వార్ 2 నుంచి సూపర్ అప్ డేట్.. ఎన్టీఆర్‌ ఫస్ట్‌లుక్‌ కు ముహూర్తం ఫిక్స్

Jr N.T. R : వార్ 2 నుంచి సూపర్ అప్ డేట్.. ఎన్టీఆర్‌ ఫస్ట్‌లుక్‌ కు ముహూర్తం ఫిక్స్

జూనియర్ ఎన్టీఆర్ ను స్క్రీన్ పైన చూసి చాలా కాలం అయింది కాబట్టి.. ఇప్పుడు తారక్ అభిమానులంతా ఎన్టీఆర్ సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ నటిస్తున్న ఓ సినిమా నుంచి త్వరలో ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ రాబోతున్నట్లు టాక్.

జూనియర్ ఎన్టీఆర్ ను స్క్రీన్ పైన చూసి చాలా కాలం అయింది కాబట్టి.. ఇప్పుడు తారక్ అభిమానులంతా ఎన్టీఆర్ సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ నటిస్తున్న ఓ సినిమా నుంచి త్వరలో ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ రాబోతున్నట్లు టాక్.

ప్రస్తుతం తారక్ దేవర , వార్ 2 చిత్రాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో ఈ సినిమాలకు సంబందించిన ప్రతి ఒక్క అప్ డేట్ కూడా బాగా వైరల్ అవుతుంది. అందులోను తారక్ ను తెరపైన చూసి చాలా రోజులు అవ్వడంతో.. తారక్ అభిమానులంతా ఎంతో ఇంట్రెస్ట్ గా సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. దేవర పార్ట్ 1 షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్న తారక్ పార్ట్ -2 షూటింగ్ కు బ్రేక్ తీసుకుని.. ఇటీవల వార్ -2 షూటింగ్ కోసం ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ రాబోతున్న ఈ సినిమాపైన అందరికి ఎన్నో ఎక్స్పెక్టషన్స్ ఉన్నాయి. దీనిలో తారక్ ఎలా కనిపించబోతున్నాడు ! ఏ క్యారెక్టర్ చేయబోతున్నాడు ! ఇలా అందరికి చాలా ప్రశ్నలు కూడా పుట్టుకొస్తున్నాయి. అయితే, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా తారక్ నటిస్తున్న చిత్రం నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ త్వరలో రాబోతుందని బజ్ నడుస్తుంది.

మే నెలలో తారక్ పుట్టిన రోజు ఉందన్న సంగతి.. తారక్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో స్టార్స్ బర్త్ డేస్ కు వారి వారి కొత్త చిత్రాలనుంచి ఫస్ట్ లుక్స్ ను రివీల్ చేస్తున్న ట్రెండ్ నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో తారక్ బర్త్ డే కూడా వార్ -2 చిత్రం నుంచి ఫస్ట్ లుక్ ను రివీల్ చేయనున్నారనే బజ్ సినీ సర్కిల్ లో బాగా నడుస్తుంది. మరి ఆరోజున నిజంగానే తారక్ లుక్ ను రివీల్ చేస్తారా లేదా అనేది మాత్రం ఇంకా మేకర్స్ నుంచి.. ఎటువంటి క్లారిటీ లేదు. వార్ -2 సినిమాలో తారక్ రా ఏజెంట్ గా కనిపిస్తాడని.. ముందు నుంచే ప్రచారం జరుగుతున్న కానీ.. వాస్తవం ఏంటి అనేది మాత్రం ఇంకా ఎవరికీ క్లారిటీ లేదు. కాబట్టి తారక్ వార్ -2 లో ఎలా ఉండబోతున్నాడో తెలుసుకోవాలంటే.. ఈ సినిమాకు సంబంధించిన ఎదో ఓ అప్ డేట్ ను రివీల్ చేసేంత వరకు వెయిట్ చేయాల్సిందే. కొన్ని సినిమాల కోసం ఎంత వెయిట్ చేసిన వర్త్ అనిపిస్తుంది. ఇప్పుడు తారక్ నటిస్తున్న ఈ రెండు సినిమాలు కూడా అలాంటివే.

ఇప్పటికే వార్ -2 చిత్రం నుంచి… బయటకు వచ్చిన అప్ డేట్స్ ను చూస్తున్న తారక్ ఫ్యాన్స్ అంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. వార్ సినిమా మొదటి పార్ట్ లో యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ లో అంతకు మించిన సీన్స్ ఉంటాయన్న బజ్ గట్టిగానే కొనసాగుతుంది.. ఇక వార్ -2 చిత్రాన్ని 2025 ఆగస్ట్ 14వ రిలీజ్‌ చేస్తామని ఇప్పటికే మూవీ ప్రకటించింది. అనుకున్న టైమ్ కు షూటింగ్ పూర్తయితే మాత్రం.. ఈ సినిమా వారు చెప్పిన తేదికి విడుదల అవుతుంది. ఇక అటు దేవర షూటింగ్ పనులు కూడా వేగవంతంగా సాగుతున్నాయి. కాబట్టి తారక్ ను స్క్రీన్ మీద చూసేందుకు ఇంకా ఎంతో సమయం లేదు. మరి తారక్ పుట్టిన రోజున వార్ -2 నుంచి ఫస్ట్ లుక్ ను రివీల్ చేస్తారన్న టాక్ పై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments