Child Artist Devananda Father About Trolling: ఛీ వీళ్లసలు మనుషులేనా.. బాలనటిని సైతం వదల్లేదు.. తండ్రి ఫిర్యాదుతో

ఛీ వీళ్లసలు మనుషులేనా.. బాలనటిని సైతం వదల్లేదు.. తండ్రి ఫిర్యాదుతో

Devananda: మాలికాపురం సినిమాలో నటించిన చిన్నారి గుర్తుందా.. తాజాగా ఆ బాలిక తండ్రి.. పోలీసులను ఆశ్రయించాడు. ఆ వివరాలు..

Devananda: మాలికాపురం సినిమాలో నటించిన చిన్నారి గుర్తుందా.. తాజాగా ఆ బాలిక తండ్రి.. పోలీసులను ఆశ్రయించాడు. ఆ వివరాలు..

నేటి కాలంలో కొందరు మనుషుల మనస్తత్వం ఎలా మారింది అంటే.. వారి జీవితాల్లో ఎన్ని కష్టాలు, బొక్కలున్నా సరే.. పక్క వారి జీవితంలోకి తొంగి చూస్తారు. వారిపై విమర్శలు చేస్తూ.. ఏడిపిస్తూ.. రక్షసానందం పొందుతారు. సోషల్‌ మీడియా వినియోగం పెరిగాక.. ఇలాంటి మనుషులు మన సమాజంలో విపరీతంగా పెరిగారు. సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేయాలంటే.. ముఖం చూపించాల్సిన పని లేదు. ఎక్కడో చాటుగా కూర్చుని.. నచ్చని వాళ్ల మీద విమర్శలు చేస్తూ.. శునకానందం పొందవచ్చు. అయితే ఇలా విమర్శించే వారికి సరదాగానే ఉండవచ్చు.. కానీ వాటిని ఎదుర్కొనే వారికి ఎంత బాధకరమో ఊహించలేరు. సున్నిత మనస్కులైతే.. ఈ దారుణాలను భరించలేక ప్రాణాలు కూడా తీసుకుంటారు. కొన్ని నెలల క్రితం ఏపీ మహిళ గీతాంజలి ఇలానే వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇక ఇలాంటి వేధింపులు సెలబ్రిటీలకు ఎక్కువగా ఉంటాయి. వారి మీద ఇష్టారాజ్యంగా కామెంట్స్‌ చేస్తూ.. శునకానందం పొందుతుంటారు కొందరు. అయితే ఈమధ్య కాలంలో జనాలు ఎంతలా దిగజారిపోతున్నారు అంటే.. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు అని కూడా చూడకుండా.. వారి మీద కూడా విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఓ బాలనటికి ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. వేధింపులు భరించలేక.. ఆ చిన్నారి తండ్రి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

మాలికాపురం సినిమాకు ఓటీటీలో మంచి ఆదరణ లభించింది. ఈ మలయాళ సినిమాను తెలుగు ప్రేక్షకులు కూడా బాగానే ఆదరించారు. ఇక ఈ చిత్రంలోఉన్ని ముకుందన్‌ హీరోగా నటించాడు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌ దేవానంద ప్రధాన పాత్రలో మెప్పించింది. చిన్నారి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత 2018, నైమర్‌, అరణ్మనై 4 వంటి చిత్రాల్లో నటించింది దేవానంద. తాజాగా ఈ బాలిక నటించిన గు అనే హారర్‌ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు.. ప్రమోషన్స్‌లో భాగంగా.. కొన్ని యూట్యూబ్‌ చానెల్స్‌కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. అలానే తన నివాసంలో కూడా ఓ ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. అయితే దీన్ని కొందరు ఇష్టారీతిన కట్‌ చేస్తూ.. తప్పుడు థంబ్‌నెల్స్‌ పెడుతూ.. చిన్నారి మాటలను వక్రీకరిస్తున్నారట.

ఇంటర్వ్యూలో దేవానంద అన్న మాటలను వక్రీకరిస్తూ.. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ వంటి సోషల్‌ మీడియా చానెల్స్‌ వేదికగా.. తన కుమార్తెపై విమర్శలు చేస్తున్నారని చిన్నారి తండ్రి తెలిపాడు. ఇంటర్వ్యూలోని ఒక పార్ట్‌ను మాత్రమే కట్‌ చేసుకుని తన కూతురిపై బురద చల్లుతున్నారని మండిపడ్డాడు. విద్వేషపూరిత ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విమర్శల వల్ల తన పదేళ్ల కుమార్తె.. మానసిక ఆవేదనకు గురవుతుందని.. తన కుమార్తెపై ద్వేషం ప్రదర్శిస్తూ.. చేసిన వీడియోలను వెంటనే సదరు ఛానెల్స్‌ డిలీట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అంతేకాకుండా ఇలాంటి తప్పుడు వీడియోలు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.

దేవానంద ప్రస్తుతం ఐదో తరగతి చదువుతోంది. తొట్టప్పన్‌(2019) చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆమె మై సాంటా, మిన్నాల్‌ మురళి, టీచర్‌, మాలికాపురం వంటి అనేక చిత్రాల్లో నటించింది. మాలికాపురం సినిమాలో ఈ బాలనటి ఎలాగైనా శబరిమల వెళ్లాలనుకుంటుంది. చివరకు తల్లిదండ్రులు, పెద్దవారి సాయం లేకుండా తాను అనుకున్నది సాధిస్తుంది. అయితే ఈ సినిమా కోసం దేవానంద సుమారు 75 రోజులపాటు ఉపవాసం ఉంది. పైగా తను శబరిమల వెళ్లడం కూడా అదే తొలిసారి అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. పదేళ్ల బాలికపై ఇలా విమర్శలు చేయడం ఏంటని.. మండిపడుతున్నారు నెటిజనులు.

Show comments