకు ఆహారం, మందులు ఇప్పించేందుకు ఓ సాయకుడ్ని ఏర్పాటు చేశారు. కాగా, చంద్రబాబును హౌస్ అరెస్టుకు అనుమతివ్వాలంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేసింది ఏసీబీ కోర్టు. అలాగే ఈకేసులో చంద్రబాబుని కస్టడీకి అప్పగించాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేయగా.. ఈ నెల 18 వరకు ఎటువంటి విచారణ చర్యలు చేపట్ట వద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. వీటితో పాటు ఆయనపై నమోదైన అమరావతి రింగ్ రోడ్ కుంభకోణం, అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు అయ్యాయి. అలాగే ఏపీ స్కిల్ కేసులో తనను ఏపీ సీఐడీ అరెస్టు చేయడం, రిమాండుకు తరలించడాన్ని క్వాష్ చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది.

ఇక చంద్రబాబు నాయుడు ఇప్పట్లో జైలు నుండి బయటకు వచ్చే అవకాశాలు లేవని.. ఓ టీవీ డిబేట్ లో ప్రముఖ న్యాయవాది శ్రవణ్ సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు ఆరు నెలల పాటు జైల్లోనే ఉంటారని ఆయన తెలిపారు. ప్రభుత్వ లాయర్లు ఎనిమిది కేసుల్లో పీటీ వారెంట్‌లు వేశారని, ఇవి కాక ఇంకా కొత్త కేసులు లైన్ లో ఉన్నాయని అయన అన్నారు. చంద్రబాబుపై 120 బి, 166,167,418,420, 465,468,471, 409, 209, 109 వంటి సెక్షన్ల కింద కేసులు ఉన్నాయని తెలిపారు. 409 సెక్షన్ మినహా..మిగిలినవన్నీ 41 (ఎ) సెక్షన్ నోటీసులివ్వాలని పేర్కొన్నారు. 409 సెక్షన్నే బలంగా ప్రభుత్వ న్యాయవాదులు వాదించడం వల్లే.. జడ్డి పరిగణనలోకి తీసుకున్నారని తెలిపారు. జడ్జి దీనిపై టర్న్ తీసుకుని ఉంటే.. బెయిల్ మంజూరు అయ్యేదని అన్నారు. టీడీపీ శ్రేణులు, ఆయన తరుపు న్యాయవాదులు సీరియస్ గా లీగల్ కాంప్లికేషన్స్ పై ఫైట్ చేయాల్సిన అవసరం ఉందని, ఇప్పట్లో బాబు బయటకు వచ్చే అవకాశం లేదని అడ్వకేట్ శ్రవణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి..ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments