House Build Within Month: తక్కువ ధరకే సామాన్యుల సొంతింటి కల నెరవేరుస్తున్న మహిళ.. నెలలోపే ఇల్లు పూర్తి

తక్కువ ధరకే సామాన్యుల సొంతింటి కల నెరవేరుస్తున్న మహిళ.. నెలలోపే ఇల్లు పూర్తి

House Build Within Month: మామూలుగా ఒక ఇల్లు పూర్తవ్వాలంటే బిల్డర్లు కనీసం ఆరు నెలల నుంచి ఏడాది సమయం తీసుకుంటారు. కానీ ఈమె మాత్రం కేవలం నెల లోపే ఇంటిని అందిస్తామని అంటున్నారు. మరి అదెలా సాధ్యమో మీరే తెలుసుకోండి. 

House Build Within Month: మామూలుగా ఒక ఇల్లు పూర్తవ్వాలంటే బిల్డర్లు కనీసం ఆరు నెలల నుంచి ఏడాది సమయం తీసుకుంటారు. కానీ ఈమె మాత్రం కేవలం నెల లోపే ఇంటిని అందిస్తామని అంటున్నారు. మరి అదెలా సాధ్యమో మీరే తెలుసుకోండి. 

ఇల్లు కట్టడం అంటే మామూలు విషయం కాదు. మేస్త్రీలు, కూలీలు, బిల్డర్లు, ఇంజనీర్లు అబ్బో పెద్ద వ్యవహారం ఉంటుంది. ఇక ఇల్లు పూర్తవ్వాలంటే ఏడాది సమయం పడుతుంది. అద్దె ఇంట్లో ఉంటూ ఇల్లు కట్టించుకునేవారికి అయితే నెల నెలా వడ్డీలు, ఈఎంఐలు లాస్. కానీ అలాంటి పరిస్థితి లేకుండా ఒక్క నెలలోనే ఇల్లు కట్టి ఇస్తానని స్రవంతి అంటున్నారు. అది కూడా మేస్త్రీలు కట్టే ఇళ్లకు ఏ మాత్రం తీసిపోదని ఆమె అంటున్నారు. హైదరాబాద్ కి చెందిన సేవకుల స్రవంతి అనే మహిళ.. ఆరేళ్లుగా ఎకో ఫ్రెండ్లీ ఇండ్లను నిర్మిస్తూ ప్రత్యేకతను చాటుకున్నారు. మహిళా వ్యాపారవేత్తగా ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. హైదరాబాద్ కి చెందిన స్రవంతి ఎంబీఏ చేశారు. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేశారు.

ఇల్లు కట్టుకోవాలనుకునే క్రమంలో ఆమె ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టెక్నాలజీ గురించి తెలుసుకున్నారు. ఈ టెక్నాలజీ వినియోగించి ఒక ఇంటిని నిర్మించుకున్నారు. ఆ తర్వాత హెవెన్లీ మొబైల్ హౌస్ పేరుతో 2018లో ఒక కంపెనీని ప్రారంభించారు. తాను ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్న విషయాన్ని సివిల్ ఇంజనీర్స్ కి చెప్తే..  వాళ్ళు ఆరు నెలల నుంచి ఏడాదిలోపు పూర్తి చేసి ఇస్తామని అన్నారని ఆమె వెల్లడించారు. తనకు ఒక నెలలోనే ఇల్లు పూర్తవ్వాలంటే ఎలా అని రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. మామూలుగా బయట కట్టిస్తే ఎంత నాణ్యత ఉంటుందో అంతే నాణ్యతతో.. నెలలోనే ఇల్లు కట్టుకునే పద్ధతి గురించి తెలుసుకున్నా అని ఆమె అన్నారు. ఇదే విషయాన్ని జనానికి చెప్పాలనుకున్నానని.. తన ఇంటితో మొదలుపెట్టి ఇలాంటి ఇల్లు ఒక సొల్యూషన్ ఉందని చెప్పాలని స్టార్ట్ చేశానని అన్నారు.

ఇప్పటి వరకూ 200 నుంచి 250 ఇల్లు కట్టించి ఇచ్చానని అన్నారు. స్రవంతి తయారు చేసే ఈ మొబైల్ హౌస్ లకి హైదరాబాద్ లో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఫామ్ హౌజ్ లు, వ్యక్తిగత ఇళ్ళు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల కోసం సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. సాధారణ ఇళ్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా అత్యంత క్వాలిటీగా నిర్మిస్తున్నామని అన్నారు. సివిల్ హౌజ్ లు కాంక్రీట్, ఇసుక, సిమెంట్, స్టీల్ ఉపయోగిస్తారని.. అయితే ఈ మొబైల్ హౌజ్ కి మాత్రం పూర్తిగా స్టీల్ ని ఉపయోగిస్తామని అన్నారు. స్టీల్ తో పాటు గోడలకు, రూఫ్ కి సెపరేట్ మెటీరియల్ డిజైన్ చేయిస్తామని అన్నారు. బయట మేస్త్రీలు కట్టిన ఇల్లు ఎలా అయితే 50, 60 ఏళ్ళు స్టాండర్డ్ గా ఉంటుందో.. ఈ ఇల్లు కూడా 60 ఏళ్ల వరకూ స్టాండర్డ్ గా ఉంటుందని అన్నారు.

అలానే సమ్మర్ లో బయట టెంపరేచర్ కంటే ఇంటి లోపల 10 డిగ్రీలు తక్కువగా ఉంటుందని అన్నారు. ఇక చలికాలంలో కూడా బయట టెంపరేచర్ తో పోలిస్తే ఇంట్లో హీట్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుందని అంటున్నారు. కూకట్ పల్లిలో వర్క్ షాప్ ఏర్పాటు చేసి 40 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇంటి నిర్మాణం కోసం వాడే స్టీల్ నుంచి గోడలకు వాడే ఫైబర్ సహా ప్రతి విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నామని.. తమ దగ్గర 300 రకాల డిజైన్లు అందుబాటులో ఉన్నాయని.. కస్టమర్లు కోరుకున్న విధంగా కట్టించి ఇస్తామని అన్నారు. ఒక నెలలో ఇల్లు కట్టి ఇవ్వడంతో పాటు ఎక్కడికి కావాలంటే అక్కడికి ట్రాన్స్ పోర్ట్ కూడా చేస్తామని అంటున్నారు. ఈ ఇంటికి అయ్యే ఖర్చు కూడా సామాన్యులకు అందుబాటులో ఉంటుందని ఆమె అన్నారు.

Show comments