Hyderabad Crossed Bangalore: దేశంలో టాప్ సిటీగా హైదరాబాద్! రియల్ ఎస్టేట్‌పై ఇన్వెస్ట్ చేస్తే మీ దశ తిరుగుతుంది!

దేశంలో టాప్ సిటీగా హైదరాబాద్! రియల్ ఎస్టేట్‌పై ఇన్వెస్ట్ చేస్తే మీ దశ తిరుగుతుంది!

Hyderabad Crossed Bangalore: అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి పరుగులు పెడుతుండడంతో హైదరాబాద్ నగరం విశ్వనగరంగా రూపాంతరం చెందుతుంది. ఇప్పుడు దేశంలోనే టాప్ సిటీగా ఉంది. ఇప్పుడు కనుక హైదరాబాద్ లో స్థలాల మీద పెట్టుబడి పెడితే కనుక తిరుగుండదని నిపుణులు చెబుతున్నారు.

Hyderabad Crossed Bangalore: అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి పరుగులు పెడుతుండడంతో హైదరాబాద్ నగరం విశ్వనగరంగా రూపాంతరం చెందుతుంది. ఇప్పుడు దేశంలోనే టాప్ సిటీగా ఉంది. ఇప్పుడు కనుక హైదరాబాద్ లో స్థలాల మీద పెట్టుబడి పెడితే కనుక తిరుగుండదని నిపుణులు చెబుతున్నారు.

హైదరాబాద్ మహా నగరం దినదినాభివృద్ధి చెందుతుంది. విశ్వనగరంగా మారుతోంది. దేశంలో హైదరాబాద్ ఇప్పుడు దేశంలోనే నంబర్ వన్ సిటీగా ఉంది. ఫ్యూచర్ లో ప్రపంచంలోనే అగ్ర నగరాల జాబితాలో హైదరాబాద్ కూడా చోటు సంపాదించుకోవడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టే వారికి ఫ్యూచర్ లో భారీ లాభాలు ఉంటాయని చెబుతున్నారు. దీనికి కారణం ఇటీవల హైదరాబాద్ లో చోటు చేసుకున్న గణనీయ మార్పులే అని చెబుతున్నారు. ఏ నగరం అయినా డెవలప్ అవ్వాలంటే అక్కడ ఐటీ రంగం అభివృద్ధి చెందాలి. హైటెక్ సిటీ, మాదాపూర్ ఏరియాలే అందుకు ఉదాహరణ. ఉద్యోగ అవకాశాలు పెరిగితే ఉద్యోగులు పెరుగుతారు. వాళ్ళు ఉండడం కోసం అక్కడ మౌలిక సదుపాయాలు, నివాస సౌకర్యాలు వంటివి డెవలప్ అవుతాయి. దీని కారణంగా రియల్ ఎస్టేట్ అనేది పెరుగుతుంది. ఆల్రెడీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో టాప్ లో ఉంది. అయితే రానున్న రోజుల్లో ఇది మరింత పెరగనుందని కొన్ని గణాంకాలు చూస్తేనే తెలుస్తుంది.

బెంగళూరును దాటేసిన హైదరాబాద్:

నిజానికి ఐటీ రంగానికి కేరాఫ్ అడ్రస్ అంటే బెంగళూరు అని చెబుతారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. 2023 ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ వరకూ ఐటీ జాబ్స్ స్థితిని హైలైట్ చేస్తూ ఇన్ డీడ్ ఒక కొత్త డేటాను రిలీజ్ చేసింది. ఈ డేటా ప్రకారం.. ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాలు బెంగళూరులో 24 శాతం పెరగ్గా.. హైదరాబాద్ లో 41.5 శాతం పెరిగాయి. దేశంలో ఐటీ జాబ్స్ లో హైదరాబాద్, బెంగళూరు నగరాలు టాప్ లో ఉన్నాయి. అయితే బెంగళూరు కంటే కూడా హైదరాబాద్ నే ఎక్కువగా ఇష్టపడుతుండడం విశేషం. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. జాబ్ క్లిక్ లలో కూడా హైదరాబాద్ లో ఐటీ జాబ్స్ నియామకాలు బాగా పెరిగినట్లు తేలింది. ఏకంగా హైదరాబాద్ లో 161 శాతం పెరిగింది. బెంగళూరులో మాత్రం 80 శాతం పెరిగింది. ఈ లెక్కన హైదరాబాద్ అనేది బెంగళూరుతో పోలిస్తే ఐటీ ఉద్యోగులకు డెస్టినీగా ఉంది. పైగా బెంగళూరులో ఇటీవల నీటి కష్టాలు బాగా ఇబ్బంది పెట్టడంతో చాలా మందికి హైదరాబాద్ ఒక ఆపన్నహస్తంగా కనబడింది.

ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు:

బెంగళూరులో స్థిరపడాలన్న ఆలోచన విధానం మారింది. వీటన్నిటి దృష్ట్యా హైదరాబాద్ రావాలనుకుంటున్న ఐటీ ఉద్యోగులకు గానీ కొత్తగా ఐటీ జాబ్స్ లో చేరేవారికి గానీ నివాస స్థలాలు గానీ ఉండడానికి ఫ్లాట్ లేదా ఇల్లు అనేది ఉండాలి. ఖచ్చితంగా ఇక్కడ ఇల్లు గానీ ఒక స్థలం గానీ కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతారు. పైగా దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ. దీంతో హైదరాబాద్ అనేది దేశంలో ఉన్న ఐటీ ఉద్యోగులకు ఒక ఆప్షన్ గా మారిపోతుంది. మరోవైపు రానున్న కాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల హైవే ఏరియాలు.. ముఖ్యంగా బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే, ముంబై హైవే ప్రాంతాలు పూర్తిగా అభివృద్ధి చెందనున్నాయి. స్థలాల మీద డిమాండ్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేసిన వారికి మంచి లాభాలను పొందే ఛాన్స్ ఉంటుంది.

Show comments