Rains In Telugu States: ప్రజలకు చల్లని కబురు.. ఈ తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

ప్రజలకు చల్లని కబురు.. ఈ తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

Rains for Telugu States: వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్తను అందించింది. ఇది నిజంగా చల్లని కబురు అనే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచనను అందించారు.

Rains for Telugu States: వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్తను అందించింది. ఇది నిజంగా చల్లని కబురు అనే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచనను అందించారు.

ఫిబ్రవరి రెండో వారం నుంచి ఎండలు మండిపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్చి మొదటి వారం నుంచి భానుడి భగ భగలు మొదలైపోయాయి. హైదరాబాద్ లో కూడా ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే పగటిపూట 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ కూడా ప్రజలను పగటిపూట బయటకు రావొద్దు అంటూ సూచనలు కూడా చేసింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. అదేంటంటే.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన కనిపిస్తోంది. ఈ రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేసారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లిస్టును విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 16 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణ మాత్రమే కాకుండా పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఝార్ఖండ్ ఛండీగఢ్, సిక్కింగ్, అరుణాచల్ ప్రదేస్, మధ్యప్రదేశ్, మేఘాలయ, అసోం, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల్లో మార్చి 16 నుంచి 21 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ చెబుతున్నారు. అటు జమ్ముకశ్మీర్- లద్ధాఖ్ లో మార్చి 20, 21 తేదీల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. అలాగే అక్కడి అధికారులను కూడా వాతావారణ శాఖ హెచ్చరించింది.

మరోవైపు మార్చి 16 నుంచి 18 వరకు తూర్పు, మధ్య భారతదేశంలో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ తేదీల్లో ఝార్ఖండ్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తూర్పు భాగంలో ప్రభావం ఉండొచ్చని చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు వాతారణ శాఖ చెప్పిన వార్తతో ఉపశమనం పొందుతున్నారు. గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడి వేడి దారుణంగా ఉంటోంది. ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండటం లేదు. నిపుణులు, వాతావరణ శాఖ అధికారులు కూడా పగటి పూట బయటకు రావొద్దంటూ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకున్నాయి. విద్యాసంస్థలకు కూడా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. మరి.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన అందడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments