హైదరాబాద్‌లో 48 ఎకరాలు కొన్న మైక్రోసాఫ్ట్.. ఇది నిజంగా పండగ లాంటి వార్త

హైదరాబాద్‌లో 48 ఎకరాలు కొన్న మైక్రోసాఫ్ట్.. ఇది నిజంగా పండగ లాంటి వార్త

ప్రపంచ దిగ్గజ టాప్ టెక్ కంపెనీలో మైక్రోసాఫ్ట్ కూడా ఒకటి. అయితే తాజాగా మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ సంస్థ హైదరాబాద్ లో ఉన్న తమ కార్యకలాపాలను మరింత విస్తరించుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని పరిసరా ప్రాంతాల్లో ఏకంగా అన్ని ఎకరాల్లో స్థలం కొనుగోలు చేసింది. ఇంతకి ఎక్కడంటే..

ప్రపంచ దిగ్గజ టాప్ టెక్ కంపెనీలో మైక్రోసాఫ్ట్ కూడా ఒకటి. అయితే తాజాగా మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ సంస్థ హైదరాబాద్ లో ఉన్న తమ కార్యకలాపాలను మరింత విస్తరించుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని పరిసరా ప్రాంతాల్లో ఏకంగా అన్ని ఎకరాల్లో స్థలం కొనుగోలు చేసింది. ఇంతకి ఎక్కడంటే..

ప్రపంచ దిగ్గజ టాప్ టెక్ కంపెనీలో మైక్రోసాఫ్ట్ కూడా ఒకటి. కాగా, ఈ మైక్రోసాఫ్ట్ సంస్థకు సంబంధించి ఇటీవల కాలంలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూ ఉంది. అయితే తాజాగా మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ సంస్థ హైదరాబాద్ లో ఉన్న తమ కార్యకలాపాలను మరింత విస్తరించుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఇకపోతే హైదరాబాద్ పరిసరా ప్రాంతాల్లో 3 డేటా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మైక్రోసాఫ్ట్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాప్ట్ హైదరాబాద్ లోని భారీ స్థాయిలో భూమిని కొనుగోలు చేసింది. అయితే ఈ ల్యాండ్ లో డేటా సెంటర్ ఏర్పాటు చేయునన్నట్లు మైకోసాఫ్ట్ వర్గాలు తెలిపాయి. ఇంతకి మైక్రోసాఫ్ట్ సంస్థ ఆ భూమిని ఎక్కడ కొనుగోలు చేశాయి.. ఎన్నో ఎకరాల్లో కొనుగోలు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రముఖ దిగ్గజ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ తాజాగా హైదరాబాద్ సమీపంలో 48 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. కాగా, ఆ భూమిని రంగారెడ్డి జిల్లాలోని ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో ఈ భూమిని కొనుగోలు చేసింది.ఇక ఈ ల్యాండ్ అనేది డేటా సెంటర్ కోస ఏర్పాటు చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ వర్గాలు తెలిపాయి. అయితే గతంతో కూడా ఈ మైక్రోసాఫ్ట్ సంస్థ 3 డేటా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు కావాల్సిన భూములను ఈ టెక్ సంస్థ కొనుగోలు చేస్తోంది. అయితే ప్రస్తుతం ఎలికట్ట గ్రామంలో మైక్రోసాఫ్ట్ సంస్థ మొత్తం 48 ఎకరాలు కొనుగోలు చేసింది . కాగా, అందుకు ఎకరం రూ. 5.56 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అంటే మొత్తంగా రూ.267 కోట్లకు ఈ భూమిని తీసుకుంది. అయితే ఈ భూమిని ప్రముఖ ల్యాండ్ అగ్రిగేటర్ సాయి బాలాజీ డెవలపర్స్ నుంచి  కొనుగోలు చేసినట్లు డేటా అనలిస్ట్ సంస్థ ప్రాప్‌స్టాక్ షేర్ చేసిన డాక్యుమెంట్ ద్వారా సమాచారం తెలిసింది.

అలాగే 2022లో కూడా మైక్రోసాఫ్ట్ సంస్థ మూడు చోట్ల రూ.275 కోట్లు విలువైన భూములను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.  కాగా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న 3 డేటా కేంద్రాల్లో ఒక డేటా కేంద్రం నిర్మాణం ఇప్పటికే షాద్‌నగర్ సమీపంలో చేపట్టింది మైక్రోసాఫ్ట్. ఇక తమ డేటా సెంటర్ బిజినెస్ ను విస్తరించేందుకు ఈ సంస్థ పెద్ద ప్లాన్స్ లో ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాంతాలలోని అతిపెద్ద డేటా సెంటర్లలో ఒకటి ఏర్పాటు చేయనుంది.  కాగా, అది హైదరాబాద్ ప్రధాన నగరానికి సరిగ్గా 40 కిలోమీటర్ల దూరంలో ఈ భూమి ఉంటుంది. పైగా ఈ ల్యాండ్ కోసం కంపెనీ ప్రీమియం చెల్లించింది. ఇక ఈ డీల్ కు సంబంధం ఉన్న ఓ వ్యక్తి  ఇదివరకే ఓ మీడియాతో తెలిపింది. ఈ క్రమంలోనే ఈ సంస్థ  భారత్‌లో పుణె, ముంబై, చెన్నై లో ఇప్పటికే డేటా సెంటర్లు ఏర్పాటు చేసింది.

కాగా, హైదరాబాద్ లో ఇప్పటికే రెండు ప్రాంతాల్లో ఈ సంస్థ డేటా సెంటర్ల కోసం భూములు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రస్తుతం బెంగళూరు, నోయిడాతో పాటు హైదరాబాద్ లో 54 ఎకరాలలో ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ (IDC) ని నిర్వహిస్తోంది. ఇందుకోసం మోక్రోసాఫ్ట్ అజూర్, విండోస్, ఆఫీస్, బింగ్ వంటి టెక్నాలజీల అభివృద్ధి, పురోగతిలో ఐడీసీ కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ సెగ్మెంట్ లో తన ఉనికిని  మైక్రోసాఫ్ట్ చాలా వేగంగా పెంచుకుంటోంది. మరి, హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ సంస్థ డేటా సెంటర్ల కోసం 48 ఎకరాలు కోనుగోలు చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments