Post Office RD Scheme Details: పోస్టాఫీస్‌ నుంచి బెస్ట్‌ స్కీమ్‌.. పదేళ్లలో చేతికి రూ.17 లక్షలు.. తక్కువ పొదుపుతో భారీ లాభం

పోస్టాఫీస్‌ నుంచి బెస్ట్‌ స్కీమ్‌.. పదేళ్లలో చేతికి రూ.17 లక్షలు.. తక్కువ పొదుపుతో భారీ లాభం

Post Office RD Scheme: తక్కువ పొదుపుతో ఎలాంటి రిస్క్‌ లేకుండా.. భారీ రాబడి పొందాలనుకుంటున్నారా.. అయితే మీకు ఈ పోస్టాఫీస్‌ స్కీమ్‌ బెటర్‌ ఆప్షన్‌. ఆ వివరాలు..

Post Office RD Scheme: తక్కువ పొదుపుతో ఎలాంటి రిస్క్‌ లేకుండా.. భారీ రాబడి పొందాలనుకుంటున్నారా.. అయితే మీకు ఈ పోస్టాఫీస్‌ స్కీమ్‌ బెటర్‌ ఆప్షన్‌. ఆ వివరాలు..

నేటి కాలంలో ఎంత చిన్న ఉద్యోగం, వ్యాపారం చేసే వారైనా సరే.. తమ ఆదాయంలో ఎంతో కొంత పొదుపు చేయడానికి ఆస​‍క్తి చూపుతున్నారు. ఇక కేంద్రం కూడా అనేక రకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకొస్తుంది. చిన్నారులు మొదలు వృద్ధులు వరకు అన్ని వయసుల వారికి ఉపయోగపడేలా పొదుపు పథకాలను ప్రారంభిస్తుంది. అయితే జనాలు ఎక్కువగా పోస్టాఫీసు పథకాలకే ఆకర్షితులవుతున్నారు. అందుకు కారణం.. కేంద్ర ప్రభుత్వం భరోసా, మంచి వడ్డీ, అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉండటంతో.. చాలా మంది తమ డబ్బులను డిపాజిట్ చేసేందుకు పోస్టాఫీసుల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇక మీరు కూడా నెల నెల చిన్న మొత్తాల్లో పొదుపు చేయాలనుకుంటే పోస్టాఫీసు అందించే రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఎంచుకోవచ్చు. ఇందులో 10 ఏళ్లలోనే చేతికి రూ.17 లక్షలు వస్తాయి. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

తక్కువ కాలంలో భారీగా లాభాలు పొందాలనుకునే వారికి పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకం మంచి ఎంపిక. ఈ స్కీమ్‌లో నెల నెలా పొదుపు చేసుకోవచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ కాలం 5 ఏళ్లు లేదా 60 నెలలు ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కీమ్ మీద కేంద్రం 6.7 శాతం వడ్డీ రేటును అందిస్తోంది 2024, ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి గానూ ఈ వడ్డీ రేటును నిర్ణయించింది. అలాగే ఈ స్కీమ్ మెచ్యూరిటీ తర్వాత కావాలంటే మరో 5 ఏళ్ల పాటు పొడిగించుకోవచ్చు. ఇందులో కనీసం రూ.100 నుంచి పెట్టుబడి మొదలు పెట్టవచ్చు. గరిష్టంగా ఎంత మొత్తమైనా ఇన్వెస్ట్‌ చేయవచ్చు. దీనికి ఎలాంటి లిమిట్‌ లేదు. మీరు నెలకు రూ.1000 చొప్పున 5 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే మీ పెట్టుబడి సొమ్ము రూ.70 వేల వరకు అవుతుంది. మరో ఐదేళ్లు పొడిగించి 10 ఏళ్ల తర్వాత తీసుకుంటే చేతికి రూ.1.70 లక్షల వరకు వస్తాయి.

10 ఏళ్లలో రూ.17 లక్షలు ఎలా పొందుతామంటే..

ఈ స్కీములో చేరి.. పదేళ్లలో 17 లక్షలు రూపాయలు పొందాలనుకుంటే.. రోజుకు రూ.333 ఇన్వెస్ట్ చేయాలి. అంటే నెలకు మీ పెట్టుబడి రూ.10 వేలు అవుతుంది అన్నమాట. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఏళ్లు కాబట్టి ఈ సమయానికి మీరు ఇన్వెస్ట్‌ చేసిన మొత్తం వడ్డీతో కలిపి రూ.7.13 లక్షలు అవుతుంది. అయితే, మీరు ఈ స్కీమ్‌ను మరో 5 ఏళ్లు పొడిగించుకున్నారు అనుకుందాం. అప్పుడు 10 ఏళ్ల మెచ్యూరిటీ తర్వాత మీ పెట్టుబడి రూ.12 లక్షలు, దానిపైన వడ్డీ రూ.5,08,546 అవుతుంది. అంటే మొత్తంగా 10 ఏళ్ల తర్వాత మీ చేతికి అసలు, వడ్డీ కలిపి రూ.17,08,546 అందుతుంది.

కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్లపై ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. ప్రస్తుతం అనగా 2024, ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి గానూ 6.7 శాతం వడ్డీ కల్పిస్తోంది. ఇది ఇటీవలి కాలంలో చూసుకుంటే ఇదూ గరిష్ఠ వడ్డీ రేటుగా చెప్పవచ్చు. ఇప్పుడు ఈ స్కీమ్‌లో చేరి ఇన్వెస్ట్‌ చేస్తే.. మంచి రాబడి పొందవచ్చు అంటున్నారు నిపుణులు.

Show comments