RCB vs GT Virat Kohli Bullet Throw: వీడియో: కోహ్లీ బుల్లెట్ త్రో.. ఈ రేంజ్ ఫీల్డింగ్ అంటే విరాట్​కే సాధ్యం!

RCB vs GT: వీడియో: కోహ్లీ బుల్లెట్ త్రో.. ఈ రేంజ్ ఫీల్డింగ్ అంటే విరాట్​కే సాధ్యం!

విరాట్ కోహ్లీ బ్యాటింగ్​తో పాటు ఫీల్డింగ్​లోనూ తోపే అనేది తెలిసిందే. గుజరాత్ టైటాన్స్​తో మ్యాచ్​తో ఇది మరోమారు ప్రూవ్ అయింది. అతడి త్రోకు ప్రత్యర్థి బ్యాటర్​తో పాటు సొంత జట్టు ఆటగాళ్లు కూడా షాక్ అయ్యారు.

విరాట్ కోహ్లీ బ్యాటింగ్​తో పాటు ఫీల్డింగ్​లోనూ తోపే అనేది తెలిసిందే. గుజరాత్ టైటాన్స్​తో మ్యాచ్​తో ఇది మరోమారు ప్రూవ్ అయింది. అతడి త్రోకు ప్రత్యర్థి బ్యాటర్​తో పాటు సొంత జట్టు ఆటగాళ్లు కూడా షాక్ అయ్యారు.

విరాట్ కోహ్లీ అనగానే అందరికీ గ్రేట్ బ్యాటర్ అనే తెలుసు. కోహ్లీ పేరు చెబితే ఎవరైనా అతడి బ్యాటింగ్​ను గుర్తుచేసుకుంటారు. ఫెంటాస్టిక్ బ్యాటింగ్​తో అతడు క్రికెట్ ప్రపంచం మీద వేసిన ముద్ర అలాంటిది. అయితే బ్యాటింగ్​తో పాటు ఫీల్డింగ్​లోనూ విరాట్ తోపే అనేది తెలిసిందే. గుజరాత్ టైటాన్స్​తో జరుగుతున్న మ్యాచ్​తో ఇది మరోమారు ప్రూవ్ అయింది. అతడి త్రోకు ప్రత్యర్థి బ్యాటర్​తో పాటు సొంత జట్టు ఆటగాళ్లు కూడా షాక్ అయ్యారు. జీటీ బ్యాట్స్​మన్ షారుఖ్​ ఖాన్​ను ఓ అద్భుతమైన త్రోతో వెనక్కి పంపాడు కింగ్. ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్​లో గుజరాత్ తక్కువ స్కోరుకే 3 వికెట్లు కోల్పోయింది. 19 పరుగులకే ఓపెనర్లు సాహా, గిల్​తో పాటు వన్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా పెవిలియన్​కు చేరుకున్నాడు.

పించ్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ (30)తో జతకట్టిన షారుఖ్ (37) నాలుగో వికెట్​కు 61 పరుగులు జోడించాడు. అయితే అతడు మరింత ప్రమాదకరంగా మారుతున్న టైమ్​లో కోహ్లీ బుల్లెట్ త్రోతో అతడ్ని ఔట్ చేశాడు. విజయ్​ కుమార్ వైశాఖ్ బౌలింగ్​లో గుండ్ లెంగ్త్​లో పడిన బంతిని రాహుల్ తెవాటియా షార్ట్ కవర్ వైపు కొట్టాడు. దీంతో నాన్​స్ట్రయికింగ్ ఎండ్​లో ఉన్న షారుఖ్ పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే తెవాటియా రన్ వద్దనడంతో మళ్లీ క్రీజులోకి చేరుకునేందుకు పరిగెత్తాడు. కానీ బంతిని అందుకున్న కోహ్లీ వికెట్లను గురి చూసి కొట్టాడు. క్రీజుకు కొద్ది దూరంలో ఉండగానే స్టంప్స్​ను బాల్ హిట్ అవడంతో షారుఖ్ నిరాశతో క్రీజును వీడాడు. విరాట్ త్రోకు బ్యాటర్ షారుఖ్​తో పాటు ఆర్సీబీ ఆటగాళ్లు కూడా షాకయ్యారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఈ రేంజ్ ఫీల్డింగ్ అంటే అది కింగ్​కే సాధ్యమని అంటున్నారు. మరి.. కోహ్లీ ఫీల్డింగ్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments