రొమాOటిక్ సీన్స్‌లో నటించినప్పుడు దద్దుర్లు వచ్చాయి: యంగ్ హీరోయిన్

రొమాOటిక్ సీన్స్‌లో నటించినప్పుడు దద్దుర్లు వచ్చాయి: యంగ్ హీరోయిన్

ఈ మధ్య రొమాOటిక్ సీన్స్ లో నటించిన నటీమణులు.. ఆ సీన్స్ చేసినప్పుడు తమకు ఎదురైన అనుభవాలను మీడియా ముందు బయటపెడుతున్నారు. తాజాగా ఓ నటి కూడా రొమాOటిక్ సీన్స్ షూట్ సమయంలో తనకు ఎదురైన ఇబ్బందులను బయటపెట్టింది.

ఈ మధ్య రొమాOటిక్ సీన్స్ లో నటించిన నటీమణులు.. ఆ సీన్స్ చేసినప్పుడు తమకు ఎదురైన అనుభవాలను మీడియా ముందు బయటపెడుతున్నారు. తాజాగా ఓ నటి కూడా రొమాOటిక్ సీన్స్ షూట్ సమయంలో తనకు ఎదురైన ఇబ్బందులను బయటపెట్టింది.

ఈ మధ్య సినిమాల్లో కంటే ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్ లలోనే రొమాOటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటున్నాయి. పాత్ర, కథ డిమాండ్ చేస్తుందని చెప్పి ఈ సీన్స్ ని పెట్టేస్తున్నారు. ఒకప్పుడు ఈ సీన్స్ చేసిన హీరోయిన్స్ గానీ, నటీమణులు గానీ మీడియా ముందు మాట్లాడేందుకు ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పుడంతా సీన్ మారింది. ఆ సీన్ల గురించి కూడా చర్చిస్తున్నారు. ఆ సీన్స్ లో నటించినప్పుడు ఎదురైన అనుభవాలను పంచుకుంటున్నారు. ఇప్పటికే హీరామండి సిరీస్ లో నటించిన సోనాక్షి సిన్హా, అదితీరావ్ హైదరీ.. మంగళవారం ఫేమ్ దివ్య పిళ్ళై తాము చేసిన ఘాటు సన్నివేశాల గురించి మాట్లాడారు. తాజాగా హీరామండి నటి కూడా ఈ ఘాటు సీన్స్ లో నటించినప్పుడు ఎదురైన అనుభవాలను మీడియా ముందు బయటపెట్టింది.

రొమాOటిక్ సీన్స్ చేస్తున్నప్పుడు కష్టాలు పడాల్సి వస్తుందని యంగ్ హీరోయిన్ శృతి శర్మ వెల్లడించింది. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి సిరీస్ లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావ్ హైదరీ, శృతి శర్మ తదితరులు నటించారు. అయితే ఈ సిరీస్ లో ఘాటు సన్నివేశాలు ఎక్కువే ఉన్నాయి. వాటిలో శృతి శర్మ చేసిన ఘాటు సన్నివేశాలు కూడా ఉన్నాయి. అయితే ఆ సీన్స్ లో నటించినప్పుడు ఇబ్బందులు పడ్డానని శృతి శర్మ చెప్పుకొచ్చింది. ఈ సిరీస్ లో రజత్ కౌల్ తో కలిసి తాను కొన్ని రొమాOటిక్ సీన్స్ లో నటించానని.. ఇద్దరం చాలా సహజంగా నటించామని చెప్పుకొచ్చింది. తన కెరీర్ లో ఇప్పటి వరకూ ఇలాంటి రొమాంటిక్ సీన్స్ చేయలేదని పేర్కొంది.

అయితే దుమ్ము, ధూళి ఉన్న చోట రోజంతా కష్టపడి రొమాOటిక్ సీన్స్ చేశామని.. ఆ సమయంలో తన శరీరంపై దద్దుర్లు వచ్చాయని శృతి శర్మ వెల్లడించింది. అయినప్పటికీ సీన్స్ పర్ఫెక్ట్ గా వచ్చేవరకూ షూట్ చేశామని.. అందుకే ఆ సీన్స్ అంత బాగా వచ్చాయని పేర్కొంది. ఈ సిరీస్ లో సైమా అనే పాత్రలో నటించింది శృతి శర్మ. శరీరంపై దద్దుర్లు వచ్చినా గానీ సైమా పాత్ర చేయడం సంతోషంగా ఉందని..  సంజయ్ లీలా భన్సాలీ డిజైన్ చేసిన సైమా పాత్రను ఆయన ఊహించినట్టు రావడం కోసం చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చింది. ఇక ఈ సిరీస్ విషయానికొస్తే.. స్వాతంత్య్రం ముందు పాకిస్తాన్ లో రెడ్ లైట్ జిల్లాగా ఉన్న హీరామండి అనే ప్రాంతంలో వేశ్యల కథల ఆధారంగా తెరకెక్కించబడింది. ఇక శృతి శర్మ తెలుగులో నవీన్ పోలిశెట్టి నటించిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మూవీలో హీరోయిన్ గా నటించింది.    

Show comments