GT vs CSK Shubman Gill Century Celebrations: సెంచరీ తర్వాత గిల్ వైల్డ్ సెలబ్రేషన్స్.. ఇంత కోపంగా ఎప్పుడూ చూసుండరు!

Shubman Gill: సెంచరీ తర్వాత గిల్ వైల్డ్ సెలబ్రేషన్స్.. ఇంత కోపంగా ఎప్పుడూ చూసుండరు!

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్​మన్ గిల్ సెంచరీతో మెరిశాడు. సీఎస్​కేతో మ్యాచ్​లో శతకం బాది తన సత్తా ఏంటో మరోమారు ప్రూవ్ చేసుకున్నాడు. సెంచరీ తర్వాత అతడు వైల్డ్​గా సెలబ్రేట్ చేసుకున్నాడు.

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్​మన్ గిల్ సెంచరీతో మెరిశాడు. సీఎస్​కేతో మ్యాచ్​లో శతకం బాది తన సత్తా ఏంటో మరోమారు ప్రూవ్ చేసుకున్నాడు. సెంచరీ తర్వాత అతడు వైల్డ్​గా సెలబ్రేట్ చేసుకున్నాడు.

ఐపీఎల్-2024లో మంచి ఫామ్​లో ఉన్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్​మన్ గిల్ మరోమారు తన బ్యాట్ పవర్ చూపించాడు. ప్లేఆఫ్స్ అవకాశాలు ఎలాగూ లేకపోవడంతో చెలరేగి ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్​ బౌలర్లతో ఓ రేంజ్​లో ఆడుకున్నాడు గిల్. బాల్ పడిందా బౌండరీ లేదా సిక్స్ అన్నట్లు విజృంభించి ఆడాడు. 9 ఫోర్లు, 6 సిక్సులతో చెన్నైపై పిడుగులా పడ్డాడు. 55 బంతుల్లోనే 104 పరుగులతో గ్రౌండ్​లో మినీ సునామీ సృష్టించాడు. అయితే సెంచరీ తర్వాత అతడు సెలబ్రేషన్ చేసుకున్న తీరు చర్చనీయాంశంగా మారింది.

సెంచరీ అనంతరం గిల్ వైల్డ్​గా సెలబ్రేట్ చేసుకున్నాడు. హెల్మెట్ తీసి గాల్లో పంచులు విసిరాడు. ఇది తన రేంజ్ అంటూ గట్టిగా అరిచాడు. అంతేకాదు ఇంగ్లీషు భాషలో ఓ బూతు పదం కూడా వాడాడు. దాన్ని వీడియోలో క్లియర్​గా చూడొచ్చు. ఇది చూసిన నెటిజన్స్.. టీ20 వరల్డ్ కప్ మెయిన్ టీమ్​లోకి తనను తీసుకోలేదనే కోపంతోనే ఇలా చేశాడని కామెంట్స్ చేస్తున్నారు. అతడు బయటకు కోపంగా కనిపించినా.. సెలెక్టర్లు తనకు అన్యాయం చేశారనే బాధ ఆ కళ్లలో స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు. మరి.. గిల్ ఇన్నింగ్స్ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments