Nayanthara Women's Day Shocking Gift: నయనతార విమెన్స్ డే షాకింగ్ గిఫ్ట్!

Nayanthara: నయనతార విమెన్స్ డే షాకింగ్ గిఫ్ట్!

ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. లేడీ సూపర్​స్టార్ నయనతార కూడా ఈ రోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఆమె షాకింగ్ గిఫ్ట్ ఇచ్చారు.

ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. లేడీ సూపర్​స్టార్ నయనతార కూడా ఈ రోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఆమె షాకింగ్ గిఫ్ట్ ఇచ్చారు.

ఆడవాళ్ల గురించి అవాక్కులు, చెవాక్కులు రాయకండి.. అమ్మాయిల జీవితాలతో ఆడుకోకండని మొన్నీ మధ్యే తమిళ తెలుగు కథానాయకి నివేదా పేతురాజ్ పెద్ద పోస్ట్ పెట్టింది ఎక్స్​లో. ఐ డ్రీమ్ ఛానెల్ విమెన్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూలో సీనియర్ హీరోయిన్ జయసుధ మాట్లాడుతూ.. ఆడవాళ్ల మీదనైతే ఇష్టం వచ్చినట్టు రాస్తారు, అదే హీరోల మీద రాయరని, రాయడానికి గట్స్ లేవని, రాస్తేగీస్తే అభిమానులు కాళ్లు విరగ్గొడతారనే భయంతో రాయరని బోల్డ్ వేలో చెప్పారు.

ఈ మధ్య రోజుల్లో నయనతార మీద పెద్ద స్థాయిలోనే సోషల్ మీడియాలో హల్​చల్ జరిగింది. భర్తతో ఆమె తెగదెంపులు చేసేసుకుందని, ఇంకొన్నాళ్లలో విడాకుల వార్త కూడా వచ్చేస్తుందని తెగ జోస్యం చెప్పినట్టుగా మొదలెట్టారు. దానికంతటికీ కారణమేంటంటే భర్త విఘ్నేష్ శివన్ ఇన్​స్టాను నయనతార అన్​ఫాలో చేసేసిందట. ఆ చిన్న కారణానికి నయనతార మీద దుమ్మెత్తిపోసింది సోషల్ మీడియా. పూర్తిగా అవగాహనతో, పక్కా సమాచారంతో ఏది రాసినా సబబే. అప్పటికీ, ఎంత నిజమైన వార్త అయినా కూడా, ముఖ్యంగా సినిమా హీరోయిన్ల విషయంలో ఒకటికి రెండుసార్లు కన్ఫర్మ్ చేసుకొని రాస్తే గౌరవప్రదంగా ఉంటుంది. రాసేవాళ్లకు కూడా మర్యాద మిగులుతుంది. కానీ తెలిసీ తెలియకుండా రాయడంతో, కేవలం వైరల్ కావడమే ప్రధాన ధ్యేయంగా రాస్తుంటే, సోషల్ మీడియా రేంజ్ కూడా పూర్తిగా దెబ్బతింది.

నయనతార తన మీద వైరల్ చేసిన తప్పుడు వార్తకి ప్రత్యేకంగా సమాధానాలు చెప్పడమో, సంజాయిషీలు ఇచ్చుకోవడమో కాకుండా, ఓ కొత్త పద్ధతిలో చెక్ పెట్టింది. భర్త విఘ్నేష్, తన పిల్లలు ఉయిర్, ఉలఘ్ ఇద్దరితో తన ఇన్​స్టాలో ఫోటోలు పెట్టింది. విమానంలో జాలీ ట్రిప్​కు వెళ్తున్నప్పుడు తీసిన ఫోటోలను షేర్ చేసింది. అందులో భర్త విఘ్నేష్​తో ఉయిర్, తనతో ఉలఘ్ ఉన్న ఫోటో పెట్టడంతో అది వీర లెవెల్లో వైరల్ అయింది. వైరల్ కావడమే కాదు, అందరి అనుమానాలను పటాపంచలు చేసింది. ముఖ్యంగా నయనతార అభిమానులు చాలా గర్వంగా ఉందని చెబుతూ పోస్టులు పెట్టి పండగ చేసుకుంటున్నారు. తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, మెసేజెస్ కూడా నయనతారకి నేరుగా కొందరు పంపిస్తున్నారు.

నయనతారతో డైరెక్ట్ యాక్సిస్ లేనివాళ్లు ట్విట్లర్​లోనూ, ఇన్ స్టాలోనూ, ఫేస్​బుక్​లోనూ సంతోషాన్ని ఎక్స్​ప్రెస్ చేస్తూ వీరంగం తొక్కుతున్నారు. మహిళలైతే మాకిదే విమెన్స్ డే రియల్ గిఫ్ట్ అని మరీ రాస్తున్నారు. సినిమావాళ్లంటే ఉండే క్రేజ్ అండ్ రేంజ్​ను కొందరు ఉపయోగించుకొని పాపులర్ కావడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఇటువంటి దుష్ప్రచారాలు, లేనిపోని దుమారాలు లేపుతున్నారు. కానీ నయన్ మాత్రం కరెక్టు టైమ్​కు, కరెక్ట్ పోస్టుతో షాకిచ్చింది. మరి.. నయన్ వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Gaami OTT Release: ఆ OTTలోకి గామి ఫిక్స్! కానీ.., ధియేటర్ లో మిస్ కాకండి!

Show comments