మల్టీప్లెక్సులకు నిర్మాత అదిరిపోయే కౌంటర్

మల్టీప్లెక్సులకు నిర్మాత అదిరిపోయే కౌంటర్

ప్రస్తుతం మల్టీ ప్లెక్స్ యాజమాన్యాలకు, ఓటిటికి తమ సినిమాల హక్కులు అమ్మేసుకుంటున్న నిర్మాతలకు కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒక్కో బాష నుంచి ఒక్కొక్కరుగా డిజిటల్ రిలీజ్ కు మొగ్గు చూపుతుండటంతో ఇది అంతకంతకు వేడిని రాజేస్తోందే తప్ప తగ్గడం లేదు. ఇప్పటికే ఐనాక్స్, పివిఆర్, కార్నివాల్ సంస్థలు బహిరంగంగానే ఒకరకమైన బెదిరింపు ధోరణితో లేఖలు విడుదల చేశాయి. ప్రొడ్యూసర్ గిల్డ్ నుంచి దాని తగ్గట్టే సమాధానం వచ్చింది కాని అది మరీ పర్ఫెక్ట్ కౌంటర్ లా అనిపించలేదు . ఈ నేపథ్యంలో కేరళకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ లిటిల్ బిగ్ ఫిలింస్ ఒక ఓపెన్ లెటర్ ని ప్రెస్ కు పంపడంతో పాటు ఆన్ లైన్ లోనూ పోస్ట్ చేశారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది అదిరిపోయే సమాధానంగా అనిపించింది. దాని సారాంశం ఇలా ఉంది.

“పంపిణీదారులైన స్నేహితులకు,

అవును, 2020లో కొందరు నిర్మాతలు నేరుగా తమ సినిమాలు ఓటిటి ద్వారా విడుదల చేయలనుకున్నారు. దానికి బదులుగా డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్లు ఇకపై ఆ హీరో, నిర్మాత, దర్శకుడి చిత్రాలను బ్యాన్ చేస్తామని బెదిరించాయి. ఒక్కసారి 2013లో గొప్ప దార్శనికుడు కమల్ హాసన్ చేసిన ఇలాంటి ప్రయత్నాన్ని గుర్తు చేసుకోండి. అప్పుడు ఓటిటి విప్లవం లేదు.

మనం ప్రేమించేది సినిమాలను, థియేటర్లను కాదు.

మూవీ లవర్స్ మైళ్ల కొద్ది దూరం ప్రయాణించి హాల్ కు వచ్చేది మంచి సినిమా కోసం. ఎవరూ మంచి కంటెంట్ లేకుండా కేవలం వసతులు బాగున్నాయని థియేటర్ కు రారు.

మార్పుని ఒప్పుకోండి. మీరు టెలివిజన్ ని ఆపలేదు. యుట్యూబ్ ని ఆపలేదు. ఇప్పుడీ స్ట్రీమింగ్ విప్లవాన్ని కూడా ఆపలేరు. మనం చూస్తున్నాం ఎందరో క్రియేటివ్ టాలెంట్ ఉన్న యువతీయువకులు కొద్దిరోజుల్లోనే తమ వీడియోల ద్వారా మిలియన్ల సబ్స్క్రైబర్స్ ని చేర్చుకుంటూ డబ్బు సంపాదిస్తున్నారు. ఒక అందమైన థియేటర్ లో ఆడుతుందన్న ఒకే కారణంతో చెత్త సినిమాకు ఎవరూ రారనే సత్యాన్ని గుర్తించాలి. ఇక్కడ కంటెంట్ మాత్రమే రాజు. టెక్నాలజీ అన్నింటి మీదా ప్రభావం చూపుతోంది. మీ బలం మీద దృష్టి పెట్టండి. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో అది ఇవ్వండి. చేతి వేలితో రెండు బటన్లు నొక్కితే సులభంగా చూడగలిగే మాములు కంటెంట్ కోసం జనం హాల్ కు రారు. వసతులు మెరుగుపరచండి. ఇందులో సినిమా ఇండస్ట్రీ కూడా భాగం వహిస్తుంది.

మీరిలా కనీళ్ళు కార్చడానికంటే ముందు చూసేవాళ్ళకు మీరేమి ఫ్రీ టికెట్లు ఇవ్వడం లేదని గుర్తుంచుకొండి. ఆడియన్స్ కౌంటర్లో, ఆన్ లైన్ లో టికెట్లు కొంటారు. 90% ఎగ్జిబిటర్లు సరైన సమయంలో బకాయిలు చెల్లించడం లేదు. కాళ్ళు అరిగేలా తిరిగిన నిర్మాతలు ఎందరో ఉన్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ లేని ఒక ఆర్ట్ మూవీనో లేదా అవార్డు విన్నింగ్ చిత్రాన్నో మీరు లాంగ్ రన్ వేసి సహకరించారా. ఏదైనా పెద్ద స్టార్ సినిమా వస్తే చాలు నిర్ధాక్షిణ్యంగా తీసేయడం మీరు చేయలేదా. అప్పులు చేసి కోట్ల పెట్టుబడి పెట్టిన నిర్మాతకు సినిమాను ఏ ప్లాట్ ఫార్మ్ మీద విడుదల చేయాలో నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. ఇప్పటికీ ల్యాబుల్లో కొన్ని వందల సినిమాలు కమర్షియల్ అంశాలు లేవన్న కారణంతో మీరు వేసుకోవడానికి సిద్ధంగా లేరన్న అడ్డంకితో మగ్గిపోతున్నాయి. వాటికి సహకారం ఇస్తారా. నిర్మాతలుగా మేము కొత్త అవకాశాలు వెతుకుతున్నాం. పరస్పర సహకారంతో ముందుకు వెళ్దాం. ఆడియన్స్ కి ఏం కావాలో కలిసి ఇద్దాం. ఇదే వాస్తవం. మార్పును అందరూ అంగీకరించాల్సిందే. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో మీరు ఒప్పుకునే తీరతారు”

ఇది దీని పూర్తి సారాంశం. ఆ సంస్థ అధినేత సువిన్ కె వార్కే పేరుతో విడుదల చేసిన ఈ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సూటిగా ప్రశ్నించిన తీరు ఆలోచింపజేసేలా ఉంది. కరోనా వల్ల పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేని ఇలాంటి వాతావరణంలో ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే హక్కు స్వేచ్చ నిర్మాతలకు ఉంటుంది. అంతే తప్ప మల్టీ ప్లెక్సులు పాల్పడుతున్న వార్నింగుల ట్రెండ్ మాత్రం ఎక్కువకాలం కొనసాగడం మాత్రం అసాధ్యం

Show comments