India Will Play Only Six ODI Before Champions Trophy: BCCI బుర్ర తక్కువ పని.. ఇలా చేస్తే ఇంకో ICC ట్రోఫీ కోల్పోవడం ఖాయం!

BCCI బుర్ర తక్కువ పని.. ఇలా చేస్తే ఇంకో ICC ట్రోఫీ కోల్పోవడం ఖాయం!

అసలే ఐసీసీ ట్రోఫీలు రాక భారత జట్టు అభిమానులు అల్లాడుతున్నారు. టీమిండియా ఎంత బాగా ఆడినా సెమీస్ లేదా ఫైనల్స్​లో ఓడి కప్పు మిస్సవడంతో ఆ బాధను తట్టుకోలేకపోతున్నారు.

అసలే ఐసీసీ ట్రోఫీలు రాక భారత జట్టు అభిమానులు అల్లాడుతున్నారు. టీమిండియా ఎంత బాగా ఆడినా సెమీస్ లేదా ఫైనల్స్​లో ఓడి కప్పు మిస్సవడంతో ఆ బాధను తట్టుకోలేకపోతున్నారు.

ఏ గేమ్​లోనైనా గుత్తాధిపత్యం చూపించాలంటే కప్పులు గెలవాలి. క్రికెట్​లో చూసుకుంటే వరల్డ్ కప్ లేదా ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగా టోర్నమెంట్స్​లో విజేతగా నిలవాలి. ఎందుకంటే ఇవి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే టోర్నీలు. ఇందులో టాప్ టీమ్స్​తో పాటు స్మాల్ టీమ్స్, అసోసియేట్ కంట్రీస్ కూడా పార్టిసిపేట్ చేస్తాయి. కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ ఈ టోర్నీని చూస్తుంటారు. కాబట్టి ఐసీసీ టోర్నీల్లో ఛాంపియన్స్​గా నిలవాలి. అప్పుడే క్రికెట్​లో డామినేషన్ చూపించగలం. ఇప్పుడు భారత జట్టు కూడా అదే అనుకుంటోంది. మన టీమ్​ అన్ని ఫార్మాట్లలోనూ అదరగొడుతోంది. అయితే ర్యాంకుల్లో నంబర్ వన్​గా నిలిచినా.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం కప్పుకు కూత వేటు దూరంలో ఆగిపోతుంది. మెగా టోర్నీల్లో సెమీస్, ఫైనల్స్​ వరకు వచ్చి ఒట్టి చేతులతో ఇంటికి తిరుగు ప్రయాణం అవుతోంది టీమిండియా.

వన్డే, టీ20 ప్రపంచ కప్స్​లో ఆఖరి మెట్టు వరకు వచ్చి బోల్తా పడుతోంది భారత్. టెస్టుల్లో వరల్డ్ కప్​గా భావించే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్​లోనూ ఫైనల్స్​లో తడబడి టైటిల్స్ చేజార్చుకుంది. అసలే ఐసీసీ ట్రోఫీలు రాక భారత జట్టు అభిమానులు అల్లాడుతున్నారు. దీంతో టీమిండియా ఎంత బాగా ఆడినా కప్పు మిస్సవుతోందని అభిమానులు బాధపడుతున్నారు. కనీసం ఈసారైనా మన టీమ్ విజేతగా నిలవాలని ఆశిస్తున్నారు. పొట్టి కప్పుతో పాటు వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో రోహిత్ సేన ఛాంపియన్​గా నిలవాలని కోరుకుంటున్నారు. అయితే బీసీసీఐ తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. కప్పులు లేక ఫ్యాన్స్ బాధపడుతుంటే అదేదీ పట్టనట్లు.. షెడ్యూల్స్ ప్లాన్ చేస్తోంది బోర్డు.

బీసీసీఐ బుర్ర తక్కువ పని చేసింది. రాబోయే ఏడాది కాలంలో భారత జట్టు ఆడబోయే వన్డే, టెస్టు, టీ20 మ్యాచ్​ల షెడ్యూల్​ను తాజాగా రిలీజ్ చేసింది బోర్డు. ఊపిరి సలపని షెడ్యూల్​తో క్రికెటర్లను మరింత బిజీగా ఉంచనుంది. ఇంతవరకు ఓకే గానీ.. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు భారత్​ కేవలం 6 వన్డేలు ఆడేలా ప్లాన్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీలో నెగ్గాలంటే ఆ టోర్నీకి ముందు మూడ్నాలుగు వన్డే సిరీస్​లు నిర్వహించాలి. ఆ ఫార్మాట్​లో కనీసం డజన్ మ్యాచులైనా ఆడితే ఆటగాళ్లు అలవాటు పడతారు. కానీ బీసీసీఐ మాత్రం అడ్డగోలు ప్లానింగ్​తో సన్నాహకాలను దెబ్బతీస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అవసరం లేకపోయినా టీ20, టెస్టు మ్యాచ్​లను ఆర్గనైజ్ చేస్తోంది. దీని వల్ల టీమ్​కు ఏం లాభమో అర్థం కావడం లేదని ఎక్స్​పర్ట్స్ కూడా అంటున్నారు.

ప్రస్తుత టీ20 వరల్డ్ కప్​కు ముందు కూడా భారత్​కు సరైన ప్రాక్టీస్ దొరకలేదు. మన ప్లేయర్లు నేరుగా ఐపీఎల్ నుంచి యూఎస్​కు వచ్చారు. కనీసం రెండు, మూడు సిరీస్​లు నిర్వహిస్తే ఆటగాళ్లు ఫార్మాట్​కు అలవాటు పడతారు. అలాగే ఎవరు ఏయే స్థానాల్లో ఆడాలో క్లారిటీ వస్తుంది. టీమ్ యూనిటీగా ఆడటం కూడా అలవాటు అవుతుంది. ఇవేవీ పట్టించుకోకుండా బీసీసీఐ షెడ్యూల్స్ ప్లాన్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బోర్డు మరో ఐసీసీ ట్రోఫీకి ఎసరు పెట్టిందని ట్రోల్స్ వస్తున్నాయి. ఇలాగైతే కష్టమేనని నెటిజన్స్ అంటున్నారు. మరి.. బీసీసీఐ షెడ్యూల్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments