kL Rahul- Sanjiv Goenka Issue: మైదానంలో రాహుల్ కి అవమానం.. గోయంకకే సపోర్ట్ చేస్తున్న ఆసీస్ దిగ్గజం!

KL రాహుల్ ను మైదానంలో తిట్టడంపై.. గోయంకకే సపోర్ట్ చేస్తున్న ఆసీస్ దిగ్గజం!

kL Rahul- Sanjiv Goenka Issue: రెండ్రోజులుగా కేఎల్ రాహుల్- సంజీవ్ గోయంక వివాదం నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై ఇప్పటికే పలువురు రాహుల్ కు సపోర్ట్ చేశారు. కానీ ఒక ఆసీస్ దిగ్గజం మాత్రం సంజీవ్ గోయంకకు తన మద్దతు తెలిపాడు.

kL Rahul- Sanjiv Goenka Issue: రెండ్రోజులుగా కేఎల్ రాహుల్- సంజీవ్ గోయంక వివాదం నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై ఇప్పటికే పలువురు రాహుల్ కు సపోర్ట్ చేశారు. కానీ ఒక ఆసీస్ దిగ్గజం మాత్రం సంజీవ్ గోయంకకు తన మద్దతు తెలిపాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్- సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలోనే నిలిచిపోతుంది. అందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుతమైన ప్రదర్శనే అందుకు కారణం. మరొకటి లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయంకా తన టీమ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ని అన్ని కెమెరాలు, అంత మంది అభిమానులు, క్రికెట్ దిగ్గజాల ముందు మైదానంలోనే దారుణంగా వాగ్వాదానికి దిగడం. ఒక కెప్టెన్ అని తెలిసి కూడా నాలుగు గోడల మధ్య పెట్టుకోవాల్సిన డిస్కషన్ ని మైదానంలోకి తీసుకురావడంపై అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక ఆసీస్ దిగ్గజం మాత్రం గోయంకకే సపోర్ట్ చేస్తున్నాడు.

లక్నో- హైదరాబాద్ మధ్య జరిగిన నాకౌట్ మ్యాచ్ లాంటిదే. అలాంటి కీలక మ్యాచ్ లో లక్నో జట్టు తేలిపోయింది. హైదరాబాద్ ఛేజింగ్ లో కొత్త రికార్డును సృష్టించింది. అయితే ఈ విషయంపై లక్నో ఫ్యాన్స్ మాత్రమే కాదు.. జట్టు యజమాని సంజీవ్ గోయంక కూడా నిరాశ చెందారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో కేఎల్ రాహుల్ తో ఒకింత వాగ్వాదానికి దిగారు. ఈ విషయం రెండ్రోజులుగా క్రికెట్ ప్రపంచంలో వైరల్ అవుతూనే ఉంది. కేఎల్ రాహుల్- సంజీవ్ గోయంక మధ్య జరిగిన ఈ ఘటనపై ఇప్పటికే పలువురు క్రికెటర్స్, మాజీ దిగ్గజాలు, లక్నో ఫ్యాన్స్, సదరు క్రికెట్ అభిమానులు అంతా తమ తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు.

అంతా కెప్టెన్ కేఎల్ రాహుల్ కే తమ మద్దతు తెలుపుతూ వస్తున్నారు. రాహుల్ తో గొడవకు దిగినంత పని చేయడం కరెక్ట్ కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కేల్ రాహుల్ అసలు లక్నో జట్టులో కొనసాగాల్సిన అవసరం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గంభీర్ లాంటి దిగ్గజాలు షారుక్ ఖాన్ యజమానిగా ఎలా ఉంటాడో వివరిస్తూ పరోక్షంగా గోయంకకు చురకలకు కూడా అంటించాడు. షారుక్ ఖాన్ అసలు క్రికెట్ మ్యాటర్స్ లో తలదూర్చడు అంటూ చెప్పుకొచ్చాడు. ఒక కెప్టెన్ కు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మహ్మద్ షమీ ప్రశ్నించాడు. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన ఆసీస్ దిగ్గజం మాత్రం సంజీవ్ గోయంకను సమర్థించడం కొత్త చర్చకు దారి తీసింది.

ఈ విషయంపై స్పందించింది మరెవరో కాదు.. ఆసీస్ దిగ్గజం బ్రెట్ లీ. అవును బ్రెట్ లీ గోయంకకు సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేశాడు. “సంజీవ్ గోయంక అందరి ముందు ఇలా మాట్లాడేకంటే గదిలో చర్చించాల్సింది. ఒకవేళ అలా చేసి ఉంటే ఇప్పుడు నాకు ఈ ప్రశ్న ఎదురయ్యేదే కాదు. అయితే మీరు నాణేనికి ఒకవైపే చూస్తున్నారు. కానీ, రెండో వైపు గురించి కూడా ఆలోచించాలి. క్రికెట్ పట్ల జట్ల యజమానులు, కోచ్ లకు అమితమైన ఇష్టం, ప్యాషన్ ఉంటుంది. వారి జట్టు లీగ్ లో అత్యత్తమంగా రాణించాలని వాళ్లు కచ్చితంగా ఆశిస్తారు. ఆ ప్యాషన్ లో భాగంగానే గోయంక అలా ప్రవర్తించి ఉండచ్చు” అంటూ బ్రెట్ లీ వ్యాఖ్యానించాడు. బ్రెట్ లీ గోయంకకు సపోర్ట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments