SRH vs LSG: లక్నోపై విజయంతో కొత్త చరిత్ర లిఖించిన SRH.. IPL హిస్టరీలోనే తొలిసారి!

SRH vs LSG: లక్నోపై విజయంతో కొత్త చరిత్ర లిఖించిన SRH.. IPL హిస్టరీలోనే తొలిసారి!

SRH vs LSG, IPL 2024: ఐపీఎల్‌ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్లు విధ్వంసం సృష్టించారు. లక్నో బౌలర్లను చీల్చిచెండాడుతూ.. ఐపీఎల్‌ చరిత్రలోనే అద్భుతమైన రికార్డును సాధించారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

SRH vs LSG, IPL 2024: ఐపీఎల్‌ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్లు విధ్వంసం సృష్టించారు. లక్నో బౌలర్లను చీల్చిచెండాడుతూ.. ఐపీఎల్‌ చరిత్రలోనే అద్భుతమైన రికార్డును సాధించారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ 2024లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విధ్వంసం సృష్టించింది. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత వేగంగా 160 ప్లస్‌ టార్గెట్‌ను ఛేజ్‌ చేసిన టీమ్‌గా ఎస్‌ఆర్‌హెచ్‌ నిలిచింది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో గల రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 166 పరుగుల టార్గెట్‌ను చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో కేవలం 10 ఓవర్లలోనే ఊదిపారేశారు సన్‌రైజర్స్‌ ఓపెనర్లు. అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌.. ఈ సీజన్‌లో ఎలాంటి విధ్వంసకర బ్యాటింగ్‌ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే పంథాను కొనసాగించి.. లక్నో బౌలర్లను ఊచకోత కోశారు. ఏ బౌలర్‌ కూడా అభిషేక్‌, ట్రావిస్‌ హెడ్‌ ముందు నిలువలేకపోయారు. ఫోర్లు, సిక్సులతో ఉప్పల్‌ స్టేడియం దద్దరిల్లిపోయింది.

ఇదే పిచ్‌పై 165పరుగులు చేసేందుకు లక్నో ఆపసోపాలు పడింది. తొలి పది ఓవర్లకు లక్నో చేసిన స్కోర్‌ కేవలం 57 పరుగులు మాత్రమే. కానీ, ఎస్‌ఆర్‌హెచ్‌ 9.4 ఓవర్లలో 167 పరుగులు బాదేసింది. కేఎల్‌ రాహుల్‌ 33 బంతుల్లో 29 చాలా స్లోగా ఆడాడు. మరో ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ 2, స్టోయినీస్‌ 3 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. చివర్లో పూరన్‌ 48, బదోని 55 పరుగులు చేయడంతో ఆ మాత్రం పోరాటే టార్గెట్‌ వచ్చింది. కానీ, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బాదుడు ముందు ఆ స్కోర్‌ అసలు ఏ మాత్రం నిలువలేకపోయింది. అభిషేక్‌ శర్మ 28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సులతో 75 పరుగులు, ట్రావిస్‌ హెడ్‌ 30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సులతో 89 పరుగులు చేసి.. 9.4 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించారు. ఈ భారీ విజయంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 14 పాయింట్లతో పాయింట్లలో మూడో స్థానంలోకి దూసుకెళ్లింది. రన్‌రేట్‌ కూడా భారీగా మెరుగుపడింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ 33 బంతుల్లో 29 పరుగులు, క్వింటన్‌ డికాక్‌ 2 పరుగులు మాత్రమే చేసి.. దారుణంగా నిరాశపర్చారు. స్టోయినీస్‌ 3, కృనాల్‌ పాండ్యా 24 కూడా విఫలం అయ్యారు. చివర్లో పూరన్‌ 26 బంతుల్లో 48, ఆయూష్‌ బదోని 30 బంతుల్లో 55 పరుగులు చేసి రాణించారు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ 2, కెప్టెన్‌ కమిన్స్‌ ఒక వికెట్‌ తీసుకున్నారు. ఇక 166 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ కేవలం 9.4 ఓవర్లలోనే ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా 167 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ 28 బంతుల్లో 75, ట్రావిస్‌ హెడ్‌ 30 బంతుల్లో 89 పరుగులు చేసి విధ్వంసం సృష్టించారు. లక్నో బౌలర్లు అంతా 14 పైగా ఎకానమీతో దారుణంగా విఫలం అయ్యారు. మరి ఈ మ్యాచ్‌లో అతి తక్కువ ఓవర్లలో 160 ప్లస్‌ టార్గెట్‌ను ఛేజ్‌ చేసిన టీమ్‌గా సన్‌రైజర్స్‌ నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments