Dharani
తన సమస్య పరిష్కారం కోసం ఆస్పత్రికి వెళ్లిన యువతి.. డాక్టర్లు చేసిన పనితో దారుణ స్థితిలోకి వెళ్లింది. ఇంతకు ఏం జరిగిందంటే..
తన సమస్య పరిష్కారం కోసం ఆస్పత్రికి వెళ్లిన యువతి.. డాక్టర్లు చేసిన పనితో దారుణ స్థితిలోకి వెళ్లింది. ఇంతకు ఏం జరిగిందంటే..
Dharani
ఆయువతి బీటెక్ చదువుతోంది. ప్రాణంగా ప్రేమించే తల్లిదండ్రులు.. మంచి స్నేహితులు. రోజు కాలేజీకి వెళ్లి రావడం.. కుటుంబ సభ్యలుతో గడవడం.. స్నేహితులతో కలిసి సంతోషంగా ఎంజాయ్ చేయడం.. ఇలా సంతోషంగా సాగిపోతుంది. ఈ క్రమంలో తాజాగా యువతి తీసుకున్న నిర్ణయంతో దారుణం చోటు చేసుకుంది. తానొటి తలిస్తే.. దైవమొకటి తలిచినట్లు.. ఓ సమస్య పరిష్కారం కోసం ఆస్పత్రికి వెళ్లిన యువతి.. ఏకంగా ప్రాణాలు కోల్పోయింది. వైద్యుల చేసిన పనితో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఆ వివరాలు..
విజయవాడంలో ఇంజనీరింగ్ విద్యార్థిని మరణం ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. హస్పిటల్‌లో చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణం అని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రికిత (19) అనే బీటెక్ స్టూడెంట్ ఒకరు.. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కాలులో అమర్చిన రాడ్‌ను తొలగించుకునేందుకు రికిత ఆస్పత్రిలో చేరింది. అయితే రెండు రోజుల క్రితమే శస్త్రచికిత్స పూర్తికాగా.. శుక్రవారం ఉదయం రిషిత చనిపోయినట్లు ఆస్పత్రి వైద్యులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో డాక్టర్ల నిర్లక్ష్యం వలనే రికిత చనిపోయిందంటూ కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
కుటుంబసభ్యులు చెప్తున్న వివరాల ప్రకారం.. బీటెక్ చదువుతున్న రికితకు ఐదేళ్ల కిందట విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేశారు. కాలు కాస్త వంకరగా ఉందనే కారణంతో ఆస్పత్రిలో చేరగా.. వైద్యులు ఆపరేషన్ చేసి రాడ్ అమర్చారు. అప్పటి నుంచి రికిత బాగానే ఉన్నట్లు కుటుంబసభ్యులు చెప్పుకొచ్చారు. అయితే రాడ్ తీయించుకునేందుకు గత బుధవారం రికిత ఆస్పత్రిలో చేరింది. ఈ క్రమంలో రాడ్ తొలగించేందుకు ఆస్పత్రి వైద్యులు మరోసారి ఆపరేషన్ నిర్వహించారు.
అయితే ఆపరేషన్ సందర్భంగా ఇచ్చే మత్తు ఇంజెక్షన్ ఓవర్ డోస్ అయ్యి రికిత చనిపోయిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆపరేషన్ తర్వాత ఆరోగ్యంగా ఉందని చెప్తూ వచ్చిన.. వైద్యులు రెండురోజుల తర్వాత రికిత మృతి చెందిందని వెల్లడించారని తెలిపారు. రికిత వెంటిలేటర్ మీద ఉందంటూ రెండురోజులు గడిపి.. చివరకు చనిపోయిందంటున్నారని మృతురాలు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆస్పత్రిలో చేరే సమయంలో రికిత ఆరోగ్యంగా ఉందంటున్న కుటుంబసభ్యులు.. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ చనిపోయిందని ఆరోపిస్తున్నారు. దాంతో ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. మత్తు ఇంజక్షన్ వికటించడం వల్లే రికిత చనిపోయిందని.. వెంటనే ఆస్పత్రి మీద చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తుంటే.. వైద్యులు ఆస్పత్రిలో లేకుండా పారిపోయారని తెలిపారు. కాలులో ఉన్న రాడ్ తీయించుకునేందుకు వస్తే.. ప్రాణమే తీశారంటూ రికిత తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు.