ఆ హీరోయిన్ కోసం 100 రూమ్స్ బుక్ చేసిన స్టార్ హీరో.. ఎవరంటే?

ఆ హీరోయిన్ కోసం 100 రూమ్స్ బుక్ చేసిన స్టార్ హీరో.. ఎవరంటే?

ఓ స్టార్ హీరో ఆ స్టార్ హీరోయిన్ కోసం ఏకంగా 100 రూమ్స్ బుక్ చేశాడంట. ఈ విషయం చాలా ఏళ్ల తర్వాత బయటికి వచ్చింది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే?

ఓ స్టార్ హీరో ఆ స్టార్ హీరోయిన్ కోసం ఏకంగా 100 రూమ్స్ బుక్ చేశాడంట. ఈ విషయం చాలా ఏళ్ల తర్వాత బయటికి వచ్చింది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే?

సినీ సెలబ్రిటీలు ప్రేమ విషయంలో చాలా సీక్రెట్ గా మెయిన్ టైన్ చేస్తుంటారు. ఎవరి కంట పడకుండా జాగ్రత్త పడుతుంటారు. అంతే కాదు కొందరు పెళ్లిల్ల విషయంలో కూడా గోప్యత పాటిస్తుంటారు. ఇక ప్రెగ్నెన్సీ, డెలివరీ సమయంలో కూడా ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఇదే విధంగా ఓ స్టార్ నటుడు తన భార్య డెలివరీ సమయంలో ఎవరికీ తెలయకుండా ఉండేందుకు తీసుకున్న జాగ్రత్తలు తెలిస్తే షాకవ్వకుండా ఉండలేరు. తన భార్య డెలివరీ కోసం చేరిన ఆస్పత్రిలో ఏకంగా 100 రూములను బుక్ చేశాడట. ఆ స్టార్ హీరో మరెవరో కాదు ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర. చాలా సంవత్సరాల తర్వాత ఈ విషయాన్ని ఆయన భార్య స్నేహితురాలు వెల్లడించారు.

బాలీవుడ్ లో స్టార్ యాక్టర్స్ లో ధర్మేంద్ర, హేమ మాలిని ఒకరు. వీరిద్దరికి విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. స్టార్ హీరోహీరోయిన్లుగా ఫేమ్ పొందారు. అయితే వీరిద్దరు1980లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి మొదటి సంతానంగా ఈషా డియోల్ 1981లో జన్మించారు. ఈ సమయంలో హేమ మాలిని ప్రెగ్నెన్సీ అన్న సంగతి ఎవరికీ తెలియదట. సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డారట. అయితే ధర్మేంద్ర తన భార్య హేమ మాలిని డెలివరీ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. డెలివరీ కోసం తను ఆసుపత్రిలో చేరిందన్న విషయం ఎవరికీ తెలియకుండా ధర్మేంద్ర పెద్ద సాహసమే చేశాడట.

డెలివరీ సమయంలో ధర్మేంద్ర హేమా మాలిని కోసం తాను చేరిన ఆ హాస్పిటల్ మొత్తాన్ని బుక్ చేశాడు. అందులో మొత్తం 100 గదులు ఉండగా..వాటన్నింటికి బుక్ చేశాడు. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెళ్ళడించారు హేమ మాలిని స్నేహితురాలు నీతూ కోహ్లి. ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికీ తెలియదని ఆమె చెప్పుకొచ్చారు. గర్భవతి అన్న సంగతి ఎవరికీ తెలియకపోవడంతో ధర్మేంద్ర హేమ మాలిని కోసం హాస్పిటల్ ను మొత్తం బుక్ చేసినట్లు నీతూ తెలిపింది.

Show comments