Bank ఉద్యోగం మీ లక్ష్యమా?.. పరీక్ష రాయకుండానే Job పొందే అవకాశం.. 25 వేల జీతం

Bank ఉద్యోగం మీ లక్ష్యమా?.. పరీక్ష రాయకుండానే Job పొందే అవకాశం.. 25 వేల జీతం

బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ జాబ్స్ ను అస్సలు వదలకండి. నెలకు 25 వేల జీతంతో ప్రముఖ బ్యాంకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రాత పరీక్ష లేదు. వెంటనే అప్లై చేసుకోండి.

బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ జాబ్స్ ను అస్సలు వదలకండి. నెలకు 25 వేల జీతంతో ప్రముఖ బ్యాంకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రాత పరీక్ష లేదు. వెంటనే అప్లై చేసుకోండి.

ప్రభుత్వ ఉద్యోగాల తర్వాత అంతటి క్రేజ్ ఉండే జాబ్స్ ఏవైనా ఉన్నాయా అంటే అవి బ్యాంకు జాబ్స్ మాత్రమే. బ్యాంకు ఉద్యోగాల కోసం యువత ఎదురుచూస్తూ ఉంటుంది. నిత్యం బ్యాంకు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతూనే ఉంటారు. బ్యాంకు ఉద్యోగమైతే మంచి జీతం. వారానికి రెండు రోజులు సెలవులు ఇతర సౌకర్యాలు ఉంటాయి. అందుకే బ్యాంకు ఉద్యోగాలకు అంతటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన బ్యాంకుల నుంచి జాబ్ నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో ప్రముఖ బ్యాంకు పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రాత పరీక్ష రాయకుండానే ఈ ఉద్యోగాలను పొందొచ్చు. వెంటనే అప్లై చేసుకోండి.

బ్యాంకు ఉద్యోగాలు సాధించడం మీ లక్ష్యమైతే ఇదే మంచి అవకాశం. బ్యాంక్ ఆఫ్ బరోడా బిజినెస్ కరస్పాండెంట్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మే 15 వరకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

విద్యార్హత:

  • ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.

వయోపరిమితి:

  • ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు వారి కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

  • ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు.

జీతం:

  • అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, ఈ పోస్టులకు ఎంపికైన ఏ అభ్యర్థికైనా నెలకు రూ. 25,000 జీతం చెల్లించబడుతుంది.

దరఖాస్తు విధానం:

అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను నింపి సంబంధిత పత్రాలతో పాటుగా.. అసిస్టెంట్ జనరల్ మేనేజర్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ప్రాంతీయ కార్యాలయం, బరోడా సిటీ రీజియన్ II, గ్రౌండ్ ఫ్లోర్, సూరజ్ ప్లాజా 1, సయాజిగంజ్, బరోడా – 390005 చిరునామాకి పంపాలి. ఆఫ్ లైన్ అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ మే 15,2024.

Show comments