ప్రపంచంలోనే తొలి CNG బైక్‌.. వాహనదారులకు ఇక డబ్బులు ఆదానే!

ప్రపంచంలోనే తొలి CNG బైక్‌.. వాహనదారులకు ఇక డబ్బులు ఆదానే!

వాహనదారులకు గుడ్ న్యూస్. ఆటోమొబైల్ రంగంలో సరికొత్త చరిత్రకు సమయం ఆసన్నమైంది. ప్రపంచంలోనే తొలిసారిగా సీఎన్జీ బైక్ మార్కెట్ లోకి రాబోతోంది. వాహనదారులకు డబ్బులు ఆదా అవడం ఖాయం.

వాహనదారులకు గుడ్ న్యూస్. ఆటోమొబైల్ రంగంలో సరికొత్త చరిత్రకు సమయం ఆసన్నమైంది. ప్రపంచంలోనే తొలిసారిగా సీఎన్జీ బైక్ మార్కెట్ లోకి రాబోతోంది. వాహనదారులకు డబ్బులు ఆదా అవడం ఖాయం.

టెక్నాలజీలో వచ్చిన విప్లవాత్మక మార్పులు అనేక ఆవిష్కరణలకు నాందిపలుకుతున్నాయి. ఇది వరకు పెట్రల్, డీజిల్ తో నడిచే వాహనాలను మాత్రమే చూశాము. నేడు ఆ పరిస్థితి మారింది. పర్యావరణాన్ని కాపాడేందుకు, ఖర్చులు తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం మార్కెట్ లో వీటి హవా కొనసాగుతోంది. అయితే ఇప్పటి వరకు సీఎన్జీతో నడిచే ఆటోలను కార్లను మాత్రమే చూశాము. ఇకపై బైకులను కూడా చూడబోతున్నాము. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ సీఎన్ జీ బైకులను రూపొందించి విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి బైక్ కానుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

వరల్డ్ లోనే ఫస్ట్ టైం సీఎన్ జీ బైక్ అందుబాటులోకి రాబోతోంది. సీఎన్‌జీ మోటార్‌సైకిల్‌ని బజాజ్ ఆటో జూన్ 18, 2024న విడుదల చేయనుంది. చౌక ధరలో సీఎన్‌జీ బైక్‌ని తీసుకువస్తున్నట్లు బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ ప్రకటించారు. కొత్త బజాజ్ సీఎన్‌జీ మోటార్‌సైకిల్‌ 100-125 సీసీ ఇంజిన్‌లో ఉండే అవకాశం ఉంది. ఈ బైక్‌ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్‌, వెనుక భాగంలో మోనో షాక్‌ని కలిగి ఉండనుంది. దీనితో పాటు డిస్క్ మరియు డ్రమ్ బ్రేక్ సెటప్‌లతో రానుంది. ఈ బైక్ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా సింగిల్-ఛానల్ ఎబిఎస్ లేదా కాంబి-బ్రేకింగ్ సిస్టమ్‌తో వచ్చే అవకాశం ఉంది. అయితే దీనిపై కంపెనీ అధికార ప్రకటన చేయాల్సి ఉంది.

సీఎన్జీ బైకుల రాకతో ఆటోమొబైల్ రంగం కొత్త పుంతలు తొక్కనుంది. పెట్రోల్, ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు బజాజ్ సీఎన్జీ బైక్ గట్టిపోటీ ఇవ్వనున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే పెట్రోల్ మోటార్‌ సైకిళ్లతో పోలిస్తే సీఎన్‌జీ బైక్‌ల ధర కాస్త ఎక్కువగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ బైక్‌ ధర రూ.80,000కి పైగా ఉండనున్నట్లు సమాచారం. ఇది కిలోకు 70 కిలోమీటర్లకు పైగా మైలేజీని అందిస్తుందని భావిస్తున్నారు. ఫ్యూయల్​ ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నించే కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని ఈ సీఎన్​జీ బైక్స్​ని రూపొందిస్తున్నట్టు బజాజ్ కంపెనీ తెలిపింది.

Show comments