T20 World Cup 2024 Pat Cummins Warning: టీ20 వరల్డ్‌ కప్‌కు ముందు.. అన్ని టీమ్స్‌కు కమిన్స్‌ మాస్‌ వార్నింగ్‌!

Pat Cummins: టీ20 వరల్డ్‌ కప్‌కు ముందు.. అన్ని టీమ్స్‌కు కమిన్స్‌ మాస్‌ వార్నింగ్‌!

టీ20 వరల్డ్ కప్​కు ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్ని జట్లకు వార్నింగ్ ఇచ్చాడు. ముఖ్యంగా బడా టీమ్స్​ను టార్గెట్ చేసుకొని మరీ అతడు హెచ్చరికలు పంపించాడు.

టీ20 వరల్డ్ కప్​కు ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్ని జట్లకు వార్నింగ్ ఇచ్చాడు. ముఖ్యంగా బడా టీమ్స్​ను టార్గెట్ చేసుకొని మరీ అతడు హెచ్చరికలు పంపించాడు.

టీ20 వరల్డ్ కప్-2024 హడావుడి అప్పుడే షురూ అయింది. మెగా టోర్నీ మొదలవడానికి దాదాపుగా నెల రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో అన్ని టీమ్స్ తమ ప్రపంచ కప్ స్క్వాడ్స్​ను ప్రకటించే పనిలో పడ్డాయి. ఇప్పటికే టీమిండియా, న్యూజిలాండ్​తో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్​లు తమ వరల్డ్ కప్ టీమ్స్​ను ప్రకటించాయి. ఈ అనౌన్స్​మెంట్స్​తో ఏ టీమ్ ఎంత బలంగా ఉంది? ఏ జట్టుకు వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? ప్రపంచ కప్ సెమీస్​కు వెళ్లే సత్తా ఎవరికి ఉందనే చర్చలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వరల్డ్ కప్ టీమ్స్​కు మాస్ వార్నింగ్ ఇచ్చాడు.

సన్​రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతూ ఐపీఎల్​లో బిజీగా ఉన్నాడు కమిన్స్. ఈ ఏడాది టీమ్​లోకి వస్తూనే సారథ్య బాధ్యతలు కూడా తీసుకున్నాడు. అతడి కెప్టెన్సీలో జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ప్లేఆఫ్స్ రేసులో ఉన్న ఆరెంజ్ ఆర్మీ ఈసారి ఐపీఎల్​ ట్రోఫీ కొట్టడం పక్కా అని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఈ క్రమంలో కెప్టెన్ కమిన్స్ ఒకవైపు మ్యాచ్​లు ఆడుతూనే వీలు కుదిరినప్పుడల్లా పలు ఇంటర్వ్యూలు, ఇతర కార్యక్రమాలు, యాడ్స్​తో బిజీగా ఉంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడికి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. దీనికి కమిన్స్ అంతే ఇంట్రెస్టింగ్​గా ఆన్సర్ ఇచ్చాడు.

టీ20 ప్రపంచ కప్-2024లో ఏ టీమ్స్ టాప్-4లో ఉంటాయని మీరు భావిస్తున్నారని యాంకర్ కమిన్స్​ను అడిగింది. దీనికి అతడు వెంటనే కచ్చితంగా ఆస్ట్రేలియా అందులో ఉంటుందని చెప్పాడు. మిగతా 3 జట్టు ఏంటనేది మీరే ఎంపిక చేయాలన్నాడు. అప్పడు ఆసీస్​ను మినహాయించి ఏ మూడు టీమ్స్ సెమీస్ చేరితే బాగుండని మీరు అనుకుంటున్నారని ప్రశ్నించింది యాంకర్. దీనికి అతడు ఎవ్వరొచ్చినా డోన్ట్ కేర్, ఏ టీమ్ అయినా ఫర్వాలేదు రమ్మనండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు. గతేడాది కమిన్స్ సారథ్యంలో ఆసీస్ వన్డే వరల్డ్ కప్ గెలుచుకుంది. ఇప్పుడు మిచెల్ మార్ష్​ కెప్టెన్సీలో పొట్టి కప్పులో పాల్గొననుంది. ఈ నేపథ్యంలో టోర్నీ మొదలవక ముందే ఎవరొస్తారో రమ్మనండి.. డోన్ట్ కేర్ అంటూ కమిన్స్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. మరి.. కమిన్స్ హెచ్చరికపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Show comments