వీడియో: ఇదేం పాడు బుద్ధి.. రియాన్ పరాగ్ పై తీవ్ర విమర్శలు! హీరోయిన్ల..

వీడియో: ఇదేం పాడు బుద్ధి.. రియాన్ పరాగ్ పై తీవ్ర విమర్శలు! హీరోయిన్ల..

హీరోయిన్ల విషయంలో రియాన్ పరాగ్ చేసిన పనికి ఇదేం పాడు బుద్ధి అంటూ నెటిజన్లు అతడిని ఏకిపారేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

హీరోయిన్ల విషయంలో రియాన్ పరాగ్ చేసిన పనికి ఇదేం పాడు బుద్ధి అంటూ నెటిజన్లు అతడిని ఏకిపారేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ 2024 సీజన్ లో పరుగుల వరద పారించాడు టీమిండియా యంగ్ బ్యాటర్, రాజస్తాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్. తన యాటిట్యూడ్ తో ఓవరాక్షన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ప్లేయర్.. ఈ సీజన్ లో అవన్నీ మరిచి దుమ్మురేపాడు. ఇక ఐపీఎల్ ముగిసిన తర్వాత తన రొటీన్ లైఫ్ ను స్టార్ట్  చేసినట్లున్నాడు పరాగ్. హీరోయిన్ల విషయంలో అతడు చేసిన పనికి ఇదేం పాడు బుద్ధి అంటూ నెటిజన్లు అతడిని ఏకిపారేస్తున్నారు. మరి ఇంతకీ రియాన్ చేసిన తప్పు ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

రియాన్ పరాగ్.. ఐపీఎల్ 2024 సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ కు ఆడిన ఈ యంగ్ ప్లేయర్ అదరగొట్టాడు. ఆర్ఆర్ ప్లే ఆఫ్స్ చేరడంలో పరాగ్ ది కీలక పాత్ర. ఈ సీజన్ లో ఆడిన 14 మ్యాచ్ ల్లో 52 సగటుతో 573 పరుగులు చేశాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో విరాట్ కోహ్లీ(741), రుతురాజ్ గైక్వాడ్(583) తర్వాత అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా పరాగ్ నిలిచాడు. దీంతో త్వరలోనే టీమిండియాలోకి అడుగు పెట్టేందుకు బాటలు వేసుకున్నాడు ఈ చిచ్చర పిడుగు.

ఇదంతా కాసేపు పక్కనపెడితే.. రియాన్ పరాగ్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఐపీఎల్ ముగియడంతో.. తన రొటీన్ లైఫ్ ను ప్రారంభించాడు పరాగ్. ఈ క్రమంలో ఆన్ లైన్ గేమింగ్ లైవ్ స్ట్రీమింగ్ సెషన్ లో పాల్గొన్నాడు పరాగ్. ఇప్పుడు ఇదే పరాగ్ ను చిక్కుల్లో పడేసింది. ఈ సెషల్ లో భాగంగా పరాగ్ తన యూట్యూబ్ ను ఓపెన్ చేశాడు. అందులో అతడి సెర్చ్ హిస్టరీని చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. పరాగ్ సెర్చ్ హిస్టరీలో బాలీవుడ్ స్టార్స్ అనన్య పాండే హాట్, సారా అలీఖాన్ హాట్, విరాట్ కోహ్లీ అని ఉంది. దీంతో హీరోయిన్ల అందాల కోసం ఇంతలా సొల్లు కార్చాలా? అంటూ నెటిజన్లు పరాగ్ పై మండిపడుతున్నారు. తన సెర్చ్ హిస్టరీని అతడు హైడ్ చేయకపోవడంతో.. ఒక్కసారిగా అవి ప్రత్యక్షం అయ్యాయి. ఇదే పాడు బుద్ధి పరాగ్? అని విమర్శిస్తున్నారు. మరి హీరోయిన్ల విషయంలో పరాగ్ చేసిన దానిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments