AP-Jagananna Civil Services,Videshi Vidya Deevena: AP లో వారికి జగన్ సర్కార్ శుభవార్త.. ఒక్కొక్కరి ఖాతాలో రూ.50 వేలు, లక్ష రూపాయలు

AP లో వారికి జగన్ సర్కార్ శుభవార్త.. ఒక్కొక్కరి ఖాతాలో రూ.50 వేలు, లక్ష రూపాయలు

బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ప్రధాన ఎజెండగా ముందుకు సాగుతోన్న జగన్ సర్కార్ తాజాగా నేడు కొందరికి శుభవార్త చెప్పింది. వారి ఖాతాల్లో లక్ష, 50 వేల రూపాయల నగదు జమ చేయనుంది. ఆ వివరాలు..

బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ప్రధాన ఎజెండగా ముందుకు సాగుతోన్న జగన్ సర్కార్ తాజాగా నేడు కొందరికి శుభవార్త చెప్పింది. వారి ఖాతాల్లో లక్ష, 50 వేల రూపాయల నగదు జమ చేయనుంది. ఆ వివరాలు..

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పేదలు, బడుగు బలహీన వర్గాల వారి కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు తీసుకువచ్చి.. వారికి నేరుగా ఆర్థిక సాయం అందజేస్తూ ఆదుకుంటున్నారు. అలానే మెరుగైన సమాజ నిర్మాణం కోసం నాణ్యమైన విద్య ఎంతో అవసరం ఉందని భావించారు సీఎం జగన్. పిల్లలకు ఇచ్చే అత్యుత్తమైన ఆస్తి చదువే అని భావించిన జగన్.. పేదలకు సైతం కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్య, ఇంగ్లీష్ మీడియం చదువులు అందించాలని ఆశించారు. అందుకోసం నాడు-నేడు, జగనన్న విద్యా దీవెన, అమ్మ ఒడి వంటి ఎన్నో పథకాలను తీసుకువచ్చారు. ఈ క్రమంలో నేడు కొందరి ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు సీఎం జగన్. ఆ వివరాలు..

విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న పేద విద్యార్థులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. అలాగే సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి కూడా ఆర్థిక తోడ్పాటును అందించనున్నారు. ఇందుకోసం జగనన్న విదేశీ విద్యాదీవెన, జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకాలకు సంబంధించిన సాయాన్ని అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నేడు జమ చేయనున్నారు సీఎం జగన్‌. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అర్హులైన 390 మంది విద్యార్థుల ఖాతాల్లో రూ.41.6 కోట్లను, సివిల్‌ సర్విసెస్‌ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 95 మంది, వారిలో తిరిగి మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది అభ్యర్థులకు ప్రోత్సాహకంగా రూ.100.5 లక్షలను మొత్తం రూ.42.6 కోట్లను జమ చేయనున్నారు. దీనిలో భాగంగా బుధవారం నాడు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో నేరుగా నగదు జమచేస్తారు.

జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం..

సివిల్‌ సర్విస్‌ పరీక్షలో ప్రిలిమినరీ పరీక్ష పాసైన విద్యార్థులకు రూ. లక్ష ప్రోత్సాహకం.. మెయిన్స్‌ పరీక్షలో ఉత్తీర్ణులైతే అదనంగా మరో రూ.50 వేల ప్రోత్సాహకాన్ని అనగా మొత్తంగా 1.50 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాల అభ్యర్థులకు అవసరమైన శిక్షణతోపాటు వారు సొంతంగా ప్రిపేర్‌ అయ్యేందుకు ఆర్థికంగా ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అభ్యర్థులు ప్రిలిమినరీ, మెయిన్స్‌ పరీక్షలు పాసైన ప్రతిసారీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నగదు ప్రోత్సాహకం అందిస్తోంది.

జగనన్న విద్యా దీవేన..

జగనన్న విద్యా దీవెన కింద.. వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌/­టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకింగ్స్‌ ప్రకారం ఇంజనీరింగ్, మెడిసిన్, లా, జర్నలిజం సహా 21 కోర్సుల్లో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు.. ఇతర విద్యార్థులకు రూ.1 కోటి వరకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు విమాన ప్రయాణం, వీసా ఖర్చులను కూడా జగన్ సర్కారే భరిస్తోంది. దీనిలో భాగంగా గడిచిన 10 నెలల్లో కేవలం ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ కింద 408 మంది విద్యార్థులకు ప్రభుత్వం రూ.107.08 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది. ఈ పథకానికి సంబంధించిన ఇతర వివరాల కోసం https:// jnanabhumi.ap.gov.in ను చూడవచ్చు.

ఈ పథకం ద్వారా ప్రపంచంలో టాప్ 200 యూనివర్సిటీలలో సీటు పొంది పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ చేసే విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్ అందజేస్తారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకు వారి వార్షిక ఆదాయ పరిమితిఏడాదికి రూ.8 లక్షల లోపు ఉండాలి. అలా ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింపచేయనున్నారు. టాప్‌ 200 యూనివర్సిటీల్లో ఎన్ని సీట్లు సాధిస్తే అంతమందికీ సంతృప్త స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించనుంది ఏపీ సర్కార్.

అర్హతలు..

  • 35 ఏళ్లలోపు ఉన్న వారు ఈ పథకానికి అర్హులుగా గుర్తిస్తారు.
  • ఏపీలో స్థానికులై ఉండాలి.. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింప చేయనున్నారు.
  • ఏటా సెప్టెంబరు–డిసెంబరు, జనవరి–మే మధ్య అర్హుల గుర్తింపు కోసం నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.
  • రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ అర్హులను ఎంపిక చేస్తుంది.

Show comments