KA Paul Cheating Case: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో KA పాల్ పై చీటింగ్ కేసు!

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో KA పాల్ పై చీటింగ్ కేసు!

KA Paul Cheating Case: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన తెలుగు రాష్ట్రాల్లో తెగ హంగామా సృష్టించారు.

KA Paul Cheating Case: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన తెలుగు రాష్ట్రాల్లో తెగ హంగామా సృష్టించారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందండి ముగిసింది. జూన్ 4 న ఫలితాలు రానున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. గ్లోబల్ పీస్ చారిటి పేరిట వివిధ దేశాలు తిరుగుతూ క్రైస్తవ మత ప్రచారకుడిగా కొనసాగారు. 2008 లో ప్రజాశాంతి అనే రాజకీయ పార్టీ స్థాపించారు. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ పార్టీ ప్రచారం చేయడం మొదలు పెట్టారు. 2019లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. తాజాగా కేఏపాల్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ పై తెలంగాణలో చీటింగ్ కేసు నమోదు అయ్యింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజాశాంతి పార్టీ తరుపున పోటీ చేసేందుకు ఎల్బీ నగర్ టికెట్ ఇస్తానని రూ.50 లక్షలు తీసుకొని.. తీరా టికెట్ కేటాయించే సమయానికి తనని మోసం చేశాడని హైదరాబాద్ జిల్లెలగూడకు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందన్న ఆశతో ఎంతో ఖర్చు చేసి దివాలా తీశానని కిరణ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

రూ.50 లక్షలు ఇస్తే తనకు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తానని హామీ ఇచ్చారని.. ఇందులో రూ.30 లక్షలు ఆన్ లైన్ లో కేఏ పాల్ కి చెల్లించానని, మిగిలిన రూ.20 లక్షలు పలు దఫాలుగా ఇచ్చానని తెలిపారు. కిరణ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. ఇదిలా ఉంటే.. ప్రజాశాంతి పార్టీ చీఫ్ పై చీటింగ్ కేసు నమోదు కావడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Show comments