Krishna Kowshik
ఒక్క రోజే మురిపించింది వాన. మళ్లీ ఎండలు మొదలయ్యాయి. ఇటు తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఉక్కపోత మొదలైంది. భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఈ నేపథ్యంలో తీపి కబురు చెప్పింది వాతావరణ శాఖ.
ఒక్క రోజే మురిపించింది వాన. మళ్లీ ఎండలు మొదలయ్యాయి. ఇటు తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఉక్కపోత మొదలైంది. భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఈ నేపథ్యంలో తీపి కబురు చెప్పింది వాతావరణ శాఖ.
Krishna Kowshik
వరుణుడు కాస్త కనికరం చూపించనట్లుగానే చూపించి మళ్లీ మాయం అయిపోయాడు. దీంతో సూరీడు మళ్లీ గొడుగు పట్టేలా చేస్తున్నాడు. ఎండలతో బయటకు రావాలంటే భయపడిపోతున్నారు ప్రజలు. అందులోనూ ఈ నెల 13న దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో.. చల్లని ప్రాంతాలకు వెళదామంటే కుదరడం లేదు. తెలుగు రాష్ట్రాల్లోని జనాలకు పొద్దున్నే చుక్కలు కనిపిస్తున్నాయి. నెల రోజుల పాటు కురవాల్సిన వర్షమంతా ఒక్కసారే కురిసి ఇబ్బందులకు గురి చేసింది. రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. అంతలో మళ్లీ భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఏపీలో ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రతలు మళ్లీ పుంజుకుంటున్నాయి అక్కడ. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు చల్లని కబురు అందించింది వాతావరణ శాఖ.
ఏపీలో మూడు-నాలుగు రోజులు వానలు కురవనున్నట్లు పేర్కొంది ఐఎండీ. పలు జిల్లాల్లో ఈ నెల 14 వరకు తేలిక పాటి నుండి మోస్తారు వర్షాలు పడనున్నాయని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తాయని తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వెల్లడించింది. ఉత్తరాంధ్ర, కోస్తా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలతో పాటుగా ఉభయ గోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వానలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇక రాయలసీమలోని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వానలు పడతాయని చెబుతుంది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వానలు పడతాయని అంచనా వేసింది వాతావరణ శాఖ. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడవచ్చునని పొలాల్లోకి వెళ్లొద్దని, రైతులు, రైతు కూలీలకు హెచ్చరికలు జారీ చేసింది. చెట్ల ఉండవద్దని ప్రజలకు సూచించింది. బహిరంగ ప్రదేశంలో ఉండటం మంచిది కాదని సూచనలు చేసింది. ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని, వర్షం కురుస్తున్నప్పుడు నివాసంలో , షెల్టర్లలో ఉండాలని చెబుతుంది.