Geethanjali Malli Vachindi: OTTలోకి నవ్విస్తూనే భయపెట్టే తెలుగు దెయ్యం సినిమా!

OTTలోకి నవ్విస్తూనే భయపెట్టే తెలుగు దెయ్యం సినిమా!

Geethanjali Malli Vachindi: వారం వారం ఓటీటీలో ఎన్నో రకాల సినిమాలు విడుదల అవుతుంటాయి. థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టి, నవ్వించే హర్రర్ సినిమాలు కూడా ఓటీటీలో సందడి చేస్తుంటాయి. అలాంటి ఓ తెలుగు హర్రర్ మూవీ ఓటీటీలోకి రానుంది.

Geethanjali Malli Vachindi: వారం వారం ఓటీటీలో ఎన్నో రకాల సినిమాలు విడుదల అవుతుంటాయి. థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టి, నవ్వించే హర్రర్ సినిమాలు కూడా ఓటీటీలో సందడి చేస్తుంటాయి. అలాంటి ఓ తెలుగు హర్రర్ మూవీ ఓటీటీలోకి రానుంది.

ప్రతివారం థియేటర్లలో , ఓటీటీలో ఎన్నో రకాల సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇక ఆడియన్స్ థియేటర్లకి వెళ్లి సినిమానులూ చేసి ఎంజాయ్ చేయడంతో పాటు ఓటీటీలోనూ చూస్తుంటారు. ఇంకా చెప్పాలంటే ఇటీవల కాలంలో ఓటీటీ లవర్స్ బాగా పెరిగిపోయారు. ఇందుల్లో వచ్చే వెబ్ సిరీస్, సినిమాలను వదలకుండా చూస్తుంటారు. ఇదే సమయంలో ఓటీటీలో వచ్చే సినిమాలకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే వారి కోసం ఓ తెలుగు దెయ్యం సినిమా ఓటీటీలోకి రానుంది. నవ్విస్తూనే భయపెట్టే ఆ తెలుగు సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో రకాల హర్రర్ మూవీలు వచ్చాయి. కొన్ని ఆడియన్స్ ని భయ పెట్టగా, మరికొన్ని సినిమాలు మాత్రం భయపెడుతూ నవ్వించాయి. ఇలా హార్రర్ జోనర్ లో వచ్చిన పలు సినిమాలు హిట్ గా నిలిచాయి. థియేటర్లలో విడుదలై..ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. అనంతరం ఓటీటీలోకి కూడా వచ్చి సందడి చేస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటే ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా. ప్రముఖ హీరోయిన  అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్ల సందండి చేసింది. అక్కడ చూసిన ఆడియాన్స్ మరోసారి ఓటీటీలో చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తెలుగు నటి అంజలి ప్రధాన పాత్రలో నటించిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ మూవీ హర్రర్ కామెడీగా తెరక్కెకింది.  గతంలో ఆమె నటించిన ‘గీతాంజలి’కి సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందింది. క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రాన్ని కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించారు. ఇందులో సునీల్, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, సత్య, అలీ, రవిశంకర్, శైలజా ప్రియ తదితరులు నటించారు. ఈ మూవీకి ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ ఇచ్చాడు. గీతాంజలికి సీక్వెల్ గా రావడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు కూడా శివ తుర్లపాటినే దర్శకత్వం వహించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆరంభంలో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఆ తరువాత అలానే థియేటర్లలో రన్ అయింది. ఇదే  సమయంలో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ అదిగో అప్పుడు, ఇప్పుడు అంటూ అనేక వార్తలు వచ్చాయి. తాజాగా మాత్రం ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

నవ్విస్తూనే భయపెట్టే స్టోరీతో రూపొందిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఫేమస్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందని తెలుస్తోంది. అలా అందరూ అనుకున్నట్లుగానే ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా తాజాగా ఓటీటీ డేట్‌ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మే 10వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకు రాబోతున్నారట ఇండస్ట్రీలో ప్రచారం టాక్ వినిపిస్తోంది. ఈ విషయాన్ని సదరు సంస్థ ఈ రెండు మూడు రోజుల్లోనే అధికారికంగా ప్రకటించబోతుందని సమాచారం.

Show comments