యువతి ప్రొఫైల్ ఫొటో చూసి పిచ్చిగా ప్రేమించాడు.. అసలు మ్యాటర్ తెలిసి..

యువతి ప్రొఫైల్ ఫొటో చూసి పిచ్చిగా ప్రేమించాడు.. అసలు మ్యాటర్ తెలిసి..

సోషల్ మీడియాలో పరిచయం అయిన యువతి. ఆమె ప్రొఫైల్ ఫొటో చూసి పిచ్చిగా ప్రేమించాడు. ఆ తర్వాత అసలు నిజం తెలియడంతో షాక్ కు గురైన యువకుడు. అసలు ఏం జరిగిందంటే?

సోషల్ మీడియాలో పరిచయం అయిన యువతి. ఆమె ప్రొఫైల్ ఫొటో చూసి పిచ్చిగా ప్రేమించాడు. ఆ తర్వాత అసలు నిజం తెలియడంతో షాక్ కు గురైన యువకుడు. అసలు ఏం జరిగిందంటే?

సోషల్ మీడియా పుణ్యమా అని ఎన్నో వింతలు, ఘోరాలు చూడాల్సి వస్తోంది. సామాజిక మాద్యమాలు కొందరికి ఉపాధి మార్గాలుగా ఉండగా మరికొందరికి కాలక్షేపంగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో క్రియేటివ్ గా ఆలోచించి ఫోటోలు, వీడియోలు, డ్యాన్సులతో సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. కొన్ని సార్లు అలా వీడియోలు తీసే క్రమంలో ప్రమాదాల భారిన పడి ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. మరికొంత మందికి ప్రేమవ్యవహారాలు నడిపేందుకు మంచి వేదికగా మారింది ఇన్స్టాగ్రామ్. సోషల్ మీడియాలో పరిచయం ఏర్పర్చుకోవడం ఆ తర్వాత స్నేహం, ప్రేమ వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఇదే విధంగా ఓ యువకుడు ఇన్స్టాలో ప్రొఫైల్ ఫోటో చూసి ప్రేమించాడు. ఆ తర్వాత ఆమె వయసు 45 ఏళ్లు అని తేలడంతో షాక్ అయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుని ప్రేమికులుగా మారిన వారు చాలామందే ఉన్నారు. ఇదే విధంగా ఓయువకుడు ఇన్స్టాగ్రామ్ లో ఓ మహిళతో పరిచయం ఏర్పర్చుకున్నాడు. ఆ తర్వాత స్నేహితులుగా మారారు. అయితే కొంతకాలానికి ఇద్దరి మనసులు కలవడంతో ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ స్వయంగా కలుసుకోవాలని నిర్ణయించారు. అసలు కథ అక్కడే మొదలయ్యింది. ఆ మహిళను చూసి ఆమె వయస్సు 45 ఏళ్లుగా తెలుసుకున్న ఆ యువకుడు షాక్‌ అయ్యాడు. ఆగ్రహంతో ఆమెను కొట్టాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

20 ఏళ్ల దీపేంద్ర సింగ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మహిళ పరిచయమైంది. ప్రొఫైల్‌ ఫొటో యంగ్‌గా ఉండటంతో ఆమెతో చాట్‌ చేశాడు. అలా కొద్దిరోజులకు ప్రేమికులుగా మారిపోయారు. అయితే అప్పటి వరకు ముఖ పరిచయం లేని వారు స్వయంగా కలుసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలో ఓ రోజు కలుసుకున్నారు. వయసులో ఆమె పెద్దగా కనిపించడంతో అతడు షాక్‌ అయ్యాడు. దీనిపై మహిళను ఆరా తీయగా తన వయస్సు 45 ఏళ్లు అని చెప్పింది. దీంతో ఆగ్రహించిన దీపేంద్ర సింగ్‌ ఆ మహిళపై దాడికి పాల్పడ్డాడు. ఆ మహిళ మొబైల్‌ ఫోన్‌ లాక్కొని అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఆ మహిళ ఇన్‌స్టాగ్రామ్‌ స్నేహితుడు దీపేంద్ర సింగ్‌ను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు.

Show comments