వీడియో: చెవులు పగిలిపోయే సౌండ్‌ మధ్య బ్యాటింగ్‌కి వచ్చిన ధోని! పరువుతీసిన పటేల్‌!

వీడియో: చెవులు పగిలిపోయే సౌండ్‌ మధ్య బ్యాటింగ్‌కి వచ్చిన ధోని! పరువుతీసిన పటేల్‌!

MS Dhoni, Harshal Patel, CSK vs PBKS: ఈ సీజన్‌లో ధోని బ్యాటింగ్‌కి వస్తుంటే.. స్టేడియాలు దద్దరిల్లుతున్నాయి. ఆదివారం పంజాబ్‌తో మ్యాచ్‌లో కూడా సేమ్‌ హైప్‌తో క్రీజ్‌లోకి వచ్చిన ధోని పరువు తీశాడు హర్షల్‌ పటేల్‌. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

MS Dhoni, Harshal Patel, CSK vs PBKS: ఈ సీజన్‌లో ధోని బ్యాటింగ్‌కి వస్తుంటే.. స్టేడియాలు దద్దరిల్లుతున్నాయి. ఆదివారం పంజాబ్‌తో మ్యాచ్‌లో కూడా సేమ్‌ హైప్‌తో క్రీజ్‌లోకి వచ్చిన ధోని పరువు తీశాడు హర్షల్‌ పటేల్‌. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ 2024 ధోనికి చివరి ఐపీఎల్‌ అని చాలా మంది క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. అందుకే చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌ జరిగిన ప్రతిసారి ధోని బ్యాటింగ్‌కు రావాలని స్టేడియంలోని క్రికెట్‌ అభిమానులంతా డిమాండ్‌ చేస్తూ ఉంటారు. ధోని ధోని అంటూ అరుస్తూ ఉంటారు. ఏ టీమ్‌తో మ్యాచ్‌ జరిగినా.. ఒక్క ధోని విషయంలో మాత్రం రెండు టీమ్స్‌ అభిమానులు ఒక్కటైపోతారు. అంత ఫాలోయింగ్ ఉంది ధోని. అతని బ్యాటింగ్‌ చూడాలని.. చివర్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ వికెట్లు కోల్పోవాలని కూడా ఆ జట్టు అభిమానులే కోరుకుంటూ ఉంటారు. ఆదివారం పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ ఇవే సీన్స్‌ కనిపించాయి. కానీ, అందులోనే ఓ ఊహించని ట్వీస్ట్‌ చోటు చేసుకుంది.

ధర్మశాల వేదికగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌ అజింక్యా రహానె 9 పరుగులు మాత్రమే చేసి త్వరగానే అవుటైనా.. మరో ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌, డారిల్‌ మిచెల్‌ మంచి బ్యాటింగ్‌తో రెండో వికెట్‌కు 50 ప్లస్‌ రన్స్‌ జోడించారు. 21 బంతుల్లో 32 పరుగులు చేసిన తర్వాత రుతురాజ్‌ అవుట్‌ అయ్యాడు. ఆ వెంటనే నెక్ట్స్‌ బాల్‌కు శివమ్‌ దూబే సైతం క్యాచ్‌ అవుట్‌ అయ్యాడు. వారి వెంటే మిచెల్‌, మొయిన్‌ అలీ, మిచెల్‌ సాంట్నర్‌ ఇలా వరుస బెట్టి పెవిలియన్‌కు క్యూ కట్టారు. అయితే.. 16వ ఓవర్‌ చివరి బంతికి సాంట్నర్‌ అవుటైన తర్వాత.. ధోని వస్తాడని, రావాలని స్టేడియం మొత్తం హొరెత్తింది. కానీ, శార్దుల్‌ ఠాకూర్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు.

కొన్ని మంచి షాట్లు ఆడిన తర్వాత 19వ ఓవర్‌ 4వ బంతికి శార్ధుల్‌ ఠాకూర్‌ అవుటైన తర్వాత.. ధోని బ్యాటింగ్‌కు వచ్చాడు. ధోని డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి క్రీజ్‌లో వచ్చేంత వరకు కెమెరా మెన్‌ ధోనినే చూపించాడు. ఆ టైమ్‌లో ధోని.. ధోని.. అంటూ స్టేడియంలో దద్దరిల్లింది. ధోని బ్యాటింగ్‌ చూసేందుకే చాలా మంది స్టేడియానికి వచ్చినట్లు ఉన్నారు. కానీ, వాళ్లందరిని నిరాశపరుస్తూ.. ధోని ఎదుర్కొన్న తొలి బంతికే క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. దాంతో స్టేడియంలో మొత్తం ఒక్కసారిగా పిన్‌డ్రాప్‌ సైలెంట్‌ అయిపోయింది. భారీ హైప్‌తో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని స్లోవర్‌ బాల్‌తో గోల్డెన్‌ డక్‌తో క్లీన్‌ బౌల్డ్‌ చేసి.. పంజాబ్‌ బౌలర్‌ హర్షల్‌ పటేల్‌.. ధోని పరువుతీయడంతో పాటు.. క్రికెట్‌ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చాడంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments