RC17: రామ్ చరణ్ - సుకుమార్ సినిమా కథ పై కసరత్తు

RC17: రామ్ చరణ్ – సుకుమార్ సినిమా కథ పై కసరత్తు

RC17: సుకుమార్‌తో రామ్ చరణ్ చేయబోయే కొత్త చిత్రాన్ని కూడా ప్రకటించవచ్చని గట్టి టాక్ వినిపిస్తుంది. గత కొంత కాలంగా చర్చల దశలో ఉన్న సుకుమార్‌ - చరణ్ సినిమా గనక కన్ఫర్మ్ అయితే భారీ హైప్‌తో వస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

RC17: సుకుమార్‌తో రామ్ చరణ్ చేయబోయే కొత్త చిత్రాన్ని కూడా ప్రకటించవచ్చని గట్టి టాక్ వినిపిస్తుంది. గత కొంత కాలంగా చర్చల దశలో ఉన్న సుకుమార్‌ - చరణ్ సినిమా గనక కన్ఫర్మ్ అయితే భారీ హైప్‌తో వస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ఆయన శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న గేమ్ ఛేంజర్‌లోని మొదటి పాట విడుదలయ్యే అవకాశం ఉందని దాదాపుగా ఖరారైంది. ఇది రామ్ చరణ్ అభిమానులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే వార్తే. అయితే అదే రోజు సుకుమార్‌తో రామ్ చరణ్ చేయబోయే కొత్త చిత్రాన్ని కూడా ప్రకటించవచ్చని గట్టి టాక్ వినిపిస్తుంది. గత కొంత కాలంగా చర్చల దశలో ఉన్న సుకుమార్‌ – చరణ్ సినిమా గనక కన్ఫర్మ్ అయితే భారీ హైప్‌తో వస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఈ కాంబోలో రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న రెండవ సినిమా కాబట్టి ట్రేడ్‌ తో పాటు ప్రేక్షకులు కూడా ఈ సినిమా పట్ల ఆసక్తి ఉంటారు.

ఇక ఈ సినిమా కథ పై క్రియేటివ్ జీనియస్ సుకుమార్ చాలా రకాల ఆలోచనలతో ఉన్నట్లు తెలుస్తోంది. అయన గత కొన్ని సినిమాలను గమనిస్తే రంగస్థలం నుండి గ్రామీణ బ్యాక్ డ్రాప్ ఉన్న యాక్షన్ చిత్రాలే చేస్తున్నారు. రంగస్థలం తర్వాత, పుష్ప పార్ట్ 1 చేసిన సుక్కూ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ఒకవేళ RC 17 కూడా రూరల్ బ్యాక్ డ్రాప్ లో తీస్తే సుకుమార్ కు ఆ జానర్ లో వరుసగా నాలుగో సినిమా అవుతుంది. అందువల్ల ప్రేక్షకులు రొటీన్ గా ఫీలయ్యే ప్రమాదం ఉంది.

మరో వైపు దర్శకుడు బుచ్చిబాబుతో చరణ్ తదుపరి చేయబోయే సినిమా కూడా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కనుంది కాబట్టి సుకుమార్ ఖచ్చితంగా ఈ జోన్ నుండి బయటకి వచ్చి ఏదైనా కొత్తగా చేస్తేనే ప్రేక్షకుల్లో సినిమాకి క్రేజ్ పెరుగుతుంది. ఆ విషయం పక్కన పెడితే సుకుమార్ అంటే గుర్తు వచ్చేది హీరో క్యారెక్టరైజేషన్. రెగ్యులర్ క్యారెక్టర్స్ లా కాకుండా సుకుమార్ హీరోలు ఇంటెన్స్, గ్రే షేడ్స్ తో ఉంటారు. అందువల్ల ఆ పాత్రలో నటించడానికి ఎంతో స్కోప్ దొరుకుతుంది. రంగస్థలంలో రామ్ చరణ్ పోషించిన చిట్టిబాబు పాత్ర ఆయన కెరీర్ లోనే కాకుండా తెలుగు సినిమా పరిశ్రమలోని ఐకానిక్ క్యారెక్టర్స్ లో ఒకటిగా నిలిచింది. మరి ఈ ఇంట్రెస్టింగ్ కాంబో నుండి రెండో సారి రాబోతున్న సినిమా కథ ఎలాంటిదో అనేదానితో పాటు ఇతర వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.

Show comments