మీరు హోటల్‌ టిఫిన్ చేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే.. ఒంట్లో వణుకే!

మీరు హోటల్‌ టిఫిన్ చేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే.. ఒంట్లో వణుకే!

నేటికాలంలో చాలా హోటళ్ళు తీసుకునే డబ్బులు తీసుకుంటూనే శుభ్రతను మాత్రం గాలికి వదిలేస్తున్నారు. భోజనాల్లో పురుగులు, బళ్లులు వంటివి కనిపిస్తుంటాయి.. తాజాగా జరిగిన ఓ ఘటన గురించి మీకు తెలిస్తే.. అసలు బయట భోజనం చేయడాలంటే వెన్నులో వణుకు వస్తాది.

నేటికాలంలో చాలా హోటళ్ళు తీసుకునే డబ్బులు తీసుకుంటూనే శుభ్రతను మాత్రం గాలికి వదిలేస్తున్నారు. భోజనాల్లో పురుగులు, బళ్లులు వంటివి కనిపిస్తుంటాయి.. తాజాగా జరిగిన ఓ ఘటన గురించి మీకు తెలిస్తే.. అసలు బయట భోజనం చేయడాలంటే వెన్నులో వణుకు వస్తాది.

నిత్యం ఎంతో మంది హోటళ్లకు వెళ్లి టిఫిన్, భోజనం చేస్తుంటారు. అలానే మనం కూడా పలు సందర్భాల్లో బయటకు వెళ్లి టిఫిన్ భోజనం చేస్తుంటాము. అయితే నేటికాలంలో చాలా మంది హోటల్ వ్యాపారస్తులు భోజనంలో నాణ్యతను పాటించడం లేదు. అంతేకాక ఫుడ్ తయారీలో చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అందుకే ఇటీవల కాలంలో భోజనాల్లో పురుగులు, గాజు పెంకులు, బళ్లులు వంటివి ప్రత్యక్షమైన ఘటనలు అనేకం చూశాం. తాజాగా జరిగిన ఓ ఘటన గురించి మీకు తెలిస్తే.. అసలు బయట భోజనం చేయడాలంటే వెన్నులో వణుకు పుడుతోంది. ఈ భయంకరమైన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

నేటికాలంలో చాలా హోటళ్ళు తీసుకునే డబ్బులు తీసుకుంటూనే శుభ్రతను మాత్రం గాలికి వదిలేస్తున్నారు. సేఫ్టీ అధికారులు చేస్తోన్న తనిఖీల్లో నాణ్యత లేని సరుకు వినియోగించడం, శుభ్రత పాటించకుండా ఫుడ్ ను తయారు చేయడం వంటి ఘటనలు బయటపడుతున్నాయి. అలాంటి హోటళ్లలను అధికారులు సీజ్ చేసినా కూడా కొందరు వ్యాపారస్తులో మార్పు రావడం లేదు. ఫంగస్ పట్టిన వెజిటేబుల్స్, పురుగులు ఉన్న ఆహార పదార్థాలు కనిపించేసరికి జనాలు విస్తుపోయిన్నారు.

తాజాగా గుంటూరులో కూడా ఓ హోటల్ నిర్లక్ష్య బయటపడింది.  నగరంలోని కొరిటెపాడులోని ఓ హోటల్‌కు టిఫిన్‌ చేయడానికి ఓ కస్టమర్‌ తన ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లాడు. ఆ సమయంలో ఆయనకు ఓ వింత పరిణామం ఎదురైంది. ఆ హోటల్ కి వెళ్లి వేడి వేడి దోశ తిన్నాలని ఆ వ్యక్తి భావించాడు. ఈ క్రమంలోనే వేడిగా దోశ ఇవ్వాలని హోటల్ సిబ్బందికి ఆర్డర్ ఇచ్చాడు. అతడు అడిగిన కాసేపటికి పొగలు కక్కుతూ వేడీ వేడీ దోశ వచ్చేసింది. ఇక అతడు దోశను తినేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే సదరు వ్యక్తి దోశ తింటుండగా…పంటికి గట్టిగా ఏదో తగిలింది. ఏంటా అని బయటకు తీసి చూడగా షాక్ గురయ్యాడు.

గోడకు కొట్టుకునే ఇనుప బోల్ట్ కాస్తా ఏకంగా దోశలో కనిపించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాధితుడు..హోటల్ సిబ్బందిని ప్రశ్నించాడు. అతడి మాటలను  సదరు హోటల్  సిబ్బంది పట్టించుకోలేదు. అంతేకాక జరిగిన తప్పుకు కనీసం సమాధానం కూడా చెప్పలేదు. దీంతో అసహనానికి గురైన సదరు వినియోదారుడు సిబ్బందిపై వాగ్వాదానికి దిగాడు.  అంతేకాక ఆధారాలతో సహా ఆహార భద్రత అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంలోనే దోశలో  ఇనుప మేకు వచ్చిన ఘటన తమ దృష్టికి వచ్చిందని జిల్లా అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌  తెలిపారు. ఇక ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఒకవేళ పొరపాటున సదరు వ్యక్తి  బోల్ట్‌ను మింగేసి ఉంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లి ఉండేదని హోటల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Show comments