Breath Movie OTT Review & Rating In Telugu: చైతన్య కృష్ణ బ్రీత్ మూవీ OTT రివ్యూ

Breathe OTT Review: చైతన్య కృష్ణ బ్రీత్ మూవీ OTT రివ్యూ

Breathe Movie OTT Review & Rating In Telugu: నందమూరి చైతన్య కృష్ణ ఇటీవల నటించిన బ్రీత్ సినిమా ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. మరి.. ఆ బ్రీత్ మూవీ ఓటీటీ రివ్యూ చూద్దాం.

Breathe Movie OTT Review & Rating In Telugu: నందమూరి చైతన్య కృష్ణ ఇటీవల నటించిన బ్రీత్ సినిమా ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. మరి.. ఆ బ్రీత్ మూవీ ఓటీటీ రివ్యూ చూద్దాం.

సాధారణంగా ఏ హీరో అయినా కొన్నాళ్లపాటు స్క్రీన్ కి దూరంగా ఉండి మళ్లీ కెరీర్ ని స్టార్ట్ చేస్తారు. అలా చేసిన వాళ్లు చాలామందే ఉన్నారు. కానీ, ఏకంగా 20 ఏళ్లు సినిమాకి దూరంగా ఉండి తర్వాత కెరీర్ ప్రారంభించిన వాళ్లు ఎవరూ లేరనుకుంట. అలాంటి ఘనత సాధించిన నందమూరి హీరో చైతన్య కృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ‘ధమ్’ అనే మూవీతో తెరంగేట్రం చేసిన నందమూరి చైతన్య కృష్ణ మళ్లీ 20 ఏళ్ల తర్వాత బ్రీత్ అనే మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. మరి.. బ్రీత్ సినిమా ఓటీటీ రివ్యూ చూద్దాం.

కథ:

ఆధిత్య వర్మ(కేశవ్ దీపక్) పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు మాత్రమే కాకుండా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా. ఆయన హత్యకు కొందరు కుట్ర పన్నుతారు. ముఖ్యమంత్రి ఆధిత్య వర్మ ఓరోజు గోల్ఫ్ ఆడిన తర్వాత స్పృహ తప్పి పడిపోతారు. ఆయనను బ్రీత్ ఆస్పిటల్ లో చేరుస్తారు. అయితే ముఖ్యమంత్రి ప్రాణానికి హాని ఉందని తెలిసిన అభి(చైతన్య కృష్ణ).. ఆయన్ను కాపాడేందుకు అదే హాస్పిటల్ లో జాయిన్ అవుతాడు. అయితే అసలు అభి ముఖ్యమంత్రిని కాపాడగలిగాడా? ఆ ప్రయత్నంలో అతనికి ఎదురైన ఛాలెంజెస్ ఏంటి? అసలు ముఖ్యమంత్రిని కాపాడేందుకు అభి ఎందుకు వచ్చాడు? అభికి- సీఎంకు ఉన్న రిలేషన్ ఏంటి? అసలు ముఖ్యమంత్రికి ఉన్న ప్రమాదంలో డాక్టర్స్ పాత్ర ఎంత? అనేదే మిగిలిన కథ.

విశ్లేషణ:

ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రముఖులకు చికిత్స, వారి మరణవార్తల చుట్టూ ఒక మంచి థ్రిల్లర్ ని మలిచే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అప్పట్లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఏకంగా 75 రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందారు. కానీ, చివరకు ఆవిడ ఇక లేరు అంటూ ప్రకటించారు. అప్పట్లో ఆవిడ మృతిపై చాలానే అనుమానాలు వచ్చాయి. అలాంటి ఘటనలు ఈ బ్రీత్ మూవీకి ఇన్ స్పిరేషన్ అయ్యే ఆస్కారం ఉంది. వీఐపీలు, వీవీఐపీలు ఆస్పత్రిలో చేరితే చాలానే హడావుడి ఉంటుంది. హెల్త్ బులిటెన్స్ వస్తూనే ఉంటాయి. కానీ, వారి హెల్త్ నిజంగా ఎలా ఉంది అని చెప్పే పరిస్థితి ఉండదు. ఒక్కోసారి ఆస్పత్రిలో ఏం జరుగుతోందో కూడా అర్థంకాని పరిస్థితి. ఈ మూవీ పాయింట్ కూడా దానిని బేస్ చేసుకునే ఉంటుంది.

డైరెక్టర్ వంశీకృష్ణ చాలా మంచి పాయింట్ ని పట్టుకున్నారు. కథలో కావాల్సినన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్, ట్విస్టులు పెట్టుకోవచ్చు. మెడికల్ మాఫియాని ఎంతో చక్కగా చూపించొచ్చు. కానీ, ఎక్కడా అలాంటి పని చేసినట్లు అనిపించదు. పైగా మ్యూజిక్ కూడా తేలిపోతుంది. హీరో ఎందుకు సీఎం కోసం అంత పోరాడుతున్నాడు? అసలు వాళ్లిద్దరు ఏమవుతారు? అనే సస్పెన్స్ కాస్త డ్రాగ్ చేసుంటే సినిమాపై ఆసక్తి కలిగి ఉండేది. కానీ అసలు పాయింట్ ని ఓపెనింగ్ లోనే రివీల్ చేసి కథపై ఆసక్తి లేకుండా చేసేశారు. టేకింగ్ లో కూడా చాలానే మిస్టేక్స్ కనిపిస్తాయి. చైతన్య కృష్ణ డైలాగ్స్ లో స్పష్టత ఉండదు. చాలా సీన్స్ లో వాయిస్ ఓవర్ ఉంటుంది. అక్కడ ఏం జరుగుతోందో కనిపిస్తూనే ఉంటుంది. కానీ, దానికి వాయిస్ ఓవర్ ఎందుకు వస్తోంది అనే విషయం అర్థం కాదు.

నటీనటులు- టెక్నికల్ టీమ్ పనితీరు:

ఈ సినిమాలో చైతన్య కృష్ణ నేరుగా డైలాగ్స్ ఎప్పుడు చెప్తారు అని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎక్కడా కూడా ఈ సీన్ లో ఇరగదీశాడు అనే భావన రాదు. మూవీ మొత్తం ఒకటే సీరియస్ లుక్స్ ని కంటిన్యూ చేశారు. ఈ మూవీలో పెద్దగా చెప్పుకోదగ్గ కాస్ట్ కూడా లేకపోవడం నిరాశ పరిచే అంశం. ఇంక డైరెక్టర్ అయితే సినిమా తీయాలి అని తీశారేమో అనే భావన కలుగుతుంది. టెక్నికల్ వర్క్ కూడా అంతేం మెప్పించదు. ముఖ్యంగా టెక్నికల్ టీమ్ ఇంకాస్త ఎఫర్ట్స్ పెట్టాలేమో అనిపిస్తుంది. డైరెక్టర్ వంశీకృష్ణ మూవీని మాత్రం ఆసక్తిగా తెరకెక్కించడంలో పూర్తిగా విఫలమయ్యారు అనే అభిప్రాయం కలుగుతుంది.

బలాలు:

  • కాన్సెప్ట్

బలహీనతలు:

  • పాటలు
  • కామెడీ
  • సాగదీత

రేటింగ్: 1.5/5

చివరిగా: బ్రీత్ చూస్తున్నంతసేపు.. ఉక్కిరి బిక్కిరే..

(*ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)
Show comments